తుడిచివేతపై తుడిచివేత
'ది లాస్ట్ ప్లే ఇన్ గాజా' నాటకాన్ని ప్రదర్శించడానికి భారత వీసా నిరాకరించబడిన యాంటీ-జయోనిస్ట్ ఇజ్రాయెలీ నాటకకర్త ఐనాట్ వైజ్మాన్ ఈ వ్యాసం రాశారు. భారత్-ఇజ్రాయెల్ మధ్య, అంటే జయోనిజం - హిందుత్వ మధ్య పెరుగుతున్న బంధం వెనుక ఉన్న అసలు రూపాన్ని ఈ చర్య ఎలా బయటపెడుతుందో ఆమె వివరించారు గత వారం కేరళలో జరిగిన ITFOK ఉత్సవంలో మా నాటకం "ది లాస్ట్ ప్లే ఇన్ గాజా" (గాజాలో చివరి నాటకం) ప్రదర్శించాల్సి ఉండింది. రెండు షోలు జరగాలి. ఈ నాటకం గాజాను తుడిచిపెట్టడానికి సంబంధించిన నాటకం. నాశనమైన దానిని థియేటర్ ద్వారా తిరిగి సృష్టించడానికి










