హై స్కూల్ కి వచ్చేదాకా నేను అబ్బాయిగానే చూడబడ్డాను అమ్మాయిల స్కూల్లో ఒకే ఒక అబ్బాయి ఉండడాన్ని వాళ్ళు గర్వంగా భావించేవారు. నా జుట్టు చిన్నగా కత్తిరించి ఉన్నా.. నేను బాగా పొగరుబోతులా ఉన్నా.. నన్ను టీచర్లు..నా తోటి విద్యార్థులు ప్రేమించేవారు. నేనూ వాళ్ళని విడిచి ఉండలేనంతగా ప్రేమించాను. *** బడిలో.. ఇంట్లో నాకు అబ్బాయిలు చేసే పనులు మాత్రమే చెప్పేవారు.. నాకు అమ్మాయిలా ఉండాలని ఉన్నా .. అబ్బాయిలా ఉండడాన్ని కూడా ఇష్టపడ్డాను. అప్పట్లో నాకుండే ఒక్కగానొక్క బాధల్లా... నా స్నేహితురాలిలా పాడలేక పోతున్నాననే ! ** ఇక నేను క్యాంపులకి వెళ్లి నప్పుడు... అబ్బాయిలు పొరపాటున నన్ను కౌగలించుకుని ., మరుక్షణం సిగ్గుతో వదిలేశారు.. బహుశా "అన్నా నన్ను వదులుతావా నేను అబ్బాయిని" అని కూడా అని ఉంటాను నేను. ***** కానీ నాకు పదహారేళ్లు వచ్చేటప్పటికి... మా అమ్మ నాలోఆడపిల్లను పసిగట్టేసింది. అతి కష్టపడి ఐదు నెలల్లో నేను పొడవుగా జుట్టు పెంచుకున్నాను. అంతే కాదు నా గొంతు ఆడపిల్ల గొంతులా నాజూకుగా మారిపోయింది. స్కూల్లో పూర్వ విద్యార్థుల కలయిక అప్పుడు.. నన్ను చూసిన వాళ్లంతా నా అందాన్ని తెగ పొగిడారంటే నమ్మండి ! నేను అబ్బాయిగా ఉన్నప్పుడు నేనసలు అమ్మాయిలాగ కనపడే వీలే లేదనే వారు. ఇప్పుడేమో..."గులాబీ రంగు బుగ్గలతో ., పట్టులా మెరిసిపోయే వెంట్రుకలతో ఎంతందంగా ఉన్నావు నువ్వు" అని మా టీచర్ మురిసిపోయింది. నేనెంతో ఆనందించాను..లోలోపల నాకు అమ్మాయిలా ఉండాలన్న వాంఛ సలుపుతుంటే..! నాకెందుకో మళ్లీ నేను తిరిగి పాత అబ్బాయిలా ..పూర్తి అబ్బాయిలా మారిపోయి..మగవాడు చేసే పనులు చెయ్యాలని అనిపిస్తోంది...అమ్మాయినో... మరి అబ్బాయినో తెలీక దుఃఖం వస్తోంది...!
