అక్షరాలు తిరగబడాలి
నేనెప్పుడూ కవిత్వం రాయనుకాగితం మీద మంటలతో మండిస్తానుప్రతి పదం డైనమేటై ఎముకలు విరిగినకవుల ముఖాల మీద పేలుతుందిచైతన్యంతో రగలాలనీలేకుంటే మౌనంగా కుళ్ళి చావాలనీనాకవిత్వం ప్రకటిస్తుందిదుమ్ము కొట్టుకుపోయిన బాలుడుశూన్యపు కళ్ళతో చూస్తుంటే అతని ఆకలిని నా అక్షరాల్లో ప్రకటిస్తానుయుద్ధం క్లాస్ రూమ్ ను మింగేస్తేనా పెన్నును ప్రతిఘటనతో చెక్కుతాను నువ్వు రాస్తావానీ అక్షరాలు ప్రతిఘటనను పదునెక్కిస్తాయాలేక పగిలిన పింగాళీ కప్పులోసారహీనమైన ఉపమానాల్ని చప్పరిస్తావాపాలస్తీనియులు రక్తమోడినప్పుడురోహింగ్యాలకు ఊపిరాడనప్పుడుఆఫ్రికా అమ్మాయిలు గుక్కెడు నీళ్ళ కోసంశీలాన్ని ఫణంగా పెట్టినప్పుడునువ్వు నదుల మీదాగులాబీ పువ్వుల మీదాకవిత్వం రాస్తావాప్రాణం లేనిది, ప్రేమలేనిది ఇదే నా కవిత్వం కవీ.. మౌనంగా ఉండిపోతే నువ్వు కవివి కావు..ప్రజాద్రోహి వి"కవిత్వంలో రాజకీయాలు










