మనిషితనంపై విశ్వాసంతో
(ఇటీవల విడుదలైన బాల సుధాకర్ మౌళి కథా సంపుటికి రాసిన ముందుమాట) కవిగా ప్రసిద్ధుడైన బాల సుధాకర్ మౌళి యిప్పుడు కథకుడిగా మన ముందుకు వస్తున్నాడు. కవిత్వం కథ ఈ రెండింటికి పోటీ పెట్టి యెక్కువ తక్కువల్ని అంచనా వేయడం తప్పే గాని రెండు సృజనాత్మక వ్యాసంగాల్నీ ఒకే రచయిత నిర్వహిస్తున్నప్పుడు ఆ వ్యక్తికున్న కవిత్వ అభివ్యక్తి కథనం నైపుణ్యం వొకదాన్ని మరొకటి యెలా ప్రభావితం చేసుకుంటాయి అన్న అధ్యయనం ఆసక్తి గొలుపుతుంది, విమర్శలో కొత్త ఆలోచనలకు సంవిధానానికి దారులు వేస్తుంది. కథలో కవిత్వ చ్ఛాయలు కథకు వన్నె తెస్తాయి. అలాగే కవిత్వంలో వినిపించే అనుభూతి కథను తాకితే