సాయుధపోరాట ఎర్రజెండాను ఎత్తిపట్టిన విరసం మహాసభలు
విప్లవ రచయితల సంఘం (విరసం) 30వ మహాసభలు 2026 జనవరి 24, 25 తేదీల్లో హైదరాబాద్‌లో అత్యంత ఉత్సాహంగా జరిగాయి. "భావజాల, సాంస్కృతిక రంగాల్లో వర్గపోరాటం" అనే ప్రధాన నినాదంతో జరిగిన సభలు ప్రజల్లో నూతన ఉత్సహాన్ని రేకెత్తించాయి. భారతదేశ ప్రజా రాజకీయాల్లో వర్గపోరాట చైతన్యాన్ని రగిలించిన నక్సల్బరీ ఉద్యమ స్ఫూర్తితో 1970లో విప్లవ రచయితల సంఘం (విరసం) ఆవిర్భవించింది. అప్పటి నుండి నేటి వరకు 55 ఏళ్లుగా, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం,నక్సలిబరీ,శ్రీకాకుళం, ఉత్తర తెలంగాణ జగిత్యాల జైత్రయాత్ర , దండకారణ్య పోరాటాల కొనసాగింపుని, అమరవీరుల త్యాగాల చరిత్రను ప్రజలకు రచనలు, కథలు, పాటల ద్వారా ప్రజలకు అందిస్తూ








