అస్తవ్యస్తంగా భారత ఆర్థిక వ్యవస్థ
దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిస్తున్నామని పదేపదే ప్రగల్భాలకు పోతోంది మోడీ ప్రభుత్వం. మోడీ మాటలకు క్షేత్రస్థాయి వాస్తవాలకు భిన్నంగా దేశంలో భారీగా నిరుద్యోగం పెరుగుతోంది. ద్రవ్యోల్బణం అదుపు తప్పింది. పిల్లలకు పోషకాహారం దొరకడం లేదు. ఫారెక్స్ నిల్వలు హరించుకుపోతున్నాయి. వాణిజ్య లోటు పెరిగిపోతోంది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపి) ఐదు మాసాల కనిష్టానికి పడిపోయింది. 2015-2023 మధ్యకాలంలో 18 లక్షల సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు (యంఎస్‌యంఇ) మూతపడి 24 లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. శ్రామిక శక్తి గణనీయంగా తగ్గింది. రుణభారం పెరిగిపోతోంది. విదేశీ నిధులు రావడం