త్యాగాల చరిత్ర తల్లులు-బిడ్డలు
తల్లులు బిడ్డలు రచించినది హుస్సేన్. సుదీర్ఘకాలం విప్లవోద్యమంలో పనిచేసిన వ్యక్తి. తల్లులు బిడ్డల మధ్య ఉన్న ప్రేమ కన్నా, తల్లులకై బిడ్డలు చేసిన పోరాటాలు త్యాగాలే ఎక్కువ ఉన్నాయి ఇందులో. తల్లుల కొరకై బిడ్డలు,బిడ్డల కొరకై తల్లులు,తల్లడిల్లిన క్రమం, బిడ్డలు విప్లవంలో ఎదుగుతున్న తీరు చూసి సంతోషించిన తల్లులు, దూరమవుతున్న పిల్లలను చూస్తూ బాధపడతారు.బిడ్డల క్షేమాన్ని కోరుకుంటారు. ఈ పుస్తకం కేవలం తల్లులు బిడ్డల మధ్య జరిగినది కాదు. ఇది ఒక తరం ధైర్యానికి సాహసానికి, త్యాగనిరతికి, ప్రతీక ఈ పుస్తకం. ఉత్తర తెలంగాణ ముఖ్యంగా ఆదిలాబాద్, కరీంనగర్, జగిత్యాల,మంచిర్యాల, ప్రాంతంలో చెలరేగిన ఉద్యమాల ఊట చెలిమ. సింగరేణి










