‘పెద్ద దేశాలు చిన్న దేశాల వనరులను దోచుకోవడానికి యుద్ధాలు చేస్తాయి అన్నాడు’ లెనిన్.
ప్రస్తుతం జరిగే యుద్దానికి మూల కారణం వనరులేనా! అమెరికా ఇరాన్ దేశం మీద అనేక అపోహలు పెట్టి తమ ఆదేశాన్ని కాదనడం వల్ల ఆ దేశం ప్రపంచ దేశాలకు ముప్పు తెచ్చిపెడుతుందని ప్రపంచానికి చెప్పి యుద్దం పరోక్షంగా మొదలుపెట్టింది. నిజానికి యుద్దం బహిరంగంగా ప్రకటించలేదు పిల్లి ఎలుక కోసం మాటు వేసినట్టు ఎప్పటి నుంచో ఖమేనిని మాటు పెట్టింది సిఐఏ. బాహ్య రూపంగా చర్చలు జరిపినట్టు నటించి ఇరాన్ ప్రభుత్వం అంగీకరించని విదంగా తమ ఉద్దేశలను తెలిపింది. ఫిబ్రవరి 28 న ఖమేని ఇతర ఇరాన్ ఉన్నత అధికారులు సమావేశమయ్యే విషయాన్ని పసిగట్టిన సిఐఏ ఆ విషయాన్ని ఇజ్రాయిల్ తో పంచుకుంది. ఆ ఉదయమే ముప్పై క్షిపణులతో ఇజ్రాయిల్ ఇరాన్ మీద దాడి చేసింది. ఖమేనితో సహ వారి కుటుంబ సభ్యులు ఇరాన్ ఉన్నత అధికారులు చనిపోయారు.
అమెరికా 1971 నుంచి 2025 వరకి 38 మిలియన్ ప్రజలని చంపింది అని అమెరికా సీనియర్ జర్నలిస్ట్ ఆరోపించారు.
ప్రపంచ దేశాలలో అత్యంత అప్రజాస్వామ్యంగా ప్రవర్తిస్తున్న దేశాలలో అమెరికా ఒకటి. ప్రస్తుత కాలంలో ముందు వరుసలో ఉంది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన సంవత్సరానికే ఏడెనిమిది దేశాలపై దాడులకు ఆదేశించాడు. పరోక్షంగా ఇజ్రాయిల్ కు ఆయుధాలు సరఫరా చేశాడు.
అమెరికా సామ్రాజ్యవాదంగా ప్రవర్తించడం ఇదేమి కొత్త కాదు మొదటి నుంచే తమ ఆధీనం లోకి రాని దేశాలను వాటి శత్రు దేశాలతో చేతులు కలిపి ఆ ప్రభుత్వాన్ని కులదోసి తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఉంచడమే చేస్తుంది.
ఇరాన్ మీద ట్రంప్ చేయించిన దాడి కూడా లాభదాయకం కోసమే. వ్యాపారం ఎలా అభివృద్ది చెందాలి ప్రపంచ దేశాల కంటే తమ దేశమే గొప్ప దేశంగా నిలవాలి దాని కోసం ఎంతటి నర హంతకానికైనా వెనుకాడని చరిత్ర ఆమెరికాకుంది దాన్ని ట్రంప్ మళ్ళీ నిరూపిస్తున్నాడు.
జనవరి 3 న వెనుజ్యూలా మీద చేసిన దాడి కూడా ఇంచుమించు ఇలాంటిదే అయితే వెనుజ్యూలా దాడి కూడా ఆ దేశం తాము విధించిన చర్యలకు తలొగ్గకపోవడమే. తమకు సహకరించకపోతే భారీ మూల్యం తప్పదని వెనుజ్యూలా ఉపాధ్యక్షురాలికి బహిరంగంగానే చెప్పాడు. ఇంతటి చర్యలను కూడా అంతర్జాతీయ న్యాయస్థానం ఖండించలేదు. అంటే అమెరికా లాంటి సామ్రాజ్యవాద దేశాలను ఎదిరించి అంతర్జాతీయ న్యాయస్థానం కూడా ఏమి చేయలేదు ప్రస్తుతం ఆమెరికానే అంతర్జాతీయ న్యాయస్థానం. ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలు ఉన్న దేశం వెనుజ్యూలా, దాదాపు 17% ఆ దేశంలోనే ఉన్నాయి. అ దేశానికి జరగాల్సిన లావాదేవిలను కూడా అమెరికా అడ్డుకట్ట వేసింది దానితో ఆ దేశం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది.
రక్షణ రంగంలో అమెరికా అగ్రస్థానంలో ఉంది అక్కడ ఉత్పత్తి చేసే అత్యున్నత ఆయుధాలు, విమానాలు, రాకెట్లు, బాంబులు అధిక ధరకు అమ్ముతారు అమెరికా కంపెనీలు.
ఒక సీనియర్ జర్నలిస్ట్ అమెరికా ఆయుధాల కంపెనీ అధికారిని ఓ ప్రశ్న వేశాడు ‘ ఎందుకు ఎక్కువగా యుద్దాలు జరగాలని కోరుకుంటారు మీరు, మీరు కోరుకున్నట్టే యుద్దాలు జరుగుతుంటాయి’ అని దానికి ఆయన ఇచ్చిన సమాధానం ‘ మేము తయారు చేసిన ఆయుధాలు అమ్ముడవ్వాలి అంటే యుద్దం జరగాలి కదా’ అని నవ్వుతూ సమాధానం చెప్పాడు.
ప్రపంచ ఆయుధ ఎగుమతుల్లో అమెరికా వాటా 43 శాతానికి పెరిగింది.
‘ప్రపంచం చంపబడటానికి ఇష్టపడదు
ప్రపంచం బతకాలని అనుకుంటుంది
సామ్రాజ్యవాది కన్నా గొప్ప మృత్యువ్యాపారి మరొకడు లేడు’ అన్నాడు కళ్యాణరావ్ అమెరికానుద్దేశించి 2003 లో.
ఇరాన్ వైపు కొన్ని దేశాలు, ఇజ్రాయిల్- అమెరికా వైపు కొన్ని దేశాలు నిలబడి యుద్దాన్నికి చేయుతనిస్తున్నాయి యుద్దం చేసి ఒకనాటికి అవి వెళ్లిపోతాయి కానీ యుద్దం జరిగిన చోట ప్రజలు సమాధుల జ్ఞాపకాలతో బ్రతకాలి. ఇప్పటికే ఇరాన్ లో వందల మంది చిన్నపిల్లలు చనిపోయారు. ఇరాన్ అమెరికా మీద నేరుగా కాకుండా గల్ఫ్ దేశాల్లో ఉన్నా అమెరికా కార్యాలయాలపై దాడికి దిగింది.
ఇంత విధ్వంసం జరుగుతుంటే భారత ప్రభుత్వం ఎటు వైపు మొగ్గు చూపుతుందో ననే నూట నలబై కోట్ల భారతీయులలో పది శాతం కాకుండా మిగతా అందరి చూపు ఉంది కానీ ప్రస్తుతం భారత ప్రభుత్వం ఫాసిస్టు ప్రభుత్వం. ఆలోచనాలన్నీ స్వంత ఆస్తి కోసమే. లాభదాయకం కోసమే.
ఇరాన్ మీద ఇజ్రాయిల్ దాడి జరిగే ముందు కూడా భారత ప్రధాని ఇజ్రాయిల్ లోనే ఉన్నాడు. ఫాసిస్టు బిజేపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అదానీ- ఇజ్రాయిల్ కంపెనీ కలిసి ఆయుధ ఉత్పత్తి అగ్రీమెంట్ చేసుకున్నాయి ప్రస్తుతం ఇజ్రాయిల్ పేల్చే డ్రోన్ హైదరాబాద్ లోనే తయారయ్యాయి. పరోక్షంగా భారత ప్రభుత్వం కూడా యుద్దంలోనే పాల్గొంటుంది. కానీ ఎవరివైపు!
భారత ప్రభుత్వం ప్రస్తుతం అమెరికా చెప్పుచేతల్లో ఉంది. ప్రపంచ నలుమూల దేశాలకు భారతదేశం స్వేచ్ఛా, శాంతికి చిహ్నం లాంటిది. కానీ ప్రస్తుతం దేశం మౌనం పాటించడం దేశానికే నష్టం.
అసలు భారత ప్రభుత్వం వెనుజ్యూలా నుంచి తక్కువగా చమురు దిగుమతి చేసుకునే అవకాశం ఉన్న కూడా అది తగ్గించుకుంటూ వచ్చింది. రష్యా నుంచి ఎక్కువగా చమురు దిగుమతి చేసుకుంటే అమెరికా భారత్ మీద అనేక ఆంక్షలు విధిస్తుంది అంటే భారత ప్రభుత్వం ఎక్కడి నుంచి దిగుమతి చేసుకోవాలి ఏయే దేశాలతో సంభందాలు కొనసాగించాలో ఆమెరికాయే నిర్ణయిస్తుంది.
గ్రీన్ లాండ్ ని ఆధీనం చేసుకోవడానికి ఆ దేశం మీద యుద్దం కూడా ప్రకటించింది. ఇలా ప్రపంచాన్ని శాసహించడానికి తమ చెతల్లో ఉంచుకోవాడానికి అమెరికా తనకున్న మేధస్సు, తమ కున్న బలం తమ రక్షణ చర్యలు ఇలా బాహాటంగా చూపిస్తున్నాడు ఒక పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ఇచ్చినట్టు.
అమెరికా వెనుజ్యూలా మీద దాడి ఇప్పుడు ఇరాన్ మీద దాడి యీ రెండు దేశాలు చమురు ఉత్పత్తిలో ప్రపంచంలోనే ముందు ఉన్నాయి. రెండు దేశాలను తమ గుప్పిట్లో పెట్టుకున్నాకా యే దేశం చమురు దిగుమతి చేసుకోవాలన్నా అమెరికా దానికి రేటును నిర్ణయిస్తుంది అప్పడూ అమెరికా జిడిపి వృద్ధి అవుతుంది.
యే దేశాలు అడ్డు చెప్పకుండా అమెరికా పక్క ప్లాన్ వేసింది మొన్న epstine files అంటూ ప్రపంచ ప్రఖ్యాత ప్రముకుల జీవిత రహస్యాలు అందులో ఉన్నాయంటూ శాంపిల్స్ కోసం ఒకరిద్దరి రహస్యాలు బయట పెట్టారు. అందులో భారతదేశ ప్రధాని రహస్యం కూడా ఉందని ఒక వదంతు. ఇలా ఒక్కో దేశం చరిత్రని దేశ నేతలను తమ అధీనంలో ఉంచుకోవాలని దానికి డబ్బు రూపంగానో బలం రూపంగానో అన్నింటికంటే ఎత్తులో ఉండాలని అమెరికా సామ్రాజ్యవాద ఆలోచన.
చిన్న, చిన్న దేశాలలో అమెరికా జిడిపి ని తాకేటంత వనరులు ఉన్నాయి కానీ అవి చిన్న దేశాలుగానే ఉండిపోవడానికి అమెరికా లాంటి సామ్రాజ్యవాద దేశాలే కారణం.
యుద్దం కారణంగా భారతదేశంలోని స్టాక్ మార్కెట్ పతనమైయ్యింది. వాడుకునే వంట గ్యాసులు అదిక రేట్లు పెరిగాయి. మరికొన్ని రేట్లు కూడా పెరగాల్సి ఉంది కానీ భారత ప్రభుత్వం పెంచలేదు కారణం ఎన్నికలు దగ్గర్లోనే ఉన్నాయి. ప్రజల అవసరాల మేరకు ప్రభుత్వం నడుచుకోదు ప్రభుత్వాల అవసరానికి తగ్గట్టుగా ప్రజలే నడుచుకోవాలి.
అమెరికా ప్రెసిడెంటుకి భారత ప్రభుత్వానికి పెద్ద తేడా కనిపించదు. అమెరికాలో వనరులు లేవు కాబట్టి బయట దేశాల మీద యుద్దం చేస్తున్నాడు ట్రంప్ కానీ భారత దేశంలో అధికంగా వనరులు ఉన్నాయి కాబట్టి భారతదేశం మీదే యుద్దం చేస్తున్నాడు డ్రంప్.
ఒక సామ్రాజ్యవాదికి మరో సామ్రాజ్యవాది తోడైతే ప్రపంచం వినాశనం అవుతుంది.
భారతదేశం మౌనాన్ని వీడి బాహాటంగా యుద్దాన్ని ఖండించాలి. దేశం లోపల జరిగే యుద్దాన్ని విరమించాలి.




