సంపాదకీయం

ల‌క్ష ద్వీప్ కోసం మాట్లాడ‌దాం

లక్ష ద్వీప్ మనకు పడమట దిక్కున ఉన్న దీవులు. ముప్పై ఆరు దీవుల సమూహం. డెబ్భై వేలకు పైగా జనాభా ఉన్న ప్రాంతం. 97 శాతం వరకు ముస్లిం జనాభా ఉంటుంది. మిగతా మూడు శాతం బయటి నుండి వచ్చిన వారు. అక్కడ గత కొన్ని వారాలుగా ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. కారణం తమ నేల నుండి తమని పరాయి వారిని చేయడానికి బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు. సాధారణంగా కేంద్ర పాలిత ప్రాంతలకు ఐఏఎస్ లేదా ఐపిఎస్ అధికారులను పరిపాలన అధికారులుగా రాష్ట్రపతి నియమిస్తారు. కానీ గత డిసెంబర్లో గుజరాత్ కు చెందిన భాజపా నేత ప్రఫుల్ ఖోడా
సంపాదకీయం

ఈ నిషేధాన్ని అంగీక‌రిద్దామా?

విర‌సం మ‌రోసారి నిషేధానికి గురైంది. తెలంగాణలో విర‌సం  సహా పదహారు ప్రజాసంఘాలను నిషేధించారు. మార్చి 30 న త‌యారు చేసిన జీవో నెంబర్ 73లో  పదహారు  ప్ర‌జా సంఘాలు మావోయిస్టు పార్టీ అనుబంధ సంఘాల‌ని  పేర్కొన్నారు.  ఇవి  మావోయిస్టు పార్టీ వ్యూహం ఎత్తుగడల ప్రకారం పనిచేస్తున్నాయన్నది ఆరోపణ. తెలంగాణ డిజిపి చీఫ్ సెక్రటరీకి 12 మార్చి 2021 న ఒక లెటర్ పంపారు. దానికి ప్రతిగా మార్చి 30న తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ పేరుతో ఈ జోవో విడుదల అయింది. అయితే అది ఇరవై నాలుగు రోజుల తరువాత ఏప్రిల్ 23 న పత్రికలకు చేరవేశారు. మామూలుగా
సంపాదకీయం

మావోయిస్టులపై నిషేధం ఎత్తివేతే ప్రజాస్వామ్య పునరుద్ధరణకు సానుకూలత

పదేళ్ల భారత రాష్ట్ర సమితి పాలన ముగిసి  తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ సాధనలో చోదకశక్తి అని , తెలంగాణ తెచ్చింది తామేనని టిఆర్ఎస్ నాయకత్వం తెలంగాణ సమాజాన్ని వంచన చేసింది. అనేక బలిదానాలు, త్యాగాలు , వర్గాల సమీకరణలో భాగంగా దశాబ్దం క్రితం తెలంగాణ సాకారమైంది‌. పోరాడి సాధించుకున్న తెలంగాణ  ప్రజాస్వామిక తెలంగాణగా తమ వనరులు తమకు దక్కడమేగాక  నూతన రాష్ట్రంలో తమ ఆకాంక్షలన్నీ  నెరవేరాలని, ప్రజాస్వామిక  భావనలు మరింత విస్తృతం కావాలని ప్రజలు ఆశించారు‌. తెలంగాణ కోటి రతనాల వీణ అన్న కవి వాక్కు నిజం కావాలని
సంపాదకీయం

షరతులు వర్తిస్తాయి…

ఏ వివాదానికైనా పరిష్కారం ఉండవలసిందే. అసలు వివాదమే లేనప్పుడు పరిష్కారం వెతకడం వృధా ప్రయాస.  భారతదేశానికి ఉత్తరప్రదేశ్ అతి పెద్ద రాష్ట్రం. యోగి పాలనలో ఏం జరుగుతోందో  తెలిసిన విషయమే. గుజరాత్ నమూనా తర్వాత ఉత్తరప్రదేశ్ లో ఒక ప్రయోగం కొనసాగుతోంది. ప్రజల దైనందిక జీవనంలో జోక్యం ఎక్కువవుతోంది. ఈ జోక్యం బహురూపాలలో వ్యక్తం అవుతోంది.  ఈ నమూనా భారతదేశం అంతటా విస్తరించవచ్చు. భారతదేశ పని సంస్కృతిలో ఉన్న సంబంధాన్ని విడదీసే ప్రయత్నం యోగి ప్రభుత్వం చేస్తోంది. క్షురక, దర్జీ వృత్తులలో ఉన్న పురుషుల దగ్గరకు స్త్రీలు వెళ్ళకూడదు. స్త్రీలు తమ అవసరాల కోసం స్త్రీల దగ్గరికి వెళ్ళాలి.
సంపాదకీయం

పోతూ పోతూ కూడా..

.. ఈసారి ఆయన అధికారంలోంచి దిగిపోతాడనే అంటున్నారు. ఎప్పటి నుంచో పరిశీలకులు చెబుతూనే ఉన్నారు.  ఎగ్జిట్‌ పోల్‌ అంచనాల్లో అవే కనిపిస్తున్నాయి.  ఎన్నికల్లో ప్రజాభిప్రాయ వ్యక్తీకరణకు  అవకాశం ఉందా? ప్రజా సమస్యల ప్రచారానికి,  పరిష్కారానికి గతంలోలాగా కనీసంగా అయినా ఇప్పుడు ఎన్నికలు ఉపయోగపడతాయా? లేక ఎప్పటిలాగే వంచనలు, ప్రలోభాలు, ఓట్ల కొనుగోళ్లు .. ఎన్నికల ఫలితాలను నిర్ణయిస్తాయా?  ఎన్నికల ఎత్తుగడవాదుల ప్రయత్నాలు ఓట్ల ఫలితాలను కనీసంగా అయినా ప్రభావితం చేస్తాయా?   అని ఎంత విశ్లేషణ అయినా ఇవ్వవచ్చు.  కాకపోతే  పదేళ్ల నియంతృత్వ పాలన మీద ఈ ఎన్నికల సమయంలో కూడా తెలంగాణ పదునైన విమర్శను  వినిపించింది. ఎన్నికల రాజకీయాల్లో
సంపాదకీయం

ఇదొక హిందుత్వ దారి…

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో రెండు  ప్రధానమైన విషయాలు చర్చనీయాంశంగా వున్నాయి.మొదటిది భావ ప్రకటనా  స్వేచ్ఛపై నియంత్రణ. రెండవది కూటమి ప్రభుత్వం చాగంటి కోటేశ్వరరావు వంటి సనాతన వాదిని ప్రభుత్వ సలహాదారుగా నియమించుకోవడం . ఈ రెండు విషయాలు పరిష్పర ఆధారితాలు. భావ ప్రకటన స్వేచ్ఛను తెలుగుదేశం పార్టీ  తన ప్ర త్యర్థి జగన్ కాంగ్రెస్ నుండి లాక్కోవడం  మాత్రమే కాదు. ప్రభుత్వం గురించి వ్యతిరేకంగా మాట్లాడితే పోలీసుల దగ్గర పంచాయితీ ,అరెస్టులు ఉంటాయనే విషయాన్ని చంద్రబాబు, పవన్ చెబుతున్నారు. వందలాదిమంది   యూట్యూబర్లను  పోలీస్ స్టేషన్ కు పిలిచి రాద్ధాంతాన్ని క్రియేట్ చేస్తున్నారు.    పదేళ్ల కాలంలో విభజిత ఆంధ్రప్రదేశ్ లో 
సంపాదకీయం

ఆర్కె  స్మృతి నేరం కాదు

పాణి కామ్రేడ్‌ ఆర్కె మరణించి కూడా మనకు  ఒక  భరోసాను ఇచ్చాడు. ఈ చీకటి రోజుల్లోనూ ధైర్యాన్ని అందించాడు. తన విస్తారమైన ప్రజా జీవితంలో వలె మరణానంతరం కూడా  మనలో ఆశను రగిల్చాడు.    ఆర్కె జ్ఞాపకాల, రచనల సంపుటి ‘సాయుధ శాంతి స్వప్నం’ను తెలంగాణ పోలీసులు స్వాధీనం చేసుకోవడం చట్ట వ్యతిరేకమని హైకోర్టు ఈ నెల 11న తీర్పు ఇచ్చింది. పుస్తకాలను ప్రచురణకర్తకు ఇచ్చేయాలని, ప్రింటర్‌ మీద పెట్టిన కేసు చెల్లదని ప్రకటించింది. న్యాయ పీఠాలు అన్యాయ స్థావరాలుగా మారిపోయిన వేళ ఇలాంటి తీర్పు వెలుబడిరది. తెలంగాణ పబ్లిక్‌ సెక్యూరిటీ యాక్ట్‌ కింద  పోలీసులు ఈ కేసును నమోదు
సంపాదకీయం

విప్లవ మానవుడు అమరుడు జి ఎన్ సాయిబాబా

విరసం ప్రపంచ విప్లవ మానవుడిగా పేర్కొన్న అమరుడు కామ్రేడ్ జి ఎన్ సాయిబాబా ఎక్కడ పుట్టి చేతులతో పాకుతూ, బుద్ధితో జ్ఞానాన్ని పొందుతూ చేతనతో వివేకాన్ని పెంచుకుంటూ నిజంగానే ప్రపంచమంతా తిరుగుతూ విప్లవ ప్రస్థానం చేసాడు. అమలాపురం పక్కన ఒక వ్యవసాయ కూలీగా మారిన పేద రైతు ఇంట్లో పుట్టి చదువు కోసం ఆ ఊరు చేరేనాటికి అది కోనసీమ. ఆయన జీవితం మాత్రం తండ్రి నాడు చిన్న రైతుగా కొంత భూకమతం కలిగి ఉన్నా బతుకు దుర్భరమై సాయిబాబా, పోలియో బాధితుడైన సాయిబాబా చదువుకుంటేనైనా భవిష్యత్తు ఉంటుందని తల్లిదండ్రులు సాహసం చేసి అమలాపురానికి తరలివచ్చారు. అయితే సాయిబాబా
గెస్ట్ ఎడిటోరియల్

ఇథనాల్ వ్యతిరేక ఉద్యమంపై దాడి 

(ప్రాణాంతక ఇథనాల్ కంపెనీ వ్యతిరేక రైతాంగ పోరాటానికి మద్దతుగా , ఆ ఉద్యమం పై రాజ్య హింసను నిరసిస్తూ చిత్తనూరు ఇథనాల్‍ వ్యతిరేక పోరాట కమిటీ పక్షాన రాసిన ఈ కీనోట్ ను ఈ సంచిక సంపాదకీయంగా ప్రచురిస్తున్నాం - వసంత మేఘం టీం) చిత్తనూర్‍, ఎక్లాస్పూర్‍, జిన్నారం గ్రామాలకి చాలాదగ్గరలో ఇథనాల్‍ కంపెనీకి దగ్గర్లో ఎక్లాస్పూర్‍ గేటు దగ్గర రిలే ధర్నాలు జరుగుతున్న శిబిరం ముందు 22.10.2023న ఉదయం పూట రైతాంగంపై పోలీసులు దాడిచేశారు. అధికారులు, రాజకీయ నాయకత్వం మరియు కంపెనీ పక్షాన పోలీసులు చాలా ఆగ్రహంతో దాడిచేశారు. ఇది రైతులు ఊహించని ఘటన. ఎందుకు ఇలా
సంపాదకీయం

పాలస్తీనా సందర్భంలో ప్రమాదకరంగా మారిన సోషల్‌ మీడియా

భారతదేశం అరుదైన రికార్డును సాధించింది. సోషల్‌ మీడియా అబద్ధాల ప్రచారంలో ప్రపంచంలో అన్ని దేశాలకన్నా ఇండియా చాలా ముందుంది. ఈ ఘనత సాధించిన సందర్భం ఇజ్రాయెల్‌-పాలస్తీనా యుద్ధం. ఇజ్రాయెల్‌ అనుకూల, ముస్లిం వ్యతిరేక సోషల్‌ మీడియా పోస్టుల్లో నకిలీ వార్తలు, తప్పుడు సమాచారంలో 70 శాతానికి పైగా భారతదేశం నుండి ప్రచారమవుతున్నాయని డిజిటల్‌ డేటాను పరిశీలించే ఒక నివేదిక చెప్పింది! ఈ స్థాయిలో ఇజ్రాయెల్‌ పక్షం తీసుకుని భారతీయులు సోషల్‌ మీడియా యుద్ధం చేయడం చూసి ప్రపంచం విస్తుపోతోంది. స్వయంగా ఇజ్రాయెల్‌ కూడా ఇంతగా తనను తాను సమర్థించుకొని ఉండదు. వందేళ్ల పాలస్తీనా-ఇజ్రాయెల్‌ సంఘర్షణా చరిత్రలో ఎన్నడూ లేని