కవిత్వం

ఇది దుఃఖాన్ని మిగిల్చే కాలం

ఇది కార్పొరేట్, ప్రభత్వాల కలయికలోరాజ్యం కృత్రిమ శిశిరపు కాలానికి పురుడోసింది ఇది కాగర్ శిశిరపు కాలంఇప్పుడు అడవిలో యే ఆకు తనకు తానుగా చెట్టుని విడవడం లేదు యే చెట్టు తనకు తానుగా ఆకుల్ని విడవడం లేదుకొన్నిరాజ్యపు మాయ మాటలకూ లోబడుతున్నాయి కొన్ని బందీ అవుతున్నాయి కొన్ని నేల రాలినెత్తుటితో మట్టిలో కలిసిపోతున్నాయి మరి కొన్ని కాల్చి బూడిదవుతున్నాయి ఇంకా కొన్ని మాత్రం రాజ్యానితో చేతులు కలిపిద్రోహనికి మంచి ముసుగేసినేలరాలి బూడిదయ్యే వాటిని చూస్తూ చెట్ల శివారున వున్న లేలేత ఆకులని సైతంనేల రాల్చేలా చూస్తున్నాయి ప్రస్తుతం రాజ్యం కలల్ని బంధించిందిఇప్పుడు నడుస్తుంది కాగర్ శిశిరపు కాలంఇది దుఃఖాన్ని
కవిత్వం

అతడి మరణం

అతడి మరణం పొద్దుకు తెలిసిందికన్ను తెరిచే వేళన వేకువ గాయపడ్డది.గుడిసెను తాకుతున్న తొలికాంతికన్నీరులా చల్లబారింది.అతడి మరణం నేలను తాకింది.వాలిపోతున్న సాహసానికి ఒడిని చాపింది. మహా ప్రళయాలకు లొంగని పచ్చని గరిక నెత్తురుగా దుఃఖ పడ్డది.అతడి మరణం గాలినీ తాకింది.శూన్యం కాని శూన్యమంతావెక్కిళ్ళలో ధ్వనించింది.అతడి మరణం ప్రాణాలఆశను ఛేదించిందితత్వశాస్త్రం లయ తప్పినట్టుగానమ్మకాలన్నీ బూడిదకుప్పల్లాతేలిపోయాయి.అణచబడ్డ మానవుల శోకానికిసమాధానమతడు.అతడి మరణం పల్లవి తెగిన పాటలాఎదలో సంచరిస్తోంది.అతడి మరణం అడవిని చేరింది.భాషలేని బాధ దుఃఖమై తడిపింది.సద్దుమణగని నినాదంలాకొండకోనల్లో నిలిచింది.అతడి మరణం నిశబ్దం కాదు.కాగుతున్న డప్పులాకాలానికి కంఠాన్ని పొదుగుతుంది.
కవిత్వం

మ‌హా యోధ

వెన్నెల కురిసిన రాత్రిలోఒక పువ్వు వికసించింది .ఆ పువ్వు వికసించడానికి కారణం చీకటిఅడవి తల్లి రక్షణ కోసం.ఆయుధంలా జన్మించాడుప్రజల స్వప్నాల్లో మొక్కలా మొలకెత్తాడుప్రజల ఆశనే, తన లక్ష్యంగా ములుచుకున్న త్యాగమూర్తి అతడుఅన్యాయాన్ని ఎదిరించి గిరిజన ధీరుడయ్యాడురాత్రీ, పగలు అడవి తల్లిని తన కన్నబిడ్డలా కాపాడాడుఅడవికి, జనాలకు అండగానిల్చిన యోధుడతడుఆ కుమురం భీం నుంచిఈ హిడ్మా దాకా అడవి పోరాటం కొనసాగుంది.
కవిత్వం

వాళ్లెక్కడ లేరు?

పసిపాప పాల కోసం ఏడిస్తేతల్లి పాడే జోల పాటలో వారున్నారుబంజరు పట్టిన నేలనుపంటగా మార్చే రైతన్న నాగలిలో ఉన్నారు కొంగు నడుముకు సుట్టుకునిబురదలో నాట్లేసే నాటు పాటలో ఉన్నారు కులం పేర దాడి జరిగితేఆత్మగౌరవం కోసం చేసేపోరాటపు డప్పులు ఉన్నారుఅత్యాచారం చేయబడిన స్త్రీలతిరుగుబాటు పిడికిళ్లలో వారున్నారుపింఛన్ కోసం వెళితేలంచాలకు మరిగిన ఆఫీసర్లనునిలదీతలో వారున్నారుడిమార్ట్లో, ట్రెండ్స్లో చాలీ చాలని జీతాలతో బతుకీడుస్తున్నప్రతి కార్మికుడి కష్టంలో ఉన్నారు అందరికీ దిక్సూచిగా ఉన్నఎర్రని జెండాలో వారున్నారు.
కవిత్వం

రూపాంతరం

గాలి ఒక్కసారిగా సుళ్ళు తిరుగుతూ సాగరాన్ని తాకుతుంది సాగరం తన లోలోపలి అలజడితో ఎగసిపడుతూ నింగిని ముద్దాడుతుంది పగిలిన పెదవితో నింగి అరణ్యాన్ని కౌగిలించుకుంటుంది అరణ్యం తన చేతులలో నిన్ను పొదువుకుంటుంది నువ్వు మరోసారినదిగా మారి పల్లంవైపు ఉరకలేస్తావు!!
కవిత్వం

విప్లవానికి మరణం లేదు

విప్లవం చనిపోదు రక్తం ఎండిపోతే రగిలే మంట అది!నిజం నలిగితే నినదించే గళం అది!గుండెలో దాచిన ఆవేశం కాదు గోళాల కంటే గట్టిగా పేలే శబ్దం అది!జనాల ఊపిరిలో పుడే తుపాన్ అది!అణగారిన ప్రతి కన్నీటిలోనూవిప్లవం మళ్లీ మళ్లీ పుడుతుంది!దాన్ని చంపలేరు, దాన్ని ముంచలేరు దాన్ని నెమ్మదించించలేరు!విప్లవం అంటేన్యాయం కోసం లేచిన గుండె ధైర్యం!మౌనాన్ని విరిచే కేక!అది మన రక్తంలో ముద్రైపోయిన నినాదం!“విప్లవం చనిపోదు — విప్లవం మళ్లీ పుడుతుంది!”
కవిత్వం

వాళ్ళు ఎందుకు వెళ్ళారు?

వాళ్ళు పేరుకోసమే వెళితేవాళ్లకి మారుపేరేందుకు? వాళ్ళు భూమికోసమే వెళితేవాళ్ళ అమ్మ గుడిసెలోనే ఎందుకుంది?వాళ్ళు నిధుల కోసమే వెళితే వాళ్ళ ఒంటికి ఒక్క వెండి ఉంగరమైన ఎందుకు లేదు ? వాళ్ళు వాళ్ళకోసమే వెళితేఈరోజు నిర్జీవంగా ఎందుకు పడున్నారు ? ఆకలి మంటల ఆర్తనాదాన్ని అనుభవించి వెళ్ళారు బాంచెన్ బతుకు ఇక నడవదని నినందించి వెళ్ళారుమానవత్వాన్ని మరిచిన మనకి మనిషితనాన్ని నేర్పించడానికి వెళ్ళారుదోపిడి, దౌర్జ్యాన్ని ఎదిరించి శ్రామిక రాజ్యాన్ని నిర్మించటానికి వెళ్ళారువాళ్ళు మనకోసమే వెళ్ళారుమన బతుకుల్లో వెలుగు కోసం వెళ్ళారునీకు నాకు మనందరికీ హక్కులని పంచడానికి వెళ్ళారువాళ్ళు మనకోసమే వెళ్ళారు మన కోసమే అమరులయ్యారు.
కవిత్వం

వేణు క‌విత‌లు రెండు

1. ప్రియమైన కామ్రేడ్స్మిమ్ముల్ని ఏనాడు కలవనిమీతో ఏనాడు మాట్లాడనిప్రజలు కన్నీళ్లతో మీ చరిత్రను మననం చేసుకుంటున్నారుమీ త్యాగాలను హృదయాలకు హత్తుకుంటున్నారుఇప్పుడు మీ అమరత్వం దేశమంతా ఎర్రజెండాయి పరుచుకుందివీచే గాలిలాప్రవహించే నీరులామీరిప్పుడు గుండె గుండెకు చేరారుకనపడని బంధికాన లాదేశమంతా కాషాయ కంచెలు వేశారుమతోన్మాద హద్దులు గీశారుహద్దులను చేరిపేకంచెలను తొలిచే ఆలివ్ గ్రీన్ యూనిఫామ్ తోమీరిప్పుడు దేశమంతాఎర్రజెండై పరుచుకున్నారు.2. జ్ఞాపకాల జెండాలుబిడ్డలరా మీ జ్ఞాపకాలు మోస్తూ ఎదురుచూస్తున్నాం.....కొడుకులారా మీ ఆశయాలు మోస్తూలక్షలాది పీడిత ప్రజలుయుద్ధం చేస్తున్నారుజ్ఞాపకాలు స్మృతులు ఐనాయిఆశయాలు పోరాటం ఐనాయిబిడ్డలారా ఓ మా బిడ్డలరామీ జ్ఞాపకాలు మా కళ్ళనిండా దాచుకుంటాంమీరెత్తిన ఎర్రజెండాను మా గుండెలనిండా హత్తుకుంటాం.
కవిత్వం

ఈ కవిత్వం అసంపూర్ణవాక్యం కాదు..

అనాదినుంచీ ఈ మతాలు మనిషికీ మనిషికీ మధ్య మాయగోడలు నిర్మించాయే తప్ప మనుష్యులందర్నీ ఏ మతమూ ఒక్కటిగా చెయ్యలేక పోయింది. అలాచేసే శక్తి ఏ మతానికీ లేదు. పైగా మనిషిమీద మనిషి కుండవలసిన విశ్వాసాన్ని లేకుండా చేస్తుంది మతం. -మహాకవి శ్రీశ్రీ ఇప్పుడు జరుగుతున్నదిదే. మతమనే మారణహోమంలో బలౌతున్నది మాత్రం మనుషులే. మానవ వికాసానికి ఎంతమాత్రమూ ఏ మాత్రమూ ఉపయోగపడని మతంకోసం మనిషి ఎంతటి విధ్వంసానికైనా ఒడిగడతాడు. ఇవాళ ఇజ్రాయిల్‌ పాలస్తీనా యుద్దం సామ్రాజ్యవాదమే కానీ, ఈ సామ్రాజ్యవాదం పెంచిపోషిస్తున్న విషనాగుమాత్రం మతమే. అందుకే కవి మిరప మహేష్‌..                 యుద్దమంటే సాధించడం కాదు                 కోల్పోవడం మాత్రమే
కవిత్వం

ప్రకృతి-విప్లవం

వ్యక్తులు వెళుతూ వెళుతూవారి జీవితాన్నిచ్చి వెళ్ళారుమేఘం చినుకులు కురిపించినట్టువెన్నెల కాంతిని పంచినట్టునేల చెట్టు వేళ్లని దాచినట్టువాళ్లేం ఊరకేనే వెళ్లలేదునదుల దారులను చూపివెలుగుల్లో చదువులు చెప్పిచెట్ల పత్రహరితాన్ని ఇచ్చిప్రకృతిని సౌందర్యం చేసి వెళ్ళారువారు వెళ్ళిపోవడమంటేమాయమైపోవడం కాదుమనలోకి మనం చేరుకోవడం..