సంపద ఒక వైపు – ఆకలి మరో వైపు
ఒకవైపు కరోనా విపత్తు, మరోవైపు ఆర్థిక సంక్షోభం... కారణాలేమైనా దేశంలో సగటు జీవుల బతుకు ఆగమైంది. ఉపాధికి దూరమై, ఆదాయం లేక పస్తులుంటున్నారు. ఆకలి అనేది ప్రభుత్వాల దుష్టత్వానికి నిదర్శనం. ఆకలి సమస్యను పరిష్కరించే చర్యలకు పాలకులు పూనుకోకపోవడం విషాదం. ఆకలితోనో, పోషకాహార లోపంతోనో మరణించడానికి కారణం తగినన్ని ఆహారధాన్యాలు లేకపోవడం కాదు. ఏప్రిల్ 2021 నాటికి దేశంలో 564.22 లక్షల టన్నుల ఆహార నిల్వలున్నాయి. ఆకలితో ఉన్నవారికి ఆహార పదార్థాల్ని అందించలేని పాలకుల వైఫల్యం. సమాజ మనుగడకు విరామ మెరుగక పరిశ్రమిస్తూ మానవజాతి పురోగమనానికి దారులు వేస్తున్న ప్రజల ఆకలి చావు కేకలు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం