తొలికెరటాలు

ధిక్కార పతాకమై ఎగిరే నీలం రంగు నది

నల్లింకు పెన్నుతో పరిచయమైన రచయిత హథీరామ్ సభావట్, తనలోని ఎన్నో ఆవేదనలను అక్షరీకరించి, మళ్ళీ తన బలమైన గొంతును వినిపించేందుకు ధిక్కార పతాకమై ఎగిరే "నీలం రంగు నది"ని మన ముందుకు తెచ్చారు. ఇందులోని ప్రతీ కవిత దేనికదే ప్రత్యేకం. ఆదివాసీ గూడాల గుండెలలో రగులుతున్న ఆవేదనను... పాలస్తీనా, సూడాన్ వంటి ప్రపంచ దేశాలలో జరుగుతున్న మానవ హననాన్ని... ప్రకృతిని దోచుకుంటున్న రాజ్యపు అహంకారాన్ని.... మనుగడ కాన్వాస్ పై రక్తపు మరకలతో యుద్ధం చిత్రించిన దృశ్యాలను... ఎన్నింటినో రచయిత తన కవిత్వంతో మన కళ్ళ ముందుంచారు. నది అనగానే మనకు గుర్తొచ్చేది పచ్చని ప్రకృతి. ఆ ప్రకృతితో మమేకమై
కవిత్వం

నిన్ను ఇంకా  “మమ్మా” అనాల్నా

ప్రజలు చనిపోతుంటే ఇక విజేతలెవరు ఏ అబద్ధమూ బుల్లెట్ గాయాల్ని దాచలేదు బుల్లెట్లతో జల్లెడైన శరీరాలే సత్యానికి నిష్ఠుర సాక్షాలుమా జీవితాలు కుప్పకూలిపోతుంటేఎవరూ విజేతలు కాలేరుప్రజలకు ఊపిరాడనిచోటమమ్మానీకు సింహాసనం వారసత్వం గావొచ్చుగానిమాకది గుండెలో ముల్లు.నీ బిడ్డలుశవాలకుప్పలవుతుంటే నిన్ను ఇంకా మమ్మా అని పిలువ మంటావానువ్వు గెలవలేదు నీకు నువ్వే ఎన్నికైనావు నిన్ను నువ్వు నిలబెట్టుకున్నావు దారి పొడుగునా నీ ఫ్లెక్సీ లకునిన్నెవరు బాధ్యుల్ని చేస్తారో తెలియదు నువ్వు గెలవలేదు ప్రజల్ని కోల్పోయావు ఆఫ్రికాని కోల్పోయావు మొత్తం ప్రపంచాన్నే కోల్పోయావు నువ్వు ఏమిటో మాకు స్పష్టం స్వార్థం, అహం ప్రజల్ని పాదాక్రాంతులు చేసుకొనే నీ నియంతృత్వం మాకు స్పష్టం .డైమండ్
కథలు

మిరాకిల్

తిరుపతి ఎండలు ఎట్ట ఉంటాయో తెలుసు కదా? నెత్తి మీద గుడ్డు పెడితే ఆమ్లెట్ అయిపోద్ది. ఆ ఎండలో, మనోజ్ గాడు ఆర్టీసీ బస్టాండ్ దగ్గర టీ కొట్టు కాడ నిలబడున్నాడు. వాడి జేబులో చిల్లిగవ్వ లేదు. అకౌంట్లో చూస్తే రూ. 2700 కూడా లేవు. ఇంటి ఓనర్ ఏమో పొద్దున్నే వచ్చి, "అద్దె కడతావా, సామాన్లు బయట ఇసిరేయమంటావా?" అని దబాయించి పోయినాడు. మనోజ్ రూమ్లో పాత బీరువా  మీద ఒక చీటీ అంటించున్నాడు. దాని మీద "బతుకుతావా? లేక అడుక్కుతింటావా?" అని రాసుంది. ఇదంతా ఎవరి పుణ్యం అంటే... మన ‘శ్రీకాంత్ మాస్టర్’ది. ఈ శ్రీకాంత్
కవిత్వం

ఇది దుఃఖాన్ని మిగిల్చే కాలం

ఇది కార్పొరేట్, ప్రభత్వాల కలయికలోరాజ్యం కృత్రిమ శిశిరపు కాలానికి పురుడోసింది ఇది కాగర్ శిశిరపు కాలంఇప్పుడు అడవిలో యే ఆకు తనకు తానుగా చెట్టుని విడవడం లేదు యే చెట్టు తనకు తానుగా ఆకుల్ని విడవడం లేదుకొన్నిరాజ్యపు మాయ మాటలకూ లోబడుతున్నాయి కొన్ని బందీ అవుతున్నాయి కొన్ని నేల రాలినెత్తుటితో మట్టిలో కలిసిపోతున్నాయి మరి కొన్ని కాల్చి బూడిదవుతున్నాయి ఇంకా కొన్ని మాత్రం రాజ్యానితో చేతులు కలిపిద్రోహనికి మంచి ముసుగేసినేలరాలి బూడిదయ్యే వాటిని చూస్తూ చెట్ల శివారున వున్న లేలేత ఆకులని సైతంనేల రాల్చేలా చూస్తున్నాయి ప్రస్తుతం రాజ్యం కలల్ని బంధించిందిఇప్పుడు నడుస్తుంది కాగర్ శిశిరపు కాలంఇది దుఃఖాన్ని
మీరీ పుస్తకం చదివారా ?

కత్తుల వంతెనపై సమాజం

నిజమే వర్తమాన సమాజం నిలుచున్నదిక్కడే. అసమానతలు అన్యాయాలు రాజకీయ రాబందుల రాక్షస క్రీడలు నెత్తుటి మరకలు  సమాజ దేహానికి కొత్తేం కాదు. ఈ కవిత్వాన్ని ఇష్టంగా ప్రేమగానో రాయలేదు. కవిత వాక్యాలను కన్నీటి సరస్సులో ముంచి మరీ రాశారు. ఈ ప్రపంచం పట్ల బాధ్యతగా రాశారు. కవిత్వ మనోఫలకంపై ఏర్పడే కవితా వాక్యాల ప్రతిబింబాలు పాఠకున్ని ఆలోచింపజేస్తాయి. రాయలసీమలోని అనంతపురం జిల్లాకు చెందిన కవి చం ఆధునిక తెలుగు కవిత్వంలో అరుదైన కవి. అంతే ప్రాపంచిక దృక్పథంతో సమాజాన్ని వీక్షిస్తున్న కవి. వర్తమాన సమాజంలో సంక్లిష్టంగాను తీవ్రమైన  వైరుధ్యాలతో మన ముందు పరచుకొని వుంది. ఈ సంక్లిష్టతను అధిగమించేందుకు