బస్తర్‍లో నిర్బంధ రూపాలు
(ఆదివాసీ హక్కుల సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో ఆగస్టు 9, 10తేదీల్లో హైదరాబాదులో జరిగిన ఆలిండియా సదస్సు ప్రసంగం) అందరికీ లాల్ జోహార్. ఈరోజు ఇంత మందిని చూసి నాలో కాస్త ఆశ కలిగింది. మనం ఎప్పుడూ బస్తర్ గురించే మాట్లాడుతుంటాం, అందరూ దాని గురించే చెబుతున్నారు కానీ ఇప్పటి వరకు పరిష్కారం లేదు. ఇదే అతి పెద్ద సమస్య. ఎంతకాలమని చనిపోతూ వుంటాం? ఇలా ఎంతకాలం జరుగుతుంది? ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి, దేశానికి వివరించాలి. పోరాటం ఎందుకోసం జరుగుతోంది? నక్సలిజం అనే ఒక పదాన్ని పదే పదే వాడుతున్నారు. ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్న పోరాటాల