బీహార్ జైళ్ల నిజస్వరూపం
బీహార్ జైళ్ళను ఎవరైనా ఊహించుకుంటే మేరీ టేలర్ చిత్రించిన చెరగని చిత్రాలు గుర్తుకు వస్తాయి. అప్పుడు హజారీబాగ్ ఇంకా బీహార్‌లో భాగం. దాదాపు అర్ధ శతాబ్దం తరువాత బి. అనురాధ ఐదేళ్ళు రాజకీయ ఖైదీగా గడిపి అదే హజారీబాగ్ జైలులో ఖైదీల కష్టాలను తన జైలు కథల్లో చెప్పారు. కాలంతో పాటు అంతా మారుతుంది కానీ బీహార్, జార్ఖండ్ జైళ్లు ఈ మార్పు నియమానికి మినహాయింపులా? విజయ్ కుమార్ ఆర్య ఒక మావోయిస్టు రాజకీయ ఖైదీ. ప్రస్తుతం పాట్నాలోని బేవుర్ జైలులో ఉన్నాడు.. కేంద్రమావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటి సభ్యుడనే ఆరోపణ మీద ఎన్‌ఐఏ కేసులో అరెస్టయ్యిన అయ్యాడు.










