ఈసారి లోపలి నుంచి…
చుట్టుముట్టు యుద్ధంలో చిక్కుకపోయిన విప్లవోద్యమం మీద లోపలి నుంచి విమర్శలు మొదలయ్యాయి. విప్లవోద్యమం కాల్పుల విరమణ, శాంతి చర్చల ప్రతిపాదన చేశాక అనేక వైపుల నుంచి సుదీర్ఘ చర్చ కొనసాగుతున్నది. అంతర్యుద్ధాన్ని పోలిన ఈ అణచివేతలో ప్రాణాలు కోల్పోవడం కంటే సాయుధ పోరాట విరమణ చేయడం మంచిదని చాలా మంది సూచించారు. సాయుధ పోరాటాలకు ఇది కానికాలమని, శాంతి చర్చల ప్రతిపాదనకు అనుగుణంగా సాయుధ పోరాటం వదిలేయాలని కొందరు హితవు పలికారు. వీటన్నిటికంటే ముఖ్యమైన విమర్శ మరోటి ఉంది. మావోయిస్టుపార్టీ ఎంచుకున్న పంథా వల్లనే ఈ అణచివేత, వైఫల్యాలు ఎదురయ్యాయని, మారుతున్న ప్రపంచాన్ని మావోయిస్టులు అర్థం చేసుకోలేకపోతున్నారని, పిడివాద,