ఆక్స్ఫామ్: ప్రజల్ని దోచేసున్న గుత్త సంస్థలు
స్విట్జర్లాండ్లోని దావోస్లో జనవరి 20-25 తేదిలలో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్య్లూఇఎఫ్) 2025 వార్షిక సమావేశం తొలి రోజున (జనవరి 20) ఆక్స్ఫామ్ సంస్థ ‘టేకర్స్ నాట్ మేకర్స్’ పేరుతో ఆర్థిక అసమానతల నివేదికను విడుదల చేసింది. ఇందులో కీలక విషయాలు వెల్లడిరచింది. బిలియనీర్ల సంపద మునుపెన్నడు లేనంతగా పెరిగిపోయిందని, ప్రపంచవ్యాప్తంగా పేదరికంలో మగ్గుతున్న ప్రజలు అనేక సంక్షోభాలను ఎదుర్కొంటున్నారని నివేదిక నొక్కి చెప్పింది. రోజు రోజుకు ప్రపంచంలోని ధనిక, పేద ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. ఈ విషయం మరోసారి రుజువైంది. మానవజాతి చరిత్రలో ఇంతకుముందెన్నడూ ఎరగని అసమానతలపర్వం ఇప్పుడు సమాజాన్ని










