సంపాదకీయం

తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ దాడులను ఖండిద్దాం

ఢిల్లీలో నార్త్ బ్లాక్లో ఉన్న కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కథలు రాయడంలో తలమునకలైంది. రచయితలు చేయాల్సిన పనిని అది తలెకెత్తుకున్నది. రచయితలనేమో దేశద్రోహులుగా బందీలను చేస్తుంది. ఇప్పటికే భీమాకొరేగాం లాంటి పెద్ద కల్పిత కథను సృష్టించింది. రైతాంగ ఉద్యమం, సిఏఏ సందర్భంలో కూడా కల్పిత కథలు ప్రచారం చేసింది. ఈ సారి అది తెలుగు రాష్టాల ప్రజా సంఘాల కోసం పాత కథనే తిప్పి రాస్తుంది. మార్చి 31 2021 న సాయంత్రం 4 - 5 గంటల మధ్య ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో ప్రజా సంఘాల నాయకుల ఇళ్ల మీద ఎన్ఐఏ దాడులు చేసింది. వీరిలో విరసం
సంపాదకీయం

సాహచర్య వంతెన..

ఇటు చూడు కన్నీళ్ళతో నిండిన నీకళ్ళను నాకు చూపియ్యడానికి   సిగ్గుపడకు... ఈ రోజైనా కన్నీటి వర్షాలు వరదలు పెట్టనివ్వు       -కబీర్. అక్టోబర్ 4వ తేదీన ముప్పైమంది మావోయిస్టుల హననం జరిగిన వారం రోజుల తర్వాత సాయిబాబా మరణించాడు. దుఃఖానికి ఒక కొలత ఉండాలి. దానికొక అడ్డు కూడా ఉండాలి. కానీ నిర్వికల్పసంగీతంలా భారత సమాజంలో దుఃఖం ప్రవహిస్తుంది. దుఃఖతీవ్రత సాయిబాబ దగ్గర  ఆగింది.   2013 విరసం  జనరల్ బాడీ సమావేశం కావలిలో జరుగుతుండగా ఢిల్లీలో సాయిబాబా  నివాసంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ  ఉన్నదని  వరవరరావు మా దృష్టికి  తీసుకువచ్చారు. యూపీఏ పాలనలో కేసు నమోదు అయింది. తర్వాత
సంపాదకీయం

విశ్వవిద్యాలయాలా ? శిశు మందిరాలా ?

కేంద్ర ప్రభుత్వం తాను ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానం ` 2020లో భాగంగా ఐకెయస్‌ను ఆచరణలోకి తీసుకువచ్చే ప్రయత్నాన్ని ఇప్పుడు ముమ్మరం చేసింది. దేశవ్యాప్తంగా వెయ్యిమంది అధ్యాపకులకు భారతీయ జ్ఞాన వ్యవస్థలలో డిగ్రీస్థాయిలో బోధించడానికి అనుగుణంగా సుశిక్షితులను చేసే కార్యక్రమాన్ని యుజిసి ప్రారంభించింది. గ్రాడ్యుయేట్‌ స్థాయిలోనూ, పోస్టు గ్రాడ్యుయేట్‌ స్థాయిలోనూ రాబోయే విద్యాసంవత్సరం నుంచి భారతీయ సాంప్రదాయాలు, సంస్కృతి, జీవన విధానాలపై ఒక అవగాహన కల్పించడం దీని వుద్దేశం. అలాంటి పాఠాలను బోధించడానికి వీలుగా అధ్యాపకులకు శిక్షణ యిస్తున్నారు. యుజి స్థాయిలోనూ, పిజి స్థాయిలోనూ మొదటి సంవత్సరం విద్యార్థులు తప్పనిసరిగా దీనికి సంబంధించిన రెండు కోర్సులను పూర్తిచేయాలనే నిబంధనను యుజిసి
సంపాదకీయం

హిజాబ్ ఒక సాకు మాత్రమే  

కర్ణాటక విద్యాసంస్థల్లో బిజెపి అనుబంధ గ్రూపులు రెచ్చగొట్టిన హిజాబ్ వివాదం వాళ్ళు కోరుకున్నట్లుగానే మత చిచ్చును రేపింది. వివాదం ఎవరు మొదలు పెట్టారు, గుంపులను రెచ్చగొడుతున్నది ఎవరు అనే విషయాలు ఉద్దేశపూర్వకంగా పక్కనపెట్టి, వాటిని అదుపు చేసే చర్యలు ఏమాత్రం తీసుకోకుండా ప్రభుత్వం మూడు రోజులు విద్యాసంస్థల్ని మూసేసింది. హిందూ, ముస్లిం విద్యార్థులు పోటాపోటీగా వారి మతపరమైన దుస్తులు వేసుకొచ్చి గొడవ చేస్తున్నారని మీడియా ప్రచారం చేసింది. విద్యార్థులంతా స్కూల్ యూనిఫాం తప్ప ఏ మతపరమైన బట్టలు తగిలించుకోకూడదని కర్ణాటక హైకోర్టు తాత్కాలిక ఉత్తర్వులు ఇచ్చింది. పీడకులు బాధితుల మధ్య తటస్తంగా వ్యవహరించడమంత మోసం ఇంకోటి ఉండదు.  అసలు
సంపాదకీయం

పాతవి కొత్తగా మారడం

పాతవి పోతాయి. కొత్తవి వస్తాయి. ఇండియాలో ఇది చాలా విచిత్రంగా జరుగుతుంది. వికృతంగా ఉంటుంది. మన సామాజిక మార్పు అంతా ఇట్లాగే జరిగింది. అందులో ఈ ధోరణి ప్రధానమైనది. అది తెలుసుకోలేక చాలా మంది గందరగోళానికి గురవుతుంటారు. ఇన్ని దశాబ్దాలలో ఏ మార్పూ రాలేదా?..అంటే వచ్చింది. చాలానే మారింది.  కానీ పాతదానితో తెగతెంపులు జరగని మార్పులు ఇవి. ప్రతి మార్పూ  వెనుకటిదాన్ని వెంటేసుకొని కొత్తగా  వస్తుంటాయి. ఇది సామాజిక సాంస్కృతిక రంగాల్లో కనిపించినంతగా చట్ట, పాలనా రూపాల్లో కనిపించకపోవచ్చు. కానీ స్థూలంగా పాతది కొత్తగా మారే ఈ చట్రంలోనే అన్నీ భాగం. జూలై 20 నుంచి ఆగస్టు 11
సంపాదకీయం

శ్రామిక జన గాయకుడు

ప్రజాకళాకారుడు ఉన్నవ నాగేశ్వరావు ఆకస్మికంగా మరణించాడు. తీవ్రమైన అనారోగ్యాన్ని దాచుకొని భూమిని ఖాళీ చేసి వెళ్లిపోయాడు. ఒక మనిషి భౌతిక నిష్క్రమణ చుట్టూ ఉన్న సమాజానికి అక్కరలేదు. రక్త సంబంధాలు, అభిరుచులు, కళా, సాహిత్య  సాహచర్యంలో వున్నవారికి ఆందోళన కలిగిస్తాయి.  ఈ ఆవేదన జీవితం కొనసాగింపులో జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. కామ్రేడ్ నాగేశ్వరరావు విప్లవ రాజకీయాలలోకి వచ్చిన కాలం నుండి మరణం వరకు ఆ రాజకీయాలకు వాహికగా పనిచేశాడు . కళారంగం ద్వారా తాను చేయదగిన పనిని నిర్వర్తించాడు. 1997లో ఏర్పడిన ప్రజా కళా మండలి లో చేరి మరణించే నాటికి కోశాధికారిగా ఉన్నాడు. ఉన్నవ నాగేశ్వరరావుది గుంటూరు జిల్లా
సంపాదకీయం

కవిత్వంలో మాదిగత్వం

ప్రతి కవీ తనదైన సొంత వాక్యాం ఒకటి ఇచ్చిపోతారు. సొంత వ్యక్తీకరణ అప్పగించి పోతారు. ఆ కవి చాలానే రాసి ఉండవచ్చు. చాలానే అచ్చేసి ఉండవచ్చు. కానీ కోర్‌ ఉంటుంది.  దాన్నే పాఠకులు తలచుకుంటారు. విమర్శకులు అంచనా వేస్తారు. మిగతావన్నీ వివరాలే. అవన్నీ చెప్పుకొనేది కోర్‌ను చేరుకోడానికే. అట్లా చూస్తే  కవిగా ఎండ్లూరి సుధాకర్‌లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. దళిత కవుల్లో కూడా ఆయనకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి.  సుధాకర్‌ తొలి సంపుటం ‘వర్తమానం’ 1992లో వచ్చింది. సరిగ్గా 30 ఏళ్ల కింద. ఒకసారి ఆ సంపుటాన్ని పరిశీలిస్తే కవిగా ఎండ్లూరి సుధాకర్‌ రూపొందిన తీరు కనిపిస్తుంది. ఆయనలోని
సంపాదకీయం

గద్దర్‌ మరణానంతరం

పది రోజులుగా అంతటా గద్దరే. అందరి నోటా గద్దరే. ఆయన పాటను తాము ఎట్లా విన్నామో చెప్పుకుంటున్నారు. ఆ పాట తమనెలా కుదిపి నిలబెట్టిందో గుర్తు చేసుకుంటున్నారు. ఆయన కవిత్వాన్ని, గొంతును, హావభావాలను, ఆహార్యాన్ని, ఆడుగుల సవ్వడిని తలపోసుకుంటున్నారు.  వ్యక్తిగా ఆయన గురించి తమకెట్లా ఎరుకైందో దగ్గరిగా చూసిన వారు తలచుకుంటున్నారు. ఈ మొత్తంలో దేనికదే చూస్తున్నవారున్నారు. అన్నీ కలిపి ఎట్లా అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నవారు ఉన్నారు. ఆయన పాటను అనుభవించాల్సిందేగాని కొలతలు వేయవద్దంటున్నవారు ఉన్నారు. తామూ అంచనా వేస్తున్నామనే సంగతి మర్చిపోయి కొంచెపు అంచనాలు వేయవద్దనే వాళ్లూ ఉన్నారు. అసలు ఏ అంచనాలకు గద్దర్‌  మూర్తిమత్వం లొంగదనే
సంపాదకీయం

మణిపూర్ మారణకాండ మాటున

‘జబ్బు పడిన కాదు జబ్బ చరిచిన ఏడుగురు అక్క చెల్లెళ్ళను చూడడానికి వెళ్లి వచ్చాను’ అని రాసాడు శివసాగర్ విరసం ఏర్పడిన పదేళ్ల సందర్భంగా వేసిన కవితా సంకలనానికి ‘పది వసంతాలు’ పేరుతో 1980 అక్టోబర్‌లో. ఆ ఏడుగురు అక్క చెల్లెళ్ళు ఎవరో కాదు ఈశాన్య రాష్ట్రాలు. సిపిఐ (ఎంఎల్) (పీపుల్స్ వార్) ఏర్పడినాక తన ప్రజా యుద్ధ వ్యూహంలో దండకారణ్య పర్‌స్పెక్టివ్‌తో నక్సల్బరీ నాటి నుంచే తనకున్న ఈశాన్య రాష్ట్రాల, కశ్మీరు స్వయం నిర్ణయ హక్కును విడిపోయే హక్కుగా కూడా గుర్తిస్తున్న పార్టీగా ఏం చేయవలసి ఉంటుందో, ఏం చేయగలదో మళ్లీ తాజాగా ఒక అవగాహనకు వచ్చి