అశాంత, అవిశ్రాంత విజయగాథ
ముందే నిర్ణయమైన పరిస్థితుల మధ్య, నియంత్రించలేని పరిణామాల మధ్య, మనుషులు సొంత వ్యక్తిత్వాల్ని ఎట్లా తీర్చిదిద్దుకోగలరు? జీవితగమనాన్ని తామే నిర్దేశించుకునే ఇచ్ఛను ఎట్లా నెరవేర్చుకోగలరు? విధింపులను కాదని ఎంపికలను సాధన చేయడం ఎట్లా? యథాస్థితికీ మార్పుకూ మధ్యనే కాదు, అనేక కొత్తదారుల మధ్య, అనేక మంచిదారుల మధ్య దిక్కుతోచని తనాన్ని అధిగమించడం సాధ్యమా? పై ప్రశ్నలను ఉదాహరణలతో సహా చర్చించుకుంటూ పోతే, అది శాంత జీవితం అవుతుంది. ఆమె ప్రయాణాన్ని దాని ముళ్ల దారుల నుంచి కాలిబాటల నుంచి సొంతంగా వేసుకున్నరహదారుల దాకా, ఆటుపోట్లు, జయాపజయాలు, రాజీలూ సర్దుబాట్ల తో సహా, బొమ్మకడితే అది ‘చుక్కపొడుపు’ నవల. శాంత










