కేర‌ళ రాజ‌కీయ ఖైదీ రూపేష్ జైలులో రాసిన “ఖైదీల జ్ఞాపకాలు” అనే నవల ప్రచురణ అనుమతి కోసం విజ్ఞప్తి చేసి దాదాపు ఒక సంవత్సరం అవుతోంది. భావ ప్రకటనా స్వేచ్ఛకు మద్దతిస్తున్నట్లు నటిస్తున్న వామపక్ష ప్రభుత్వం ఈ ప్రచురణ దరఖాస్తుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

 సచ్చిదానందన్ వంటి ప్రముఖ రచయితలు ఈ నవలను చదివి, దీని ప్రచురణను నిరాకరించడానికి ఏమీ లేదని స్పష్టం చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల పరిశీలనలో కూడా, చట్టపరంగా అనుమతిని నిరాకరించడానికి ఎలాంటి కారణం దొరకలేదు. అయినప్పటికీ, ఈ నవల ఒక రాజకీయ ఖైదీ రాసినది కావడంతో, దీని ప్రచురణ వెలుగులోకి రాలేదు.

నిరవధిక నిరాహార దీక్షతో సహా పలు సమ్మెలలో రూపేశ్ పాల్గొన్నప్పటికీ, అనుమతి విషయమై త్వరగా నిర్ణయం తీసుకుంటామని తప్పుడు వాగ్దానాలు చేస్తూ అతన్ని మోసం చేస్తున్నారు.

రూపేష్ దీనికి వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించినప్పటికీ, ఉపా (చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం) ఖైదీ రాసిన నవల కాబట్టి, అందులో ఉపా చట్ట పరిమితుల్లో నేరం ఏమైనా ఉందో లేదో పరిశీలించడానికి ప్రభుత్వం మళ్లీ సమయం కావాలన్నది. ఒక ప్రసిద్ధ రచయిత తన రచనల విషయం కారణంగా ఉపా కింద నిందితుడిగా ఉన్న రూపేష్ నవలలోని కథాంశానికి, ఈ వాస్తవ సంఘటన అద్భుతంగా పోలి ఉంది.

ఈ నవలలో చట్టవిరుద్ధమైనది, వ్యక్తిగత హత్యకు పాల్పడేది లేదా దేశ వ్యతిరేకమైనది ఏమీ లేదని జైలు శాఖ అంగీకరించినప్పటికీ, జైలు గురించి ప్రస్తావించిన భాగాలలో ప్రతి విషయాన్ని సరిదిద్దాలనే పిల్లచేష్టల అభ్యంతరాన్ని లేవనెత్తింది. సామాజిక విమర్శ చేసినందుకు విషయాలను కత్తిరించాలని (సెన్సార్) ప్రభుత్వ శాఖ చేసిన ఈ డిమాండ్ తీవ్రంగా ప్రజాస్వామ్య వ్యతిరేకమైనది.

ఖైదీ యొక్క భావ ప్రకటనా స్వేచ్ఛకు హాని కలిగించే అధికారం ప్రభుత్వానికి లేదని కోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించి, ఈ నవల ప్రచురణకు ప్రభుత్వం వెంటనే అనుమతి ఇవ్వాలి.

ఈ డిమాండ్‌ను లేవనెత్తుతూ వివిధ రచయితలు, సామాజిక కార్యకర్తలు సంతకం చేసిన ఉమ్మడి ప్రకటన ఇలా ఉన్నది. మీరు కూడా దీనిపై సంతకం చేయడం ద్వారా ఈ ప్రచారంలో భాగస్వాములు కండి.

రూపేష్ నవల ప్రచురణలో ప్రభుత్వ ఆలస్యంపై నిరసన:

ఉపా ఆరోపణపై దాదాపు 11 సంవత్సరాలుగా జైలులో ఉన్న రూపేష్ రాసిన “ఖైదీల జ్ఞాపకాలు” అనే నవల ప్రచురణ అనుమతి కోసం జైలు అధికారులకు దరఖాస్తు ఇచ్చారు. 2025 జనవరి 17నాడు ఇచ్చిన నవలను నిపుణుల పరిశీలన తర్వాత పూజప్పుర జైలు ప్రధాన కార్యాలయం నుండి హోమ్ శాఖకు, ఆ తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుండి తిరిగి పరిశీలన కోసం హోమ్ శాఖకు, అక్కడి నుండి మరింత పరిశీలన కోసం న్యాయ శాఖకు, మళ్లీ హోమ్ శాఖకు తిరిగి వచ్చి, దాదాపు అన్ని విశ్లేషణలు పూర్తయిన తర్వాత 2025 జూలైలో అనుమతి కోసం ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళింది.

ఈ నవల ప్రచురణ అనుమతిలో ప్రభుత్వం చేస్తున్న ఆలస్యాన్ని నిరసిస్తూ కేరళలోని దాదాపు అన్ని సాహిత్య, సాంస్కృతిక కార్యకర్తలు, రాజకీయవేత్తలు బహిరంగంగా ముందుకు వచ్చి, నవలను తక్షణమే ప్రచురించడానికి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.

ప్రచురణ అనుమతిలో జరుగుతున్న సహేతుకం కాని ఆలస్యాన్ని నిరసిస్తూ రూపేష్ మే 22న జైలులో నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. దీక్ష తొమ్మిదో రోజున, త్రిస్సూర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌కు తరలించి, వారం రోజుల్లో సంబంధిత ప్రక్రియలను పూర్తి చేస్తామని హామీ ఇవ్వడంతో రూపేష్ నిరాహార దీక్షను విరమించారు.

సాహిత్య అకాడమీ డిమాండ్: ఈ నవలను చదివిన సాహిత్య అకాడమీ ఛైర్మన్ సచ్చిదానందన్, వైస్ ఛైర్మన్ అశోకన్ చెరువిల్ నవల ప్రచురణ కోసం బహిరంగంగా డిమాండ్ చేశారు. అయినప్పటికీ, ప్రభుత్వం అనుమతినివ్వడానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు.

ఆ తరువాత, రూపేష్ కేరళ హైకోర్టులో సీనియర్ న్యాయవాది కాలేశ్వరం రాజ్ ద్వారా పిటిషన్ దాఖలు చేశారు.

ఉపా ఖైదీ రాసిన ఈ పుస్తకంలో ఉపా నేరాల పరిమితుల్లోకి వచ్చే అంశాలు ఏమైనా ఉన్నాయో లేదో తనిఖీ చేయడానికి ప్రభుత్వం మూడు నెలల సమయం అడగగా, కోర్టు దానికి అనుమతించింది.

అయితే, అత్యున్నత విభాగ స్థాయిలో పరిశీలనలు, కేరళలోని అత్యంత సీనియర్ రచయితలు డిమాండ్ చేసిన తర్వాత కూడా, మళ్లీ పరిశీలన కోసం సమయం కోరడం అనేది అనుమతి ఇవ్వకుండా ఉండటానికి ఉద్దేశపూర్వకంగా చేసిన ఆలస్యమే తప్ప మరొకటి కాదు. ఉపా కు వ్యతిరేకంగా ఉన్నామని చెప్పుకునే వామపక్ష ప్రభుత్వం, ఉపాకు వ్యతిరేకంగా ఉన్న రూపేష్ రాసిన నవలలోని అంశాలు ఉపా నేరం అవుతుందేమోనని తనిఖీ చేయడం ఒక వైచిత్రం.

నిజానికి, రూపేష్ రాసిన నవల యొక్క కథాంశం కూడా ఇదే. ఒక రాజకీయ కవి కవిత్వంలో ఉపా కింద నిందలు వేసి జైలులో పెట్టే భావజాలం, ప్రభుత్వ చర్య ద్వారా ఇప్పుడు వాస్తవంగా మారుతోంది.

పినరయి విజయన్ నేతృత్వంలోని ప్రభుత్వం నిరంకుశ దేశాలను గుర్తుచేసే విధంగా అనుమతి నిరాకరించడం, సెన్సార్షిప్ విధించడం ద్వారా రాజ్యాంగం, సుప్రీంకోర్టులు ఖైదీలకు హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులను తిరస్కరించడాన్ని ఖండించాలి.

దీనిని దృష్టిలో ఉంచుకుని, రూపేష్ నవల ప్రచురణ అనుమతిని ప్రభుత్వం మరో రోజు కూడా ఆలస్యం చేయవద్దని సచ్చిదానందన్, కెజిఎస్, జె. దేవిక, పి కె పొక్కర్ మొదలైనవారు కోరుతున్నారు.

Leave a Reply