ఏసేబు ఒక్కడే కాదు.. వేలు , లక్షలు
జీవించి ఉండగానే మరణానంతర వైభవానికి కూడా అన్నీ సిద్ధం చేసుకొనే వాళ్లున్న చోట మరణించి జీవించడం మొదలు పెట్టేవాళ్లు దిగ్భ్రాంతికరంగా తయారవుతారు. అలాంటి వాళ్లను అంగీకరించడానికి మనసు సిద్ధం కాదు. అసలు వాళ్లున్నట్లు కూడా తెలియదనే రక్షణ వలయంలో సేదతీరుతాం. ఒకవేళ తెలిసి ఉంటే వాళ్లను మినహాయింపు అనుకుంటాం. తీసి పక్కన పెట్టేస్తాం. మన నిరాశలకు, నిట్టూర్పులకు, చరిత్రపట్ల పిల్ల చేష్టలకు తగిన దారికి ఇలాంటి వాళ్లు అడ్డం లేకుండా చూసుకుంటాం. సుఖమయ వాదనల విశాల రంగస్థలానికి ఈ ఏర్పాట్లు అవసరం మరి. వాదననలను ప్రతిసారీ సత్యాన్వేషణ కోసమే చేస్తామనే గ్యారెంటీ ఏమీ లేదు. ఆసత్యానికి ఆవలి అంచున