సుబ్రమణ్యం కంట తడి
ఒకప్పుడు సుబ్రమణ్యం మా ఇంటికి రోజూ వచ్చేవాడు. ఎక్కువగా పొద్దున పూటే. ప్రత్యేకించి నాతో పనేమీ ఉండనక్కర్లేదు. అమ్మతో, జయతోనే పలకరింపు, అదీ ఎంత సేపు, అమ్మ ఇచ్చే కాఫీ తాగే వరకే. ఎప్పుడన్నా ఆలోగా బయల్దేరబోతే ‘సుబ్బూ కాఫీ తాగి వెళ్లూ..’ అని అమ్మ ఆపేది. అట్లని తను మాకు చుట్టమేం కాదు. నా మిత్రుడు అంతే. ఎప్పటి నుంచో చెప్పలేను. గుర్తు చేసుకోలేను. అంతటి గతం. ఆ మధ్య సొంత ఇల్లు కట్టుకొని మారిపోయాడు. అప్పట్లా రోజూ కాకపోయినా సుబ్రమణ్యం వస్తూనే ఉంటాడు. 1 రాత్రి పదిన్నరప్పుడు ఆఫీసులో ఎంత బిజీగా ఉంటానో. అలాంటప్పుడు సత్తార్










