ఏనుగుల రాజ్యంలో
ఊరు మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఏనుగులు అడవి దాటి సరాసరి కోటూరు వద్ద పొలాల్లోకి వచ్చేసాయి.ఎన్ని వచ్చాయో ఎవరికీ తెలీదు. ఎవరూ సరిగ్గా చూడలేదు. అంత సమయం లేదు. పొలాల్లో అక్కడక్కడా పనులు చేసుకుంటున్న రైతులు అందరూ పలుగూ పారా కత్తీ, కొడవలి, తట్టాబుట్టా ఎక్కడవి అక్కడే పడేసి కేకలు పెట్టుకుంటూ ఒకర్ని ఒకరు హెచ్చరించుకుంటూ పరుగుపరుగున ఊర్లోకి వచ్చేశారు. “ ఏనుగులు వచ్చేసాయి, ఏనుగులంట.. గుంపులు గుంపులుగా వచ్చేసాయంట ..” “ ఈ రోజు ఎవురికి మూడిందో ఏమో .. ఎవరి పంటలు తినేసి, తొక్కేసి పోతాయో ఏమో ? “ “ముండా ఏనుగులు, మిడిమాలం ఏనుగులు