మనుషులుగా ఉండమని చెప్పే కథలు
మొదటగా ఇది నాకు చాలా ఇష్టమైన కథల పుస్తకం. ఈ "టోపి జబ్బర్" పుస్తకంలో 11 కథలు ఉన్నాయి. ఒక కథ ద్వారా ఒక్క విషయం మాత్రమే చర్చించాలని రచయిత వేంపల్లె షరీఫ్ గారు అనుకోలేదు. ఒక ముస్లిం మనిషి చుట్టూ ఉన్న కులం, మతం, ప్రాంతం, లింగ వివక్షత ఎంత లోతుగా ప్రభావితం చేస్తాయో నాలుగు కథలు మినహా కథల్లో తన రచనా శైలితో పరిచయం చేశారు. ముస్లింల ఉనికి ఏ స్థితిగతుల్లో ఉందో ఈ కథల ద్వారా చెప్పారు. వాళ్ళ మతంలో వున్న ఆచారాలు, సంప్రదాయాలు. ఇంకా ఏ విధంగా వాళ్ళు సమాజంలో అవమాన పడుతున్నారో