కవిత్వమే సూక్ష్మదర్శిని, దూరదర్శిని
-మెట్టు రవీందర్ మనుషులు విడిపోవడం కంటే మించిన విషాదం లేదు మనుషులు కలవడం కంటే మించిన ఆనందమూ లేదు అరసవిల్లి కృష్ణ రాసిన ‘ఈ వేళప్పుడు’ కవిత్వం కవి రాసినప్పటి క్షణానికి మాత్రమే సంబంధించినదేనా? కానేకాదు. అలా ఏ కవిత్వమైనా అది రాయబడిన క్షణానికే సంబంధించినదయితే, అది పుస్తక పుటల మధ్యనే నలిగిపోయి నశిస్తుంది. కానీ ‘ఈ వేళప్పుడు’ కవిత్వం ఒక సజీవమైన కవిత్వం. అది జీవజలం వలె పుస్తక పుటల్ని దాటి పాఠకుల హృదయాల్లోకి అలవోకగా ప్రవహిస్తుంది. అలా ప్రవహించే కవిత్వమే జీవిస్తుంది, జీవింపజేస్తుంది. ఇందులో కవి చూసిన చూపులో చాలా విశిష్టత ఉంది.