కులం-బహుజన ప్రజాస్వామిక విప్లవ దశ… కొన్ని ప్రశ్నలు, పరిమితులు
‘’కులం బహుజన ప్రజాస్వామిక విప్లవ దశ’’ అనే ఈ పుస్తకంలో సామాజిక మార్పును చారిత్రకంగా, భౌతికవాద దృష్టితో పరిశీలిస్తూ, అందులో భాగంగా కుల సమస్యను సీరియస్ గా తీసుకొని విశ్లేషించి రాసిన వ్యాసాలున్నాయి. అందువల్ల ఇది అందరూ చదవాల్సిన ముఖ్యమైన పుస్తకం. అయితే ఒక పుస్తకం ముఖ్యమైన మంచి పుస్తకం అని అంటున్నానంటే అందులోని విషయాలన్నింటి పట్ల పూర్తి ఏకీభావం ఉన్నట్టు కాదు. ముఖ్యంగా ఇందులో రచయిత పట్టా వెంకటేశ్వర్లు గారు చేసిన కొన్ని నిర్ధారణల పట్ల నాతో సహా కొందరు మార్క్సిస్టు లకు విభేదం ఉండవచ్చు. అవి విప్లవ కమ్యూనిస్టులకు సంబంధించినవి అయినందువల్ల మాత్రమే కాక




