వరవరరావుకు తుమకూరు అక్రమ కేసులో అక్రమ వారెంట్
వీడియో కాన్ఫరెన్స్‌లో హాజరైనా గైర్హాజరీ అని రూ. 25,000 జరిమానా కర్ణాటక రాష్ట్రంలోని పావగడ అక్రమ కేసులో వరవరరావు గైర్హాజరీ అని ఆరోపిస్తూ ఆయనను అరెస్టు చేయాలని ఈ నెల 11న మధుగిరి కోర్టు వారంట్ ఇచ్చి, రూ. 25 వేల జరిమానా విధించడాన్ని విరసం ఖండిస్తోంది. ఈ కేసు 2005 ఫిబ్రవరిలో నమోదైంది. ఇందులో వరవరరావును నిందితుడిగా చేర్చారు. ఇలాంటి కేసు ఒకటి ఉన్నట్లు భీమా కొరేగావ్ కేసులో అరెస్టయి పూనా జెయిల్లో ఉండగా 2019లో ఆయనకు తెలిసింది. అనారోగ్య కారణాల మీద భీమా కొరేగావ్ కేసులో వరవరరావుకు బొంబాయి హైకోర్టు షరతులతో 2021 మార్చి నెలలో








