కని, విని ఎరుగని వలంటీర్ నిర్మాణం
(మార్చి 14 , 15 -1944 లో విజయవాడలో ఎనిమిదో అఖిల భారత రైతు మహా సభలు జరిగాయి. ఈ చారిత్రాత్మక సభలపై ప్రజా శక్తి ఒక బులిటెన్ విడుదల చేసింది. ఇందులో కా. కె ఎస్ రాసిన వ్యాసం ఇది . కమ్యూనిస్టు ఉద్యమంలో వలంటీర్ నిర్మాణం ఎంత పటిష్టంగా ఉండేదో ఇది చదివి తెలుసుకోవచ్చు - వసంత మేఘం టీం ) ఫిబ్రవరి 20 వ తేదీ వచ్చేసింది. మహాసభ నిర్మాణ ప్రయత్నాలు అనేక దుస్సంఘటనలవల్ల వుత్సాహంగా సాగడంలేదు. కేవలం 24 దినాలు మాత్రమే వుంది. మహాసభ ప్రయత్నాలు గుర్తుకొస్తే ప్రతివాడికి గుండె జలదరిస్తోంది. వ్యవధిలేదు.