బ్రెస్ట్ టాక్…
'హస్బెండ్ స్టిచ్' 3 చిన్నారి తల్లీ... నన్ను క్షమించు. ఇక ఇవన్నీ వీడ్కోలు దినాలేనా ఇక మనిద్దరికీ? నిన్నూ... నన్నూ బలవంతంగా విడదీస్తున్నారు. అదీ అసహజంగా... ఇవి నీకు పాలు మాన్పిస్తున్న సమయాలు... నీ నోటి నుంచి ఆహారం గుంజుకుంటున్న కాలాలు! ఎంత దౌర్భాగ్యం ఈ అమ్మకు... ఎంత దురదృష్టం నీకు...? పసి బిడ్డ పొట్టగొట్టి మరీ వాంఛ తీర్చుకునేవాడు మరెవరో కాదు తల్లీ... మీ నాన్న! అవును మీ నాన్నే... బాధగా వుందా పాపా? నా రొమ్ములు చిన్నగా ముడుచుకు పోతాయట నువ్వు పాలు తాగితే... నిజానికి నా హృదయం ముడుచుకు పోతుందని మీ నాన్నకు తెలీదు!










