నాక్కొన్ని మాటలు కావాలిప్పుడు నిజాం పోలిక సరిపోదు హిట్లర్ ముస్సోలిని అస్సలు అతకదు ఇంతకన్నా గొప్పగా చెప్పడానికి నాక్కొన్ని మాటలు కావాలిప్పుడు మనిషి కాదు పశువు మద మగ మృగం ఊ...హు! కీచకుడు దుశ్శాసనుడు ఐనా అసంపూర్ణమే "మో- షా"ల మొఖం గుమ్మాలమీద ఉమ్మేయడానికి జనం ముక్కోపం పదకోశంలో లేని మాటలు కావాలి తిట్ల దండకాల గ్రంథాలలో దొరకని మాటలు కావాలి అందుకే, నాక్కొన్ని మాటలు కావాలి గుజరాత్ నుండి కాశ్మీర్ మీదుగా ఇప్పుడు మణిపూర్ దాకా మంటలతో వచ్చాడు వాడు కొండకీ మైదానానికీ మధ్య చిచ్చు పచ్చగడ్డేసి రాజేసి మతం మంటల్తో చలిమంటలు కాగుతాడు వాడు నెట్ వర్క్ దారాలు తెరలు తెంపి మణిపురం చుట్టూ యజ్ఞోపవీతాల మనువాదేశాల కంచెనాటి తల్లి భారతి వొంటి పొరలు ఒక్కొక్కటిగా వొల్చి మనుబజార్లో ఊరేగిస్తాడు వాడు పసిపాలకేంద్రాలు మొదలు జన్మస్థానాలనీ రేసుకుక్కల కోరల శూలాలతో రక్కుతాడు వాడు మౌనం కళ్ళద్దాల మాటున తగలబడుతున్న ఈశాన్య మంటల్ని పగలబడి నవ్వుతూ వీక్షిస్తూ ఢిల్లీ నీరో చక్రవర్తి విదేశీ విహంగ ఫిడేల్ వాయిస్తాడు మొసలి కన్నీళ్ళు ఊసరవెల్లి రంగులు నటనలో ఆస్కార్ అవార్డులు దొంగలుపడ్డ డెబ్భై తొమ్మిది రోజులకు వాడొక పచ్చాత్తాప ప్రకటనై మొరిగిండు మణి కొండల్ని కార్పొరేట్ కుండలు నింపడం వాడి వృత్తి చట్టసభల పెట్టుబడుల చెట్టాపట్టాల చుట్టిర్కం వాడి ప్రవృత్తి అందుకే, మరింత బహు గొప్పగా చెప్పడానికి నాక్కొన్ని మాటలు కావాలిప్పుడు వాని తలాపున దీపంబెట్ట వాని పార్లమెంటింట్ల పీనుగెల్ల ఇంతకన్నా మరింతకన్నా బలమైన మాటలు కావాలిప్పుడు.

మహేష్ వేల్పుల కవిత చాలా బాగా రాశారు.
Ask MORE QUESTIONS sir
Good one