కామ్రేడ్ జి.ఎన్ సాయిబాబకు అరుణారుణ జోహార్లు
ప్రపంచ విప్లవ మానవుడు, సామ్రాజ్యవాద వ్యతిరేక ప్రజా ఉద్యమకారుడు, కవి, మేధావి కామ్రేడ్ జి.ఎన్ సాయిబాబకు అరుణారుణ జోహార్లుఆయన రాజ్య ధిక్కార స్ఫూర్తితో విశాల ఐక్య సంఘటనా పోరాటాలతో ఆపరేషన్ కగార్‌ను అడ్డుకుందాంహిందుత్వ కార్పొరేట్ శక్తులకు వ్యతిరేక నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని ముందుకు తీసికెళదాం సుప్రసిద్ధ విప్లవ మేధావి, కవి, ప్రజా ఉద్యమ నాయకుడు, విప్లవ రచయితల సంఘం సభ్యుడు కామ్రేడ్ జి.ఎన్ సాయిబాబ తీవ్ర ఆనారోగ్యంతో అక్టోబర్ 12 శనివారం రాత్రి 8.36 గంటలకు హైదరాబాదులోని నిమ్స్ హాస్పెటల్‌లో అమరుడయ్యాడు. భారత ప్రభుత్వం 2009లో ఆదివాసుల మీద ప్రకటించిన ఆపరేషన్ గ్రీన్‌హంట్‌కు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ప్రొ. సాయిబాబా










