ఓ అమరవీరుడా .. విప్లవ యోధుడా..
ఎక్కడున్నవయ్యా మా పాక హనుమంతు..
ఎక్కడెలితివయ్య మా విప్లవ బందూకు ..
తొమ్మిది నెలలు మోసి నిను కన్నాది నీ తల్లి..
అడవే నీ తల్లి అని...పోతివో ఎటువెళ్ళి..2..
ఏపుట్టని అడగాలి....
ఏ చెట్టుని అడగాలి...
నీ జాడ చెప్పమని ఏ అడవిని అడగాలి
ఎన్ని బాధలున్నా ఆ లక్ష్యపు సాధనలో..2..
ఎర్రపూల సంద్రాలుగా నిలిచావు గుండెల్లో ...
"ఓ అమరవీరుడా.. విప్లవ యోధుడా"
ఎదురుచూసే పుల్లెమ్ల గ్రామమంతా నీకోసం.
ఓసారి వచ్చిపొమ్మని నీ ఇల్లు తలుపు తెరిచే..2..
ఆదివాసి గొంతుక ...
పేద ప్రజల జీవిక....
పారె నెత్తుటేరులు..స్వార్ధపు రక్కసి మూకలు
మనుషుల ప్రాణాలు తీసి విర్రవగే రాజ్యంలో..2..
మానవత్వమైనీవు మనసుల్లో నిలిచావు
"ఓ అమరవీరుడా.. విప్లవ యోధుడా"
సంపద ఎవరి సోత్తు కాదనీ చాటినారు...
అన్యాయాన్నెదిరించే అగ్గి రవ్వలు మీరు...2...
ఆ విప్లవ జ్వాలలు....
ఆ నిప్పుల వాగులు....
ని చెల్లి చెమ్మగిల్లే..నీ తల్లి కలత చెందె...
ఒరిగినావా నేలనా..రక్షించే అడవి బాటలో..2..
అమరుడైనావా భూతల్లి పచ్చనోడిలో....
"ఓ అమరవీరుడా .. విప్లవ యోధుడా"
ఉయికే గణేషు మా విప్లవ జోహార్లు...
అందుకో నీవు అరుణ అరుణ జోహార్లు..
- బొడ్డుపల్లి గౌతమి




