అంటరాని అస్తిత్వపు ఆత్మకథ
ప్రజలను తమ నుంచి తమనే కాకుండా యావత్ చరిత్ర నుండి కూడా పరాయీకరించే నేటి విధ్వంసక కాషాయ రాజకీయ ఫాసిస్టు పాలనా సందర్భంలో ఇప్పటికి పదేళ్ల క్రితమే డా. వై.వి. సత్యనారాయణ గారు రాసిన My Father Balaiah అనే ఇంగ్లీష్ పుస్తకానికి ఎంతో ప్రాసంగికత ఉంది. తెలుగులోనూ అనువాదమై వచ్చిన ‘’మా నాయన బాలయ్య’’ అనే పుస్తకాన్ని ఒకానొక దళిత కుటుంబపు ఆత్మకథాత్మక పూర్వీకుల జీవిత చరిత్రగానే గాక యావత్ మాదిగ అస్తిత్వపు మూలాల దృఢ ప్రకటనగా చూస్తేనే చాలా సముచితంగా ఉంటుంది. ఇలా ప్రకటించడంలో స్వీయ అస్తిత్వానికి సంబంధించిన అచంచల ఆత్మవిశ్వాసం,