ప్రజాస్వామ్యం కోసం అన్వేషణ
కాలికి బలపం కట్టుకొని అన్నట్టుగా ఈ మధ్య కాలమంతా తెలుగు నేలంతా తెలంగాణ అడుగడుగునా దేశం నాలుగు చెరగులా శాంతి కపోతమై తిరుగాడుతూ, తన ఉపన్యాసాలతో మధ్య తరగతిని, యువతను, విద్యార్థులను చైతన్యవంతం చేస్తూన్న, శాంతి చర్చల మేధావి మనందరికీ సుపరిచితులైన ప్రొఫెసర్ జి. హరగోపాల్ గారి ఇంటర్వ్యూలు, ఉపన్యాసాల వ్యాసాల పుస్తకం ఇది. ఈ పుస్తకాన్ని రచయిత శాంతి చర్చల సాధనలో నిత్య కృషీవలుడైన ఎస్ ఆర్. శంకరన్ గారికి అత్యంత గౌరవంతో అంకితం చేశారు. ఇది రచన ఆచరణ రెండు చేతులా చేస్తున్న పాలమూరు అధ్యయన వేదిక ప్రచురణ. నేటి వ్యవస్థీకృత హింసకు శాంతి చర్చలే









