పుస్తకాలను నిషేధించి చరిత్రను రద్దు చేయలేరు సాహిత్యంపై కశ్మీర్ ప్రభుత్వ నిరంకుశ దాడిని ఖండించండి
కశ్మీర్ ప్రభుత్వం 25 పుస్తకాలను నిషేధిస్తూ ఆగస్టు 5 నాడు జారీ చేసిన ఉత్తర్వు కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలకు పరాకాష్ట. మన దేశంలో పుస్తకాలను నిషేధించడం కొత్త కాదు. ఈ విషయంలో బ్రిటీష్ పాలకుల వారసత్వాన్ని మన ప్రభుత్వం నిస్సిగ్గుగా స్వీకరించింది. అయితే ఒకేసారి 25 పుస్తకాల జాబితా ఇచ్చి, వీటిని నిషేధిస్తున్నామని, ఆ కాపీలు ఎక్కడున్నా జప్తు చేస్తామని ప్రకటించడం చరిత్రలో ఎన్నడూ చూడని విపరీత పోకడ. ఈ జాబితాలో కశ్మీర్ చరిత్రకు సంబంధించిన ప్రామాణిక పరిశోధనలు ఉన్నాయి. ఏండ్ల తరబడి అధ్యయనం చేసి, ఎన్నో డాక్యుమెంట్లను ఆధారం చేసుకుని చేసిన రచనలున్నాయి. ఎ జి