మన జీవితాల్లోకి చొరబాటు
అత్యంత శక్తివంతుడని చెప్పుకోబడుతున్న నాయకుడు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నాడు. ఆవును అనో, కాదు అనో చెప్పలేకపోతున్నాడు. ఈ ఒక్క ప్రశ్నకే కాదు ఇప్పటిదాకా అయన దేనికీ జవాబు ఇవ్వలేదు. కానీ ఆయన భక్తుల దృష్టిలో ఆయన అత్యంత శక్తివంతుడు. ప్రపంచ అధినేతలను సైతం భయపెట్టగలిగిన వాడు. అయన ఏమి చేసిన దేశం కోసం చేస్తాడని ప్రచారం చేసుకోగలవాడు. కానీ ఇప్పటిదాకా ఒక్క మీడియా సమావేశాన్ని కూడా ఎదుర్కోలేదు. అయితే కంట కన్నీరు కారుస్తూ దేశభక్తి రాగాలాపన చేస్తుంటాడు. ఇప్పుడు పార్లమెంటులో దేనికీ జవాబు ఇవ్వలేని స్థితిలో ఉన్నాడు. అంతగా ఆయన్ని ఇబ్బంది పెడుతున్న ప్రశ్న భారత







