కరపత్రాలు

విర‌సం 30వ  మహాసభలు – భావజాల, సాంస్కృతిక  రంగాల్లో వర్గపోరాటం

2026 జనవరి 24-25, సుందరయ్య విజ్ఞానకేంద్రం,"బాగ్‍లింగంపల్లి, హైదరాబాద్‍. నక్సల్బరీ ఉద్యమం భారతదేశ ప్రజా రాజకీయాల్లోకి వర్గపోరాటాన్ని తీసుకొచ్చింది. వర్గపోరాట అత్యున్నత రూపంగా దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంథాను పీడిత వర్గానికి అందించింది. ఒక సమగ్ర పోరాట మార్గంగా ప్రజా జీవితంలో ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతోంది. నక్సల్బరీ ప్రజ్వలనలో పుట్టిన విప్లవ రచయితల సంఘం భావజాల, సాంస్కృతిక  రంగాల్లో వర్గపోరాట రాజకీయాలను ఆచరిస్తోంది. తన సృజనాత్మక రచనతో, విశ్లేషణతో ముందుకు తీసుకపోతోంది.  వర్గపోరాటం ఒక చారిత్రక నియమమే అయినా, అది  నిర్దిష్ట స్థల కాల రూపాల్లో కొనసాగుతుంది. తక్షణ, దీర్ఘకాల సామాజిక పరిణామాలను వ్యక్తులు గ్రహించలేకపోయినా మానవ సమాజం వర్గపోరాటం మీదే
కొత్త పుస్తకం

అనేక అసహనాల మధ్య అధిగమించాల్సిన దూరాలు

(ఇటీవ‌ల విడుద‌లైన డా. గీతాంజలి ‘అత్తరు మునక’ కథా సంపుటికి రాసిన ముందుమాట)  ‘మన భావాలు వాడి పారేసినవి.  మన ప్రేమ ముందే అనుకుని నిర్మించుకున్నది.  మన నమ్మకాలు రంగులు అద్దినవి.  మన స్వాభావికత కృత్రిమ కళతో మాత్రమే కొలవగలిగినది.  గాయపడకుండా నిజంగా ప్రేమించడం చాలా కష్టం అయ్యింది.’ (రోహిత్ వేముల చివరి వుత్తరం నుంచి) గీతాంజలి కథలు చదువుతుంటే నాకెందుకో రోహిత్ వేముల చివరి మాటలు గుర్తొచ్చాయి. గాయపడకుండా ప్రేమించడం కష్టమన్న పోలిక స్ఫురించింది. గాయపడకుండా ప్రేమించడమే కాదు; రచించడం కూడా కష్టమేనేమో!  కాలం గాయాల్ని మాన్పుతుంది అంటారు; కానీ పాత గాయాలు మానకుండానే కాలమే కొత్త
నివేదిక

పౌరహక్కుల నాయకత్వంపై రాజ్యం దాడి

“దేవున్ని నమ్మే గుంపులో ఏ నిర్ణయం ప్రవేశ పెట్టాలన్న దేవుని పై పదే పదే విశ్వాసం ప్రకటించాల్సి వుంటుంది  - బాలగోపాల్” సరిగ్గా బాలగోపాల్ చెప్పినట్టు, ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం కూడా చివరకు హిందూ ఫాసిస్ట్ పాలనకు వ్యతిరేకంగా తయారు చేసిన “ఫ్లెక్సీ పొరపాటున ప్రింట్ అయింది” అని మీడియా ముందు స్పష్టం చేసి, పౌరహక్కుల సంఘం (ఆంధ్రప్రదేశ్) కమిటి 20 వ మహాసభను ప్రారంభించాల్సి వచ్చింది.  తిరుపతిలో పౌర హక్కుల సంఘం 20వ రాష్ట్ర మహాసభల సందర్భంగా ఏర్పడిన బ్యానర్ వివాదం పెద్ద రాజకీయ–సామాజిక, సాంస్కృతిక చర్చకు దారితీసింది. ఈ ఘటనలో పౌర హక్కుల సంఘం
సంపాదకీయం

ప్రతీకలు కూడా దేశద్రోహమట! పౌరహక్కుల సంఘంపై అక్రమ కేసు

భాషకంటే ప్రతీకలు ప్రాచీనమైనవి. మనుషులు తమ వ్యక్తీకరణకు సంకేతాలను, ప్రతీకలనే మొదట సాధనం చేసుకున్నారు. ప్రకృతి పరిశీలనలో కలిగిన భావోద్వేగాలను, భయోద్విగతలను కొండ గుహల్లో బొమ్మలు గీచినట్లు ఆధారాలు ఉన్నాయి. అసలు మానవ ఊహ తొలి వ్యక్తీకరణలు నిర్దిష్ట భాషార్థం సంతరించుకోకముందు గీతల్లో, చిత్రాల్లో ఉన్నట్లు చూడవచ్చు. ఆ తర్వాత తమ సామాజిక   నిరసనలను, కోపాలను, విజయాలను కూడా ప్రతీకాత్మం చేశారు. మానవ నాగరికతా వికాసంలో ఊహా వ్యక్తీకరణలకు ఇంత పురాతన సంప్రదాయం ఉన్నది. చివరికి భగవంతుడ్ని కూడా అప్పటి దాకా ఏ ఏ విశేషణాలతో, ప్రతీకలతో గౌరవించారో వాటినే తిరగేసి ఆగ్రహావేశాలతో నిందా స్తుతి చేశారు. రాజులకు
వ్యాసాలు

వి. ప్రతిమ, సుంకర గోపాలయ్య , పల్లిపట్టు నాగరాజు

పుస్తకాలను చదవకుండా పుస్తకాలను  తాకకుండా చాలామందికి ఒక్కరోజు కూడా గడవదు. పగలంతా పనులతో బాధ్యతలతో అటు ఇటు తిరుగుతూ గడిపేసినా, ఎంత రాత్రయినా సరే, కొన్ని పేజీలైనా చదవటం, ఉదయం నిద్ర లేవగానే ముందుగా ఎంపిక చేసుకుని వెతికి పెట్టుకున్న పుస్తకాన్ని చదవటం కొందరికి అలవాటు. ఈ ప్రపంచంలో పుస్తకాలు చదవడానికి నిర్ణీత సమయం అంటూ లేదు. ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాగైనా పుస్తకాలు చదవడానికి అలవాటు పడిన వాళ్లే. చాలామందికి పుస్తకాలను దాచి పెట్టుకోవడం అలవాటు. కానీ చాలా కొంతమంది మాత్రమే తాము చదివిన తర్వాత పుస్తకాలను ఇతరులకు చదవడానికి ఇచ్చేస్తారు. చదివిన తర్వాత వాళ్లు కూడా
వ్యాసాలు

ప్రజా ఉద్యమాలు – రాజ్యాధికార ప్రాసంగికత

"సేవ్ ఆరావళి" ఉద్యమం ఉత్తర భారత దేశంలో పెద్ద ఎత్తున జరిగి లక్షలాదిమంది ప్రజలు పాల్గొని, ఆ ఉద్యమం తాకిడికి కేంద్ర ప్రభుత్వం మరియు సుప్రీంకోర్టు కూడా దిగి వచ్చిన తర్వాత సామాజిక మాధ్యమాలలో సాయుధ పోరాటయేతర ఉద్యమాల పట్ల విపరీతమైన చర్చ జరుగుతుంది. ఈ సందర్భంగా గతంలో ఢిల్లీలో జరిగిన రైతు ఉద్యమం విజయాల పట్ల కూడా ప్రస్తావనలు చేయడం జరుగుతుంది. ఈ రకమైన చర్చల యొక్క ప్రధాన ఉద్దేశం ఏమంటే, "భారతదేశంలో సాయుధ పోరాటాలు యొక్క ప్రాసంగికత ఏమిటన్న అంశం ప్రధానంగా చర్చనీయాంశం అయింది." అయితే ఇక్కడ సేవ్ ఆరావళి, ఢిల్లీ రైతు ఉద్యమం అన్నవి
కథనం

ఎర్ర మల్లెలు

మకాం ఖాళీ చేసి వెళ్తున్నపుడు ముందు టీములో బి.జి.ఎల్స్ తక్కువున్నాయని ఆ టీములోకి కా. సునీతను పంపించాడు కా. సురేష్ దాదా. కొంచెం ముందుకెళ్ళాక గుట్కా వాసన వచ్చింది. అది డిప్యూటీ కమాండర్ అర్జున్ కు చెప్పిన వెంటనే పోలీసులు కనిపించారు. 'ష్...ష్...'కమాండర్ కా. నందు. 'మాట్లాడకండి' హెడ్ క్వార్టర్ ఎ సెక్షన్ నుండి జమిలి. వెనుక వస్తొన్న వారితో. రెండడుగులు ముందుకేయగానే కవర్ లోకి దూకారు కా. నందు, పూలోలు. ట్రిగ్గర్ నొక్కాడు నందు. 'ఢాం...' అంటూ పేలింది. ఒకడు పడ్డాడు. షెల్ వేసింది పూలో. దద్దరిల్లింది. వెనక్కి ఉరికారు పోలీసులు. నందు, అర్జన్, పూలో, జుగిని,
కవిత్వం

జ్ఞాపకాన్ని పదిలంగా దాచుకుంటా

సాగిపోతున్న కాలంలో రాలిపోతున్న పువ్వులెన్నోబతికినంత కాలం సువాసనలు వెదజల్లాలని ఎంత పరితపించేనోఅందుకే నేలను తాకుతుంటే దుఃఖం ఆగట్లేదుఎర్రని మోదుగుపూలంటేనే ఎందుకిష్టమని ఎవరైనా అడిగితే సమాధానం ఒక్క మాటతో ఆగదు ప్రవాహమై సాగుతూ అమరత్వం దగ్గర ఆగుతుందిచీకటి అలుముకున్న ఈ అడవిలో ఎంతోకొంత కాంతినిచ్చేదిఆ మోదుగుపూలేనాలాంటి బాటసారికి దప్పిక తీర్చేవి కూడా అవేఅందుకే కాసింత ఎక్కువ ప్రేమ నరికివేతలో ఒక్కో పువ్వు నేల రాలగానే చాటుంగానైన ఏరి తెచ్చుకుంటాఆ పరిమళపు జ్ఞాపకాన్నిపదిలంగా దాచుకుంటా.
కథలు

బలహీనులు?

అప్పటికే నడవబట్టి మూడు గంటలవుతోంది. అందులో గుట్టలు ఎక్కడం. శరీరమంతా పులిసి పోయినట్టుగా ఉన్నది. విపరీతమైన చెమటలు. పిక్కలన్ని గట్టిగ అయిపోయి గుట్ట దిగడం ఇంకా కష్టంగా ఉంది. సాధారణంగా దిగడం సులువు అనుకుంటారు కానీ దిగడమే చాలా కష్టం. అదీ గుట్ట ఎక్కిన వెంటనే మళ్లీ కిందకు దిగడమంటే ఇంకా కష్టం. బరువంతా మోకాళ్ల మీదనే పడ్తది. మరీ క్రాస్‌గా దిగాల్సి వస్తె, కాళ్లు వణుకుతుంటాయి. అసలు కాళ్లకు బలమే లేనట్టు ఎక్కడ పడిపోతామో అనిపిస్తది. ఇప్పుడేందో పిక్కలు పట్టేసినట్టు ఉన్నాయి. నరాలు దగ్గరికి గుంజుకపోతున్నట్టు అనిపిస్తోంది. ‘‘ఇంకా ఎంత దూరం రాజ్‌మన్‌’’ అడిగింది రీతు. నిజానికి
ఆర్థికం

సంక్షుభిత‌ ఆర్థిక వ్యవస్థ – సమస్యల వలయంలో ప్రజలు

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో భారతదేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. కనివిని ఎరుగని స్థాయిలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలు ఆర్థిక వ్యవస్థకు తలనొప్పిగా మారాయి. శ్రమదోపిడీ, వనరుల దోపిడీ, లాభాపేక్ష అనేవి అసమానతల పెరుగుదలకు కారణంగా చెప్పవచ్చు. భారత ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుత సంక్షోభం అనేది ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం, పేదరికం, అసమానతలు, తయారీ రంగంలో క్షీణత వంటి అంశాలతో ముడిపడి ఉంది.  దాని ప్రభావం అన్ని వర్గాలపై పడుతున్నది. ఎందుకంటే, ఇవాళ దేశం ఎదుర్కొంటున్న సమస్యలను విడివిడిగా చూడలేని పరిస్థితి. రైతుల బాధలు, కార్మికుల అభద్రత, నిరుద్యోగ సమస్య, పౌష్టికాహార కొరత,