జీవిత అనుభవాల కేరాఫ్ బావర్చి
కథ రాయడం ఒక కళ, కానీ అందరికి సులభం కాదు. ప్రతి మనిషి రాయగలడు, కానీ ఆ కథలు పాఠకుడి హృదయానికి తాకేలా, వారి జీవిత అనుభవాలతో అనుసంధానం అయ్యేలా రాయడం కష్టమే. రాయడం అంటే ఆలోచించే, భావించే మనసు ఉండాలి. చరణ్ పరిమి గారి కథలు ఈ విషయంలో ప్రత్యేకంగా నిలిచాయి. ఆయన కథలలోని ప్రతి సంఘటన, ప్రతి మాట పాఠకుడి హృదయానికి చేరి, జీవిత అనుభూతులను పంచేలా ఉంటాయి. కాలింగ్ సప్తవర్ణం - కథలో మనసును పునరుజ్జీవనంగా చూపించారు. ప్రతి రోజు కొత్తగా ప్రేమించడం, జీవితం పట్ల ఆశ కలిగి ఉండడం ప్రధాన అంశాలు. 40