సమీక్షలు

రెప్పవాల్చని చూపు          

 'అట్టడుగున అందరమూ మానవులమే' అన్న కవి మాటల్లో జీవశాస్త్రపరమైన అర్ధానికి మించిన సామాజిక మానవసారం ఇమిడి ఉంది. అటువంటి ప్రాకృతిక మానవసారంతో తొణికి సలాడే మనిషి కేంద్రంగా రాసిన కవిత్వమే మిత్రుడు ఎన్. వేణుగోపాల్ 'రెప్పవాల్చని కాపలా'.  మరి కవి వేణుగోపాల్ పావురపడే మనిషి ఎవరు? ఆ మనిషి అతడు కావచ్చు. ఆమె కావచ్చు. మరి అతడు/ ఆమె కేవలం ఒక్క వ్యక్తేనా? కానే కాదు. మనిషి అస్తిత్వానికి ఏకరూపం లేదు. బహు రూపాలు ఉన్నాయి. అనంతమైన భిన్నత్వం ఉంది. కనుక సహజంగానే మనిషి ఆలోచనలోను, ఆచరణలోనూ అటువంటి విభిన్నత్వమే ఉంటుందని ఈ కవి భావిస్తాడు. అయితే ఆయనకు
లోచూపు సాహిత్యం సమీక్షలు

అంటరాని అస్తిత్వపు ఆత్మకథ

      ప్రజలను తమ నుంచి తమనే కాకుండా యావత్ చరిత్ర నుండి కూడా పరాయీకరించే నేటి విధ్వంసక  కాషాయ రాజకీయ ఫాసిస్టు పాలనా సందర్భంలో ఇప్పటికి  పదేళ్ల క్రితమే డా. వై.వి. సత్యనారాయణ గారు రాసిన My Father Balaiah అనే ఇంగ్లీష్ పుస్తకానికి ఎంతో ప్రాసంగికత ఉంది. తెలుగులోనూ అనువాదమై  వచ్చిన ‘’మా నాయన బాలయ్య’’ అనే పుస్తకాన్ని ఒకానొక దళిత కుటుంబపు  ఆత్మకథాత్మక పూర్వీకుల జీవిత చరిత్రగానే గాక యావత్ మాదిగ అస్తిత్వపు మూలాల దృఢ ప్రకటనగా చూస్తేనే చాలా సముచితంగా ఉంటుంది. ఇలా  ప్రకటించడంలో స్వీయ  అస్తిత్వానికి సంబంధించిన అచంచల ఆత్మవిశ్వాసం,
పరిచయం

వెలుగును హత్య చేసిన చీకట్ల కథలే మార్జినోళ్లు

సమాజం పట్ల బాధ్యత గల రచయితల్లో సమాజానికి ఏదో చేయలాని తపన పడి, సమాజం వైపు నిలబడి తమ గళాన్ని విప్పిన వాళ్ళు చాలా అరుదుగా ఉన్నారు. సామాజిక సృహను కలిగి సాహిత్య సేవా దృక్పథంతో, సమాజం మార్పు కోసం ఎల్లప్పుడూ ముందుండే రచయితల కలం నుండి మాత్రమే భావోద్వేగమైన కథలు బయటికొస్తాయి.అలాంటి కథలే పి.శ్రీనివాస్ గౌడ్ రాసిన మార్జినోళ్ళు కథలు.  ఈ కథలు సమాజంపై ప్రభావం చూపే కథలని చెప్పొచ్చు. ఇలాంటి రచయితలు ఒక నిబద్ధత, సమాజం పట్ల కొంత బాధ్యత వుండడం వల్ల కూడా ఇటువంటి కథలను రాస్తారు. నేటి కాలంలో ప్రేమ కవితలకో, కథలకో
పరిచయం

ఈ తరం జమీల్యా

నన్ను కట్టిపడేసి ఓ చోట కూర్చోబెట్టి ప్రేమగా నాకోసం ఓ పాట పాడి, నేను దాటొచ్చిన ప్రేమ కధ చెప్పి ఏడిపించి కళ్ళు తుడుచుకునేలోపే మాయమైంది. ఇప్పుడు ఆమె నా ప్రేయసి. జమిల్యా  అతి త్వరగా అతి తీవ్రంగా అతిగా నేను ప్రేమించిన తక్కువ పాత్రల్లో జమీల్యా ఒకటి. కొన్ని సంవత్సరాల క్రితం నేను ప్రేమించిన నా ప్రియురాలు రాజేశ్వరిని మళ్ళీ చూసినట్టుంది. ఒక చిన్న పెయింటింగ్ చెప్పే కథ. అది గీసిన కుర్రాడి ప్రేమకథ. తన వదిన ప్రేమకథ. ఓ గాయపడిన ఒంటరి సైనికుడి కథ. చాలా మామూలుగా మొదట్లో వేసిన చిత్రం చూడడానికి ఎలా ఉన్నా,
వ్యాసాలు సమీక్షలు

కులం-బహుజన ప్రజాస్వామిక విప్లవ దశ… కొన్ని ప్రశ్నలు, పరిమితులు

‘’కులం బహుజన ప్రజాస్వామిక విప్లవ దశ’’ అనే ఈ పుస్తకంలో సామాజిక మార్పును చారిత్రకంగా, భౌతికవాద దృష్టితో పరిశీలిస్తూ, అందులో భాగంగా కుల సమస్యను సీరియస్ గా  తీసుకొని విశ్లేషించి రాసిన వ్యాసాలున్నాయి. అందువల్ల ఇది అందరూ చదవాల్సిన ముఖ్యమైన పుస్తకం.        అయితే ఒక పుస్తకం ముఖ్యమైన మంచి పుస్తకం అని అంటున్నానంటే అందులోని విషయాలన్నింటి పట్ల పూర్తి ఏకీభావం ఉన్నట్టు కాదు. ముఖ్యంగా ఇందులో రచయిత పట్టా వెంకటేశ్వర్లు గారు చేసిన కొన్ని నిర్ధారణల పట్ల నాతో సహా కొందరు మార్క్సిస్టు లకు విభేదం ఉండవచ్చు. అవి విప్లవ కమ్యూనిస్టులకు సంబంధించినవి అయినందువల్ల మాత్రమే కాక
సమీక్షలు

సీమ‌ కవిత్వంపై కొత్త వెలుగుల “రవ్వల సడి”

రాయలసీమ కవిత్వాన్ని పరిచయం చేస్తూ నేను ఒకానొక ప్రాంతీయ అస్తిత్వ సాహిత్యాన్ని గురించి చెప్పడం ద్వారా ఆ ప్రాంతాన్నీ, దాని వేదనలనూ,  ఆకాంక్షలనూ,  ఆశాభంగాలనూ, అక్కడే పుట్టిపెరిగిన ఆలోచనాపరుల రాతల్లో నుంచి పరిచయం చేసే పని చేశాను - జి. వెంకటకృష్ణ *** ఆధునిక రాయలసీమ కవిత్వాన్ని సమీక్షించడం చిన్న విషయమేమీ కాదు. ఎందుకంటే, కాల ప్రవాహంలో వచ్చి చేరిన కొత్త చేర్పులనూ, కొత్త మార్పులనూ, అవి కవిత్వం లో ప్రవేశింపజేసే విభిన్న వస్తు శిల్పాల పోకడలనూ డైసెక్ట్ చేస్తూ, మొత్తంగా ఆయా కవుల దృక్పధాన్ని అంచనా వేసి, పాఠకులకు చేరవేయడం శ్రమతో కూడుకున్న పని. ఈ పనిని
సమీక్షలు

లోపలి, బైటి ఘర్షణల్లో ‘శికారి’

‘శికారి’నవలలోని కథ జీవితానికి సంబంధించిన ఒక ప్రవాహం. ఆ ప్రవాహం కెసి కెనాల్‌ అనే జల ప్రవాహం ఒడ్డున పెనవేసుకున్న  శికారీల జీవితం.  ఈ జీవన ప్రవాహం ఒక భార్యాభర్తల గొడవతో మొదలౌతుంది..అక్కడ నుండి  శికారిల లోపలి, బైటి వైరుధ్యాల మీదుగా  అలా కొనసాగుతుంది.  చివరికి ఒక ఉత్సవంతో ముగుస్తుంది. ఈ ఆశ నిరాశల జీవన గమ్యం-గమనం ఏమిటి? నిత్యం మారే రాజకీయార్థిక పరిస్థితులు జీవితాన్ని స్థిమితంగా ఒక చోట ఉండనిస్తాయా?  ఆ కదలిక ఈ కథలో ఉంది. చుట్టూ మారుతున్న రాజకీయార్థిక పరిస్థితులు శికారీలను కూడా ప్రభావితం చేస్తాయి. కథనంలో శికారీ పాత్రలు వస్తూ ఉంటాయి. జీవన
సాహిత్యం సమీక్షలు

కార్మికుల సామూహిక చైతన్యమే “స్ట్రైక్” సినిమా సారాంశం

“ఈనాడు బూర్జువా వర్గానికి ముఖాముఖీగా నిలబడిన వర్గాలన్నిటి లోకీ కార్మిక వర్గం ఒక్కటే నిజమైన విప్లవ వర్గం. తక్కిన వర్గాలు ఆధునిక పరిశ్రమల ప్రభావం వల్ల క్షీణించి, క్షీణించి చివరకు అదృశ్యమవుతాయి. కార్మిక వర్గం ఆధునిక పరిశ్రమల ప్రత్యేక సృష్టి. ఆధునిక పరిశ్రమల అతి ముఖ్య సృష్టి”- మార్క్స్, ఏంగెల్స్-కమ్యూనిస్ట్ మేనిఫెస్టో.    1925 లో సోవియట్ యూనియన్ నుంచి వచ్చిన అద్భుతమైన ఆవిష్కరణ “స్ట్రైక్”. ఈ సినిమా డైరెక్టర్ ప్రపంచ ప్రఖ్యాత సోవియట్ చిత్రనిర్మాత “సెర్గీ మిఖాయ్లోవిచ్ ఐసెన్ స్టీన్”.  ప్రపంచ కార్మికులంతా ఏకం కావాలనే సమైక్యవాదం గురించి బలమైన ప్రకటనలు చేసిన  రాజకీయ చిత్రం! దీని నిడివి
సమీక్షలు

గుండె నెత్తురులతో పదునెక్కి  సాగుతున్న విముక్తి చరిత్ర

అల్లం రాజయ్య సాహిత్యం చదవడం అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. రాజయ్య ప్రతి నవల చారిత్రక మట్టి పొరలలో నుండి పుట్టుకొస్తాయి. కాళ్ళ కింద దుమ్ములా పడి ఉంటారు అనుకుంటున్న మట్టిమనుసులు కళ్ళల్లో నలుసులై దొరలను,భూస్వాములను తద్వారా వారికి అండగా నిలబడ్డ రాజ్యంపై ఎదురు తిరిగిన చరిత్రకు అక్షరూపం ఇస్తాడు రాజయ్య. అది కొలిమంటున్నది కావచ్చు, వసంతగీతం కావచ్చు, ఊరు, అగ్నికణం, సైరన్ ఏదైనా కావచ్చు ప్రతిదీ కూడా ఉత్తర తెలంగాణాలో ఉవ్వెత్తున ఎగిసి పడిన పోరాటాల చరిత్రే. అదే వరవడిలో విముక్తి నవల కూడా పోరాటాల చరిత్ర రచనలో భాగంగా వచ్చింది. నక్సల్భరి ఆరంభం గురించి నక్సల్భరి 
సమీక్షలు

ప్రజా దృక్పథం లేని ‘భిన్న దృక్పథాలు’

పర్స్ పెక్టివ్స్ సంస్థ ప్రచురించిన అనువాద వ్యాసాల సంకలనం ‘భిన్న దృక్పథాలు’ భారత విప్లవోద్యమం   చేస్తున్న ప్రజాయుద్ధం గురించి అసమగ్రమైన, స్వీయాత్మకమైన, ప్రజా వ్యతిరేకమైన, వర్గ సామరస్యపూరితమైన వ్యాఖ్యలు చేసింది. కొన్ని వ్యాసాలు, కొన్ని అంశాలు మినహాయిస్తే, ప్రధానంగా, దేశ విశాల పీడిత ప్రజల దృష్టికోణంతో విప్లవోద్యమం కార్యాచరణను చూడలేకపోయింది. ప్రజల విముక్తి కోసం తప్పనిసరి అయిన విప్లవ దృక్పథం నుంచి అర్ధం చేసుకునే ప్రయత్నం చేయలేదు. సామాజిక మార్పు కోసం జరుగుతున్న లోతైన విప్లవ క్రమం గురించి చర్చించేందుకు అవసరమయిన వర్గ దృష్టితో విషయాలను విశ్లేషించలేదు. ఇది వర్గాల మధ్య సాగుతున్న యుద్ధంగా కాకుండా, మనుషుల మధ్య