సంస్మరణ

తల్లీ కొడుకుల మరణానంతర తలపోత

 ప్రజా యుద్ధంలో ఉన్న ఆ కొడుక్కు తల్లి మరణవార్త ఎప్పటికో తెలిసింది. ఆ విషాదాన్ని, దాని చుట్టూ ఉన్న సొంత అనుభూతులను, విప్లవోద్యమ అనుభవాలను కలిసి ఆ కొడుకు ఈ వ్యాసం రాసి వసంత మేఘానికి పంపాడు. కానీ ఇది మాకు చేరి ప్రచురించేనాటికి ఆయన కూడా అమరుడయ్యాడు. ఆ తల్లి భీమరాజు. ఆ కొడుకు చీమల నర్సయ్య అలియాస్‌ జోగన్న. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా బయ్యారం. ఆపరేషన్‌ కగార్‌లో ఏప్రిల్‌ 30, 2024 న అబూజ్‌మాడ్‌ (టేకెమెట) ఎన్‌కౌంటర్‌లో అమరుడయ్యాడు. నిరుపేద దళితురాలైన ఆ తల్లి కన్నగచాట్లుపడి పెంచి పెద్ద చేసుకున్న కొడుకు విప్లవంలోకి వెళ్లాక ఆమె
సంస్మరణ

కవీ, అతని తల్లీ ‘మాటకు మాట మధ్య’

అజ్ఞాత అమర కవి సత్యనారాయణ తల్లి ఈశ్వరమ్మ ఈనెల 24వ తేదీ మందమర్రిలో చనిపోయింది.  విప్లవకారులందరి తల్లుల్లాగే  కొడుకు జీవించి ఉన్నంత వరకు అతని కోసం నిరీక్షణా భారాన్ని అనుభవించింది. అతని మరణానంతరం బిడ్డ తలపోత వ్యథతో జీవించింది. విప్లవంలోకి వెళ్లే పిల్లల వ్యక్తిత్వంతో ప్రభావితమైన తల్లుల్లాగే ఈమె కూడా కొడుకు మీది ప్రేమలో విప్లవాన్ని చూసుకున్నది. ఆ ఎడబాటుతో, అనారోగ్యంతో ఆమె వెళ్లిపోయింది.  సత్యనారాయణ విప్లవోద్యమంలో ఎన్ని పేర్లతో పని చేశాడోగాని అతని రచన సంపుటితో ‘పునరంకితం’ సత్యనారాయణగా అజరామర గుర్తింపు తెచ్చుకున్నాడు.  తూర్పు గోదావరి జిల్లా దారకొండ ఘటనలో ఆయన  అమరుడయ్యాడు. విప్లవ మేధావి నవీన్‌
సంస్మరణ

కాకలు తీరిన యోధుడు సృజన్ సింగ్

భారత విప్లవోద్యమ చరిత్రలో 1980కి విశిష్ట స్థానం వుంది. దేశ విప్లవోద్యమ చరిత్రలో అది ఒక మైలురాయిగా నిలిచిపోయిన సంవత్సరం. 1980 జూన్ లో ఆంధ్రప్రదేశ్ నుండి ఎంపిక చేసిన యువ విప్లవకారులు సరిహద్దులలోని దండకారణ్యంలో అడుగిడినారు. వారు, 35 మంది విప్లవకారులు 7 దళాల రూపంలో విశాల అటవీ ప్రాంతంలో తమ విప్లవ కార్యకలాపాలకు నాంది పలికారు. ఆ అటవీ ప్రాంతంలో భాగం పాత చంద్రపుర్ (చాందా) జిల్లా, వర్తమాన గడ్ చిరోలీ జిల్లా. గడ్ చిరోలీ జిల్లా ప్రాణహిత, ఇంద్రావతి, గోదావరి నదులు సరిహద్దులుగా ఆంధ్రప్రదేశ్ తో అనుబంధాన్ని కలిగివుంది. గడ్చిరోలీ విప్లవోద్యమ చరిత్రలో 1980,