కవిత్వం

ఆమె ధైర్యవచనం

ఆమె నవ్వుచింత చెట్లపై మిణుగురు పువ్వులా విరబూస్తుందిఆమె తనపెన్నుఇన్సాస్ రైఫిల్ ను వారసత్వంగా వదిలి వెళ్ళిందిఆమె ఇన్నేళ్లుగెరిల్లా యోధగాఏమని తలపోసిందిఅమ్మలకు అక్కలకుభూమ్యాకాశాలలోసగం హక్కు కావాలని పోరాడిందిఆమె కడవండి బిడ్డగా మొదలై AOB నుండి బస్తర్ వరకు జీవించిన కాలమంతాఆదివాసీ ఆడబిడ్డల ధైర్యవచనమైందిఆమె రేణుక నుండి చైతూగా మారి దమయంతిగా భానూ దీదీగాఅడవి బిడ్డల కొంగు ముడి అయిందిఆమె తెరచిన కనులు చూసి వాడికొకటే భయం అరణ్యమిప్పుడు మరల మిడ్కోవెలుతురుతో భగ్గుమంటుందని!! కెక్యూబ్01-04-2025
కవిత్వం

కుట్ర చేసినవాడు సమాధిలో ఉన్నా తవ్వితీస్తాం

అది నాగాజాతి రాజధాని కాదునాకపురం దేవేంద్రుని స్వర్గానికి రాజధాని అక్కడ దేవతలు, వాళ్లకోసం ఇహ లోకంలో పుణ్యం చేసుకొని వచ్చిన భోగ లాలసులుంటారు - విప్రులు, ద్విజులు సనాతన ధర్మ రక్షకులు. అక్కడ బాధితులెవ్వరూ ప్రతీకారానికి సాహసించరు అమృతం దొరకక చచ్చిపోతారు దొంగిలించబోయి చంపబడతారు అనామకంగా మట్టిలో కలిసిపోతారు కాష్ఠంలో కాల్చినా, బొందపెట్టినా‘బాబ్రీ మసీదును కూల్చినప్పుడు కూడా నాగపూర్ లో హింస చెలరేగలేదు’1ఈ కుట్ర ఎవడో సమాధిలో ఉన్నవాడు చేశాడు పీష్వాల కాలం నుంచి చూస్తూనే ఉన్నాం కంపెనీతో యుద్ధంలో ఓడిపోయినప్పటి నుంచీ స్నేహంగానే ఉన్నాం ఛత్రపతి శంభాజీ మహారాజ్ను చంపినాతండ్రిని చంపి తనను చెరసాలలో పెట్టినాఛత్రపతి సాహు
కవిత్వం

అతను రోజూ ఉదయిస్తూనే వుంటాడు

అరణ్యమిప్పుడు ఒక్కసారిగా చిన్నబోయిందిఅతని కవాతు ధ్వని వినపడకఅతని కోసం ఎదురు చూస్తూతెల్ల మద్దె చెట్టు బోసిపోయిందికాసింత విశ్రాంతి తీసుకునే చోటును కదా అని నెత్తురు ముద్దయిన అతని దేహాన్ని చూసిపక్షులన్నీ రెక్కలు తెగినట్లుగా గూటిని దాటి రాలేక రోదిస్తున్నాయి అతని పాఠం వినిపించకతరగతి గది మూగపోయింది అతని దేహాన్ని స్పృశిస్తూ నెత్తురంటిన వెన్నెల ముఖంరంజాన్ మాసపు దుఃఖపు ఆజాలో గొంతు కలిపింది చావు ఎదుట పడినా తన నిబ్బరాన్ని చూసి నిట్ట నిలువునా కుంగిపోయాయిబైలదిల్లా పర్వత సానువులుమనందరి ఆదరువుగా మరలాఅతను రోజూ ఉదయిస్తూనే వుంటాడు తరాలపల్లి తరతరాల వారసునిగా (అమరుడు కామ్రేడ్ సారయ్య @ సుధాకర్ స్మృతిలో)27-3-2025
కవిత్వం

పొద్ధై పొడిచింది

ఆకలికి పుట్టిన మొదటి బిడ్డ తానువెన్నెల వాకిట్లో పెరిగిన తులసి మొక్క తానుచెదిరిపోయే అడుగులకు గమ్యాన్ని చూపించేఅరుణతార తానుతూటాలను తాకిన దేహాన్ని కౌగిలించుకున్న అందమైన ప్రకృతి తాను ఎర్రమందరాలను కొప్పున చుట్టుకుని ఎడమ చేతితో కొడవలి సరిపించుకునిరాజ్యంలోని కలుపు మొక్కలను పికేయ్యడానికై బయలుదేరిన వ్యవసాయ కూలీ తానుతానే పుట్టిందితానే పెరిగింది తానే యుద్ధం చేసిందితానే గెలిచింది తానే మరణించింది మళ్ళీతానే పొద్దై పొడిచింది.
కవిత్వం

ఊరికే వుండలేను కదా

చుట్టూ ఇంత పొగ మంచుకమ్ముకున్న వేళరెండు అక్షరాలు రాయకుండావుండలేను జీవితం చుట్టూ ఇంత బూడిదపడుతున్న వేళరెండు వాక్యాలుగామారకుండా వుండలేను ఎవరి కోసమో పసిపాపలగొంతుకోస్తున్న వేళరెండు కన్నీటి చుక్కలనుకాకుండా వుండలేను భూమిని చెరబట్టి బాంబులుకురిపిస్తున్న వేళవాడి చేతులలో బూబీ ట్రాప్అయి పేలకుండా వుండలేను.
కవిత్వం

ముగింపు లేని యుద్ధం

యుద్ధంనిజంగా ముగిసిందా?యుద్ధం ముగిసిపోతే అమ్మ లేని నేను ఎక్కడున్నట్టు మరియుద్ధం ముగిసిపోతేతూటాలు పేలిన నా కన్నులలోచూపులెందుకు లేవు మరి యుద్ధం ముగిసిపోతేఊడిన నా చేతులూ కాళ్ళూఎందుకని దొరకడం లేవునాలో ఒంటరితనం ఎందుకని పోవడం లేదు యుద్ధం నిజంగా ముగిసిపోతేఅమ్మ లేదనేఈ శూన్యభావనలను ఏమంటారు?యుద్ధమిప్పుడుబాంబుల వర్షంగానోతూటాల శబ్దంగానో లేదుఅమ్మతో మాటను పంచుకోవాలనితహతహలాడిన గాత్రంలో ఉంది కన్నులలోంచి జలపాతమై జారినదుఃఖకాంతులలో ఉంది అమ్మను కోల్పోయిన పసిపిల్లాడి పొట్టలో,అమ్మ కోసం చూసే ఎదురుచూపుల్లోతాండవమాడుతుంది యుద్ధం యుద్ధమిప్పుడుగాయపడ్డ బాల్యంలో ఉందిహత్యకాబడ్డ మానవీయత మీదనర్తిస్తూ ఉందియుద్ధం ముగిసిందనే వార్త వినిఅమ్మను తలుచుకుంటూ ఏడుస్తున్నపిల్లవాడి ఎక్కిళ్ళ శబ్దాల మధ్యన వుంది యుద్ధంయుద్ధం ముగిసిందనే వార్త వినిపిల్లలను వెతకడానికి
కవిత్వం

సెంట్రి..!

రాత్రి చెందురుడు మా పల్లె మీద రాబందులు వాళ్ళకుండా డేగ కండ్లతో కాపు కాస్తున్నవాళ్ళు..!పూరి గుడిసెల వాడల్లోనిట్టాడుగా నిలిచిన చోట అర్ధరాత్రి అలికిడికి ఉయ్యాల నుండి లేచిన పసికూన కూతకు తుఫాకి మోన పెట్టి కాల్చాలని కలగన్న ఈ దోపిడీ రాజ్యాన్ని ధిక్కరించే తెగువైకాచిన కందిలి వెలుగులు వాళ్ళు..!!అడవి కాచిన వెన్నెల సంద్రాలను ఈదుతూ సెలయేరు పాయలుగా పారుతూ కొండలు, కోనలను తడుముతూ సకల జీవరాశులను ఓల్లో ఒంపుకుంటూ చుక్కాని అయిన వాళ్ళు ఈ దేశ పీడిత ప్రజలకు సెంట్రియే...!దిక్కు తెలియని వాళ్ళకు దిక్కై నలుదిక్కుల న్యాయముకై విముక్తి నావనెంచి సాగుతున్న వాళ్ళకు పోరు సమరంలో వాళ్లో స్నేహితులు
కవిత్వం

అతనిప్పుడు మాటాడుతున్నాడు

అతనిప్పుడు మాటాడుతున్నాడుఒరిగిపోయాడన్న ప్రతిసారి మాటాడుతూనే వున్నాడు దేశమంతా అతన్ని ప్రతిబింబిస్తూనే వుంది శత్రువూ మాటాడుతున్నాడు తనవారూ మాటాడుతున్నారు నలుగురు కలిసిన చోట అతనే సంభాషణవుతున్నాడు అన్నం ముద్దలో అతని వెన్నెల వంటి ముఖం కనిపిస్తూ అడవి అంతా అతను అల్లుకుపోయిన తోవంతా కబుర్లలో అతనిప్పుడు మాటాడుతున్నాడు అతని చుట్టూ ముళ్లపొదను నాటిన ప్రతిసారీ మరల అతను మోదుగ పూల వనంలో ఎర్రని దేహంతో పుష్పిస్తూనే మనతో మాటాడుతున్నాడు నువ్వలిసి సేదదీరుతానన్న కాలంలో నీ అలసటను తన భుజానెత్తుకొని కాళ్ళ సత్తువగా మారుతూనే వున్నాడు ఎండలో వానలో చలిలో రుతువులన్నిటా అతను ముందు నడుస్తూనే వున్నాడు గాయపడ్డ సమయంలో తను
కవిత్వం

మాట్లాడే మనిషి

సందింట్లో సాయంకాల వేల అలసిన ఆలికి నాలుగు ముచ్చట్లు చెప్పే పెనిమిటి తిరిగి వచ్చే రోజు కోసం ఎగసేపి బిడ్డ కోసం దారిపట్టే తల్లి ఆవు కోసం ఊపిరి బిగబట్టి గాలినిఎగదని గూడు చేరే పక్షుల కోసంనిలువనీడనిస్తూ చిగురించెఆ చెట్ల కోసం స్పందించి స్వరాన్ని వినిపించేసాయి ఆఖరి శ్వాస విడిచిన వేళదిక్కులు దినబోయి దిశ తిరిగె కొండ గాలిఅలిగిన అమలాపురానికి మిగిలిన వసంతంనేల విడువని పాదాలు మట్టి వదలని చేతుల మార్పు కోసం వైకల్యం ఆదమరిచిప్రశ్నించే ప్రతి చోట బలమైన మస్తిష్కం బంధించిన చెరసాల యమున గంగను కలసి ఎదపై గోదారి కృష్ణమ్మ వెనుతిరిగిమూసికి ముచ్చట్లుమంజీరా మా కోసంరేపటి
కవిత్వం

నాలుగు పిట్టలు (కళ్ళూ- కన్నీళ్ళు)

సముద్రాన్ని కళ్ళల్లో నింపుకుందామనుకున్నసాధ్యమైతే కాలేదురెప్పలు మధ్య కన్నీరు ఉబికేదాకాదుఃఖం కంటే గొప్ప సాగరమేముందో తెలియలేదు***కన్నీళ్ళ తో కాస్త జాగ్రత్తఉండండిగాయపరచడానికి ముందుమీ కళ్ళ గురించి కూడా ఆలోచించండి***ఒక్కోసారి కన్నీళ్ళతో పాటుచూపు ప్రవహిస్తుందిదృశ్యాలను అనేకంతనలో కరిగించుకొని****కన్నీళ్ళ కళ్ళనుఅవమాన పరచకండిదుఃఖం ఆగాక ఉప్పొంగేఉద్వేగం పేరు ఆగ్రహం***కళ్ళున్న చోటంతాకన్నీళ్ళుండక పోవచ్చుకొందరి హృదయాలుఎండమావులు***తడి ఉన్నదంతాకన్నీళ్ళు కాదుమోసకారులుకోకొల్లలు****కన్నీళ్ళ శక్తి కి అంచనా లేదుకేరటాల్లా, వానలా, వరదలాఅవి బండలలైనాకరిగించగలవు కదిలించగలవు***లోపలచెలరేగేతుపానులనుఅదుపు చేసేలంగరులు కన్నీళ్ళు***కన్నీళ్ళుచాలా వాస్తవమైనవిఅవే మనో మంటలనుచల్లార్చగలిగేవి***కన్నీళ్ళు రానివాళ్ళలోపలహృదయం ఎండిపోయిఉంటుంది***నువ్వో సముద్రాన్నిలోపల మోస్తున్నావనిచెప్పే ఆధారాలుకన్నీళ్ళు****కళ్ళను నమ్మని వారైనా సరేకన్నీళ్ళను నమ్ముతారునీలో మనిషి ఉన్నాడనిఅప్పుడు గుర్తిస్తారు***గట్టి రొమ్మున్న వారు కూడారొప్ప కుండా ఉండలేరుఏడ్పు రాని వారెవరూఈ లోకంలో ఇప్పటికీ పుట్టలేదు***ఒక