ఎన్నికల తరువాత ..
‘ఎన్నికల వేడి’ అంటారు కదా. అది ఎన్నికలయ్యాక చల్లారిపోతుంది. మళ్లీ ఏవో ఎన్నికలు వచ్చే దాకా అంతా చల్లదనమే. పోలింగ్ పాలకుల తలరాత మారుస్తుంది. కొత్త వాళ్లు అధికారంలోకి రావచ్చు. పాత వాళ్లే కొనసాగవచ్చు. అద్భుతాలు జరిగినా, జరగకపోయినా ఏదో ఒక రకంగా ‘పాలించడబడటం’ ప్రజలకు మామూలవుతుంది. వేడి చల్లారిపోవడం, కొత్తపోయి పాతపడటం అంటే ఇదే. కాకపోతే మొన్నటి సాధారణ ఎన్నికలకు కొంత ప్రత్యేకత ఉంది. ప్రధాన స్రవంతి పత్రికల్లో కూడా ఇది కనిపించింది. బీజేపీ కూటమికి, ఇండియా కూటమికి మధ్య భావజాల ఘర్షణగా కూడా చూశాయి. నిజానికి ఇది దిన పత్రికలకు అందే వ్యవహారం కాదు. వాటి