మీరీ పుస్తకం చదివారా ?

కవిత్వం యుద్ద మైదానమే!

కొన్ని ప్రశంసాపూర్వక వాక్యాలు, మరికొన్ని ముఖస్తుతి పదబంధాలు, ఇంకొన్ని పొగడ్తతో ముంచెత్తి  ఈ కవిని కవిత్వాన్ని అభినందించాలని  కాదు. ఈ కవిత్వం చదువుతున్నంతసేపూ ఎదో తెలియని బాధ. ఇలా కదా చెప్పాల్సింది. ఇలా కదా మాట్లాడాల్సింది. ఇలా కదా రాయాల్సింది. నివురుగప్పిన నిప్పుకణికలతో మరిన్ని నిప్పుకణికల్ని ఇలా కదా మండించాలి అనిపించింది. ఆలోచింపజేసేలా ఈ కవిత్వం కవి నాయుడు గారి జయన్న రాశారు. తెలంగాణలోని గద్వాల ప్రాంతానికి చెందిన కవి. సామాన్యజనం ఈ సమాజాన్ని ఎలా చూస్తారన్నది వారి చైతన్యం మీద, స్పృహ మీద ఆధారపడి వుంటుంది. కాని కవికి ఈ సమాజం పట్ల మాత్రం బాధ్యత ఉందని
మీరీ పుస్తకం చదివారా ?

గాథలు కావివి.. జీవితాలు

ఇటీవలకాలంలో ప్రగతిశీల ఉద్యమాల్లో ఉన్న కొంతమంది కవులు పద్యకావ్యాలతో అభ్యుదయకవిత్వాన్ని రాస్తున్నారు. ప్రజా సమస్యల్ని, ప్రజల బాధల్ని గాథల్ని కవిత్వంగా రాయడం ఈ మధ్య తెలుగుకవిత్వంలో సహజంగా చూస్తుంటాం. కానీ పద్యంలోనూ ఉద్యమాలను రాయడం ఆరదు. అయితే ఈ పద్యకావ్యాలు ప్రాచుర్యంలోకి పెద్దగా రావడం లేదు. వారు ఎక్కడికక్కడే రాసి పుస్తకాలను ముద్రించుకుంటున్నారు. ఏ జిల్లాకాజిల్లాకే వాళ్ళు పరిమితమవుతున్నా, ప్రపంచాన్నంతా కవిత్వంగా రాస్తున్నారు. ఆ కోవలోకి చెందిన కవి కర్నూలులో కనిపించారు. ఆయన రాసేవన్నీ పద్యాలే. అవి కారల్‌ మార్క్స్‌, లెనిన్‌, చెగువేరా..ఇలా మహనీయుల గూర్చి, ప్రజా ఉద్యమాల గూర్చి, సమస్యలగూర్చి రాస్తుంటారు. వాటిని పద్యాల్లో పరిచయం చేస్తుంటారు.
సమకాలీనం

టెండూ ఆకును అమ్ముకునే  స్వేచ్ఛ కోసం కోరాపుట్ ఆదివాసుల పోరాటం

దేశ వ్యాప్తంగా ఆదివాసులకు కెండు లేదా టెండు ఆకు (బీడీ ఆకు) కేవలం అటవీ ఉత్పత్తి మాత్రమే  కాదు, వారి జీవనాధారం. పొడి నెలల్లో వచ్చే ఈ ఆకులు వేలాది కుటుంబాలకు కాలానుగుణ  ఆదాయాన్ని అందించే హామీనిస్తున్నాయి. కానీ అకారణ ఆలస్యాలు, అమ్ముకోడానికి అనుమతినివ్వడంలో ఆలస్యం, ప్రభుత్వ ఉదాసీన ప్రవృత్తి వల్ల ప్రతీ ఏడాదీ ఇబ్బందులు పడుతున్నారు. పంట కోత పూర్తి స్థాయిలో ఉండగా, రుతుపవనాలు వేగంగా సమీపిస్తున్న నేపథ్యంలో, ఒడిశాలోని కొరాపుట్‌లోని ని బోయిపారిగుడా బ్లాక్‌లోని ఎనిమిది గ్రామ సభలు ఈ సీజన్‌లో తాము సేకరించిన బీడీ ఆకును స్వతంత్రంగా అమ్ముకోవడానికి అనుమతి కోసం ఇంకా వేచి
ఆర్ధికం కాలమ్స్

అదానీ గుట్టు విప్పిన హిండెన్‌బర్గ్‌

ప్రధాని నరేంద్ర మోడీకి ఎంతో సన్నిహితుడు గుజరాత్‌ వ్యాపారి గౌతమ్‌ అదానీ ఇప్పుడు ఆయన  సిరుల శిఖరాల వెనుక అతి పెద్ద కుట్ర దాగి ఉన్నదని అమెరికాకు చెందిన ప్రముఖ పారిశ్రామిక పెట్టుబడుల పరిశోధన సంస్థ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ అనే అంతర్జాతీయ సంస్థ జనవరి 24న వెల్లడించిన  సమాచారం సంచలనం సృష్టించింది. ప్రపంచంలోనే మూడవ అత్యంత ధనవంతునిగా ఖ్యాతికెక్కిన గౌతమ్‌ అదానీ వ్యాపార మోసాల పుట్ట పగిలింది. ఇంతకాలం ఆయన చక్కబెట్టిన అవినీతి, అక్రమాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. అదానీ నెరపిన మార్కెట్‌ కుంభకోణాలను దాంతో డబ్బు సంపాదనా పరులకు ఆదర్శంగా నిలిచిన అదానీ ఆర్థిక ఎదుగుదల వెనుక గల
మీరీ పుస్తకం చదివారా ?

నిప్పులుగా ప్రవహించే కవిత్వం

చాన్నాళ్ళుగా కవి వసీరా గూర్చి అన్వేషిస్తూనే ఉన్నాను. ఇప్పటికి దొరికారు. అప్పుడెప్పుడో ఎక్కడెక్కడో చదివిన కవిత్వం ఇప్పుడు ఒక్కచోట ఇలా వసీరా లోహనది పేరుతో లభించడం కవిత్వప్రేమికులకు...నాకూ ఆనందమే. కవి వసీరా రాసింది మూడంటే మూడు కవిత్వసంపుటాలే. ఎంతలోతుగా రాస్తారు. ఎంతగాఢతగా రాస్తారు. ఇది చదువుతున్నంతసేపూ కవిత్వం కోసమే కవిత్వం రాసిన అనుభూతి కలిగింది. ఆపకుండా చదివించాడీకవి. గుండెకు ప్రకంపనం కలిగింది. కవిత్వం చదువుతున్నంత సేపూ హృదయం లయాత్మక విన్యాసమైంది. ఎనబయ్యోదశకంలోనే ఎంతో గొప్ప కవిత్వం రాశారు. ఇప్పటికది అవసరమని భావించి ఈ కవిత్వం గూర్చి నాల్గుమాటలు రాయాలనిపించింది.          ‘అన్నా! నాకు నిరుద్యోగం వచ్చింది’ అని                
కథావరణం సాహిత్యం కాలమ్స్

అంట‌రాని వ్య‌థ‌ల మ‌ల్లెమొగ్గ‌ల గొడుగు

కథలను రాయడం వెనకాల సామాజిక ప్రయోజనంతో బాటూ , గుండెలోపలి దుఃఖాన్ని అర్థం చేసుకొని, అవమానాల్ని దాని వెనకాల ఉన్న కారణాల్ని అర్థం చేసుకుని, అసమానత్వాన్ని ఎదుర్కొని, బానిసత్వం నుంచి విముక్తి పొందడానికి , ఒక సామూహిక పోరాట శక్తిని సమీకృతం చేసుకోవడానికి ఉద్యమ నేపథ్యంలో చాలా కథలు వచ్చాయి. ఉద్యమ నేపథ్యంలో వచ్చిన కథలన్నీ శక్తివంతమైన కథలని చెప్పలేము కానీ, ఆయా ఉద్యమాల కాలంలో  కథలు కవిత్వం నవలలు తదితర ప్రక్రియల్లో శక్తివంతమైన రచనలు వెలువడ్డాయి.వాస్తవాలను కేంద్రీకృతం చేసుకున్న రచనలు , మానవ జీవితాల్లోని వెలుగు చీకట్లను యధాతధంగా చిత్రిoచిన  రచనలకు విలువ ఎప్పుడూ ఎక్కువే.  మల్లెమొగ్గల
మీరీ పుస్తకం చదివారా ?

దళితులంటే అంత చులకనా..?

ఆర్‌యస్‌యస్‌ నిజస్వరూపాన్ని బయటపెట్టిన ఆత్మకథ ఇటీవల విస్తృతంగా చర్చజరుగుతున్న పుస్తకం ‘నేనెందుకు హిందువును కాకుండా పోయాను?’ అని రాజస్థాన్‌కు చెందిన భన్వర్‌ మేఘ్వంశీ ఆత్మకథ రాశారు. ఆ పుస్తకం ముఖచిత్రంలోనే ఆర్‌యస్‌యస్‌ సావాసం పట్టిన ఒక దళితుని ఆత్మకథ అని రాశారు. హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ఈ పుస్తకాన్ని ప్రచురించడంలో చాలా సాహసం చేసిందనే చెప్పాలి. ఈ పుస్తకాన్ని ప్రసిద్ధ అనువాద రచయిత కె.సత్యరంజన్‌ చాలా సహజంగా తెలుగులోనే ఈ పుస్తకం వచ్చిందా అన్నంత గొప్పగా అనువాదం చేశారు. ఈ పుస్తకంలోతుల్లోకి వెళ్ళి ఆర్‌యస్‌యస్‌ ఒక అబద్దాల పుట్టఅని, దేశప్రజల్ని ఎలా మాయచేస్తుందో , కాదు కాదు ఎలా
సమకాలీనం కాలమ్స్

ఆన్ లైన్ విద్య బోధనలో అసమానత్వం

కరోనా మూడవ వేవ్ రిత్యా తెలంగాణ సర్కారు ఈ నెల 30 వరకు సెలవులు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఓయూ, జెఎన్ టి యు, శాతవాహన యూనివర్సిటీలతో పాటు మిగతా యూనివర్సిటీలు, ఉన్నత విద్యలో ఆన్ లైన్/డిజిటల్ విద్యభోదన జరుపుతామని ప్రకటించాయి. పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యలో ఆన్ లైన్ భోదనకు మొగ్గుచూపుతున్న తెలంగాణ సర్కారు పేద, మధ్యతరగతి విద్యార్థులు ఆన్ లైన్/డిజిటల్ పాఠాలు వినేందుకు ఎలాంటి సౌకర్యాలు కల్పించటం లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో మొదటి, రెండవ కరోనా వేవ్ లలో ఆన్ లైన్/డిజిటల్ భోదన పాఠాలు అందక తీవ్రంగా నష్టపోయిన పేద విద్యార్థులు మూడవ వేవ్ లో
లోచూపు

సాహిత్య విమర్శకు కొత్త పునాదులు

విరసం మిత్రుడు పాణి తో చేపట్టిన సంభాషణను 'కొలిమి'  "ఫాసిజం-విప్లవోద్యమం- సాహిత్య విమర్శ" అనే పుస్తకంగా జనవరి 2024 లో ప్రచురించింది. పుస్తకం శీర్షికలో సాహిత్య విమర్శ అనే పేరుంది గానీ ఇందులో ఎటువంటి సాహిత్య వాచక ప్రస్తావనలు లేవు. దేని గురించి అయినా రొటీన్ గా ఆలోచించే సంప్రదాయ సాహిత్యకారులు, సాహిత్య విమర్శకులు ఎవరైనా దీనిని చదివితే చాలా నిరాశ పడిపోతారు. ఇది సాహిత్య విమర్శ కానే కాదని, ఫక్తు 'రాజకీయ విమర్శ' అని పెదవి విరవొచ్చు. ఇంకా కొందరైతే 'మావోయిస్టు విప్లవ విమర్శ' అని కూడా కొట్టి పారేయవచ్చు. కానీ నిరంతరం మారుతున్న సమాజాన్ని అర్థం
లోచూపు కాలమ్స్

రాజ్యాంగం – ప్రొ. శేషయ్యగారి విమర్శనాత్మక హక్కుల దృక్పథం

గతంలో రాజ్యాంగాన్ని విమర్శనాత్మకంగా చూసే దృక్పథం కొరవడినందువల్ల దాని పట్ల వ్యవహరించిన తీరు కొంత సమస్యాత్మకంగా, పరస్పర విరుద్ధంగా ఉండేది. కానీ తదనంతర కాలంలో ప్రజా పోరాటాలు విస్తృతమౌతున్న కొద్దీ, ముఖ్యంగా తెలుగు సమాజాలలో లోతైన చర్చలు, అంతర్మథనం జరిగి హక్కుల దృక్పథం తాత్వికంగా బలోపేతం అయ్యే దిశగా వికాసం చెందనారంభించింది. ఆ క్రమంలో భాగంగానే ప్రొ.శేషయ్య గారి ఆలోచనలను, వ్యక్తిత్వాన్ని పరిశీలించా ‘రాజ్యాంగం-పౌరహక్కులు’ అనే ఈ  పుస్తకంలో ముఖ్యంగా రాజ్యాంగాన్ని చారిత్రకంగా చూడడంలో శేషయ్య గారి ప్రత్యేకమైన ముద్ర కనబడుతుంది. పౌర హక్కుల రంగానికి తనదైన సైద్ధాంతిక దృక్పధాన్ని రూపొందించుకునే క్రమంలో ఆయన పాత్ర ప్రముఖంగా పేర్కొనదగినది.