రూపాయి ఘోర పతనం – శ్రామికులపై భారం
అంతర్జాతీయ ఆర్థిక, రాజకీయ పరిణామాలు, దేశీయంగా వ్యవస్థాగతమైన సమస్యల వల్ల ఇటీవలి సంవత్సరాల్లో డాలర్‌తో భారత రూపాయి మారకపు విలువ తగ్గుతూ వస్తోంది. ఈ నెలలోనైతే దాని విలువ రికార్డు స్థాయిలో పడిపోయింది. ఇప్పుడు ఒక డాలరు కావాలంటే 90 రూపాయలకు పైగా వెచ్చించాలి. రూపాయి విలువ పడిపోవడం వ్యాపారులు, పారిశ్రామికవేత్తలనే కాదు భారతీయ విద్యార్థులనూ ఇబ్బందు ల పాల్జేస్తుంది. విదేశీ చదువుల కోసం విద్యార్థులకు అయ్యే వ్యయం ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుంది. డాలర్‌కు అంతర్జాతీయ రిజర్వు కరెన్సీ హోదా ఉంది. దాని విలువ స్థిరంగా కొనసాగుతుండటం మరో అంశం. బంగారం, చమురుతో పాటు ఆహారధాన్యాలు, ముడి ఖనిజాలు తదితరాల










