1. ప్రియమైన కామ్రేడ్స్

మిమ్ముల్ని ఏనాడు కలవని
మీతో ఏనాడు మాట్లాడని
ప్రజలు
కన్నీళ్లతో మీ చరిత్రను
మననం చేసుకుంటున్నారు

మీ త్యాగాలను
హృదయాలకు హత్తుకుంటున్నారు
ఇప్పుడు
మీ అమరత్వం దేశమంతా
ఎర్రజెండాయి పరుచుకుంది

వీచే గాలిలా
ప్రవహించే నీరులా
మీరిప్పుడు గుండె గుండెకు చేరారు

కనపడని బంధికాన లా
దేశమంతా
కాషాయ కంచెలు వేశారు
మతోన్మాద హద్దులు గీశారు
హద్దులను చేరిపే
కంచెలను తొలిచే
ఆలివ్ గ్రీన్ యూనిఫామ్ తో
మీరిప్పుడు దేశమంతా
ఎర్రజెండై పరుచుకున్నారు.

2. జ్ఞాపకాల జెండాలు

బిడ్డలరా మీ జ్ఞాపకాలు
మోస్తూ
ఎదురుచూస్తున్నాం.....
కొడుకులారా
మీ ఆశయాలు మోస్తూ
లక్షలాది పీడిత ప్రజలు
యుద్ధం చేస్తున్నారు
జ్ఞాపకాలు స్మృతులు ఐనాయి
ఆశయాలు పోరాటం ఐనాయి
బిడ్డలారా
ఓ మా బిడ్డలరా
మీ జ్ఞాపకాలు
మా కళ్ళనిండా
దాచుకుంటాం
మీరెత్తిన ఎర్రజెండాను
మా గుండెలనిండా హత్తుకుంటాం.

Leave a Reply