వసంతం
వసంతం వచ్చినప్పుడుపువ్వులు ఒక్కసారిగా వికసించవుఅవి అప్పుడే నేలపై వెలిసినట్లుమన కళ్ళకు మాత్రమే అలా కనిపిస్తాయి పూసే ముందుభూమి గర్భంలోనే ఉంటాయిచీకటిలో మాటలులేని తపనతోతమ రంగును శ్వాసలా దాచుకుంటాయిఎవరికీ చేరని లోతుల్లోవాన చప్పుడు వింటాయివేళ్ల నరాల ద్వారాకాలం చేసిన గాయాలను తట్టుకుంటూ నిలబడుతాయి వసంతం అంటేపువ్వుల ఉత్సవం కాదుచీకటిని ఓర్చుకున్నభూమి గుండె తిరుగుబాటు చేసిన క్షణంఅందుకేప్రతి పువ్వు ఒక గాయమేఆ గాయమేఈ ప్రపంచాన్ని పరిమళభరితం చేస్తుంది.










