కవిత్వం

నల్లని కత్తి

ఎందుకో?కార్పోరేట్లకుబహుళ జాతులకుశూలల సూపులకునల్ల కలువలే నచ్చుతయి వాళ్ళు ఏం మేలు చేయాలనుకొన్నా ?తోలునే తొలకరిని చేస్తరునల్లని ముఖం మీదతెల్లని మల్లెలు ఆరబోసినట్టునింగి మంగుళం మీదమక్క పాలాలు ఏంచినట్టువాళ్ళ నవ్వుల పువ్వుల కోసమేపూనికతోని దీక్ష పట్టినట్టుఇది ప్రపంచ పెద్దలుపేదరికం మీద విసిరినపరిహాసపుటస్త్రం అనిపరిపరి విధాల పరితపించినాకాలే కడుపు సాలు దున్నదనీమాడే ఎండ నీడ కోరుతదనీమర్మం తెలిసిన వారికిమనసున పట్టింది.నూకలు పెడతా మేకలు కాస్తావా?అన్నడొకడువివక్షల విలువల ధర్మానికివిలుకాన్నై కావలుంటానన్నడింకొకడు.నోరును అదుపులో వెట్టుకొనిపోరును పొరక పొరక చేసివిలాసాల వినువీధుల్లోకులాసాల కుటిల నీతుల్లోకుర్చీలు ఎక్కినంకకుత్తుకలను కోసేకత్తులైతరుకోరుకున్న కుదురుకుంగుతుందంటేనోటికి పడ్డ తాళాలు ఊడితైతక్కలాడుతయిఏరి ఏరి కొన్ని అన్యాయాల మీదనేకోరి కోరి ఆయుధాలు ఎక్కుపెడుతరుఅవసరం తీరినంక ఆయుధాలు
కవిత్వం

ఎటు చెందిన వాడిని

ఊరుకి చెందిన వాడినాతల్లివేర్లు తెంపుకు వచ్చిన వాడినాఊరు వదిలి వేరైపోయిన వాడినానిలువునా నీరైపోయిన వాడినాఅయినోళ్ళకి చెందిన వాడినాపలునోళ్ళకు జంకిన వాడినాఎవరిని ?నేను ఎవరికి చెందిన వాడిని ?చేతులు రెండూచాచిన వాడిని కదా..చూపంతా వచ్చిన దారిన పరచిన వాడిని కదా..నివశించే నేలకితలని తాటించేవాడిని కదా..ఎక్కడైనా ఒక బొట్టు ప్రేమ కోసంభిక్ష పట్టినవాడిని కదా..భుజాన బరువుతోబతుకు భ్రమణ గీతం పాడేవాడిని కదా..మరి, నేను ఎవరిని ?సూరీడికి చెందిన వాడినాచుర్రుమనే ఎండకు చెందిన వాడినాచంద్రునికి చెందిన వాడినాచల్లని వెన్నెలకు చెందిన వాడినాకడలికి చెందిన వాడినావిరిగి లేచే కెరటానికి చెందిన వాడినాఅడివికి చెందిన వాడినాగాయానికి పూసే ఆకు పసరుకి చెందిన వాడినానగరానికి చెందిన వాడినానగుబాటుకు
కవిత్వం

కులం కండువా…

జేబులో ఉన్న పది రూపాయలతోఇద్దరం అయిదు రూపాయల బువ్వ లొట్టలేసుకు తిన్నోళ్ళంసాయంత్రం అయితే ఛాయి నీళ్లు తాగుతూసమాజాన్ని విశ్లేషించినోళ్లం ధర్నాల దగ్గర ఒక్కటిగా హక్కులను నినదించినోళ్ళంనాలుగు గోడల మధ్య విప్లవ నిర్మాణాన్ని చర్చినోళ్ళం సభలలో సమావేశాల్లో ఒక్కటే విషయాన్ని మాట్లాడినోళ్ళంఎక్కడికి వెళ్ళినా ఒక్కటిగానే తిరిగినోళ్ళం కానీ మా ఊరు అంబేద్కర్ బొమ్మ దగ్గర ఆటో దిగి గానేవాడు ఒక వాడ కి నేను ఒక వాడకి పోవాలిబోనాల పండుగోస్తే వాళ్ల బోనాలు ముందు రోజు మావి ఆ తెల్లారిబతుకమ్మ దగ్గరైతే మా బతుకమ్మ వాళ్ల వాటికి ఆమడ దూరంలోనే ఉండాలిఒక్కటేమిటి ఊరికి వెళితే అడుగు అడుగునా కులం కండువా
కవిత్వం

‘మన కాలం పిల్లలు’

మేము మన కాలపు పిల్లలం.ఇది రాజకీయ కాలం.దినమంతా, రాత్రంతాఅన్ని వ్యవహారాలు, మీవి, మావి, వాళ్ళవి -అన్నీ రాజకీయ వ్యవహారాలేమీకిష్టమైనా, కాకపోయినా.నీ జన్యులకి రాజకీయ గతం వుందినీ చర్మం ఒక రాజకీయ కులంనీ కళ్ళు ఒక రాజకీయ దృష్టినువ్వేం చెప్పినా అది ప్రతిధ్వనిస్తుందినువ్వేం చెప్పకపోయినా దానికదే ఒక వ్యక్తీకరణ.కనుక రెండు విధాల నువ్వు రాజకీయాలు మాట్లాడుతున్నావు.నువ్వు అడవిలోకి ఎప్పుడైనా పోతున్నప్పుడు కూడనువ్వు రాజకీయ కారణాలతో రాజకీయ ఎత్తుగడలే వేస్తున్నావు.వి/రాజకీయ కవితలు కూడా రాజకీయమేమామీద ప్రకాశిస్తున్న చంద్రుడుఇంకెంత మాత్రమూశుక్ల వర్ణము కాదుఅస్తిత్వంలో ఉన్నామా లేమాఅదీ అసలు ప్రశ్న.అది జీర్ణం చేసుకోవడం కష్టం కావొచ్చుకాని అది ఎల్లప్పుడూ ఒక రాజకీయ ప్రశ్న.రాజకీయ అర్థాన్ని
కవిత్వం

మొక్కలను నాటుదాం

నీళ్లతో కాదు ఇప్పుడు ఆ నేలంతా నెత్తురుతో సాగు చేయబడుతుంది రండి మనమంతా కలిసి మొక్కలు నాటుదాం మోదుగు పువ్వులను ఆరుద్ర పువ్వులను అరుణతారలను కాస్త దగ్గరగా నాటుదాంఒకనాటికి ఎర్రని పువ్వుల వనాన్ని తయారు చేద్దాం మీకు తుపాకీతో ఎవరైనా కనబడితే ఒక మొక్కను నాటమని చెప్పండి నీడ వారికి కూడా అవసరమే కదా మొక్కలను నాటి నాటి చివరకు మీరు అలసిపోతే మీ కంటిమీద కునుకు ఏదైనా వస్తే ఇక్కడే ఇలాగే కాస్త విశ్రాంతి తీసుకోండి మీ చేతులకంటిన మట్టిని ముద్దాడడానికి మీరు నాటిన మొక్కలను చూడడానికి ఒక ఉదయాన తూర్పు కొండల నుండి ఎర్రని సూర్యుడు
కవిత్వం

సత్యమెప్పుడూ ఓడిపోదు

ఒక్కొక్కరూ నిన్ను చెరిపేస్తామని చెప్పే వాళ్ళే కానీ ప్రతి సారీ నువ్వో కొత్త చరిత్రగా నెత్తుటి సంతకంగా వేలాది పుటలుగా వెలుగొందుతున్నావు కోట్లాది ప్రజల ఆకాంక్ష కలలు నీలో దాగున్నవి వాటిని ఛిద్రం చేసేందుకు వాడెప్పుడూ ఆయుధాలనే నమ్ముకున్నాడు కానీ నువ్వెప్పుడూ నిరాయుధ ప్రజల చేతులలో సుత్తి కొడవలి నాగలిపనిముట్లతోనే ఇన్నేళ్ల యుద్ధాన్ని పోరాడుతూ సేద్యం చేస్తున్నావు పుడమీ ఆకాశమూ సూర్యుడూ చంద్రుడూ తోడుగా సాగే బాట నీది వాడెప్పుడు ఏవేవో కుట్రలు కుతంత్రాలతో నిన్ను ఓడిద్దామని విరుచుకు పడుతుంటాడు కానీ గడ్డి పరకలతో ఏనుగును బంధించిన చేతుల చేవ నీదని చరిత్ర చెబుతోంది మనుషులను చంపితే నిన్ను
కవిత్వం

వంగల సంతోష్ కవితలు ఐదు

1.పిల్లలుపసిపిల్లలఊయ్యాలలోపాలస్తీనానీవొకప్రతిఘటనలరంగుల రాట్నవిని..!2. ఉదయాలు..!ప్రపంచమంతాఉదయించినసూర్యుడుఎందుకోపాలస్తీనాలోకనబడలేదు..?3.నెలవంకనెలవంకనుచూసిఒక్కపొద్దులు ఉండేరంజాన్ మాసం ఇలానెత్తుటితో తడవడం ఏలా..?4.గర్భం..ఏ శిశువుకైనారక్షణ స్థలంఅమ్మ గర్భంకానీఇప్పుడుపాలస్తీనలోఅమ్మ గర్భాన్నిచీల్చిననరమేధపు ఇజ్రాయిల్..!5.ప్రేమ…!సుర్మా పెట్టే నీ కండ్లల్లోఈ నల్లటి ధూళి ఏలానిన్ను ముద్దాడేఆ పెదాల మీదఈ వెచ్చటి నెత్తురు ఎలాఓ ప్రియా..!!(పాలస్తీనాకు బాసటగా…)
కవిత్వం

వర్ధిల్లు పాలస్తీనా వర్ధిల్లు!

వర్ధిల్లు పాలస్తీనా వర్ధిల్లు !శాంతికోసం యుద్ధమై వర్ధిల్లుఐ. రా. స. శాంతిచిహ్నం ఒకచేత“ఇంతిఫదా " సంకేతంతుపాకీని మరొక చేత పట్టిగాజాలో స్వేచ్ఛగా ఉండటానికినీ పసిమొగ్గల భవిష్యత్ కోసంరక్తసిక్త అన్వేషణల మధ్యసహచరుల త్యాగాల మధ్యఅగ్రరాజ్యాల కుట్రల మధ్యదురాక్రమణదారుల మధ్యపశ్చిమాసియా చిచ్చర పిడుగైనీ జాతి కోసంనీ నేల కోసంసాగించు యుద్ధాన్ని తుదివిముక్తి దాక వర్ధిల్లు పాలస్తీనా వర్ధిల్లు!నీ నెత్తుటినేలలోశాంతిని పండించుపాలస్తీనా!నువ్విప్పుడు ఒంటరికాదునీపక్కన ఒమర్ ముక్తార్ స్ఫూర్తి ఉందిఅరాఫత్ త్యాగం నీతోడుందినువ్విప్పుడు పీడితదేశాల వేగుచుక్కవువర్ధిల్లు పాలస్తీనా వర్ధిల్లు!
కవిత్వం

ఆకురాలిన దృశ్యం

పచ్చని ఆకుల రాలడం కాదుపచ్చని చెట్ల మొదళ్లు కూల్చివేతలు కాదుఆకులనీడన వున్న యెన్ని జీవితాలుఎండుతాయో లెక్కెట్టుజీవితమంటే ఆకురాలిన సెట్టుదైనావయసు పెరిగిన మనిషిదైనావొకటేకదా! కూల్సడమంతా సులువు కాదుఆకులో పత్రహరితాన్ని నింపడంజీవితమూ అంతే....!నాలుగాకుల్ని తెంపడమంటేనాలుగు జీవితాలెండడమనిబోధపడదీ ఆధునిక మానువుడికీ.యిప్పుడంతా ప్లాస్టిక్ ఆకుల్నే ప్రేమించేదీసజీవ పసరుదనం ఎక్కడుంటుందీ ..?ఇప్పుడు ఆకులు పూయాల్సిన ప్రతిచోటా ఆకుల యంత్రంపుట్టుకొచ్చిందియిక మనుషుల్లో మాత్రం పసరు పుడుతుందా.!పుట్టదు పుట్టదుగాక పుట్టదుఒకేళ పుట్టినా యంత్రంలో దాని ఛాయవొస్తుందే తప్పాగిల్లితే కన్నీరు కార్చే ఆకులనెవరూ సృష్టించలేరు..!రాలిన ఆకుల కొమ్మ నుంచి మరొ పత్రం పుట్టినట్లురాల్చేసిన జీవితాల్లోని మళ్ళా ఒకజీవితానెందుకుపుష్పింపనివ్వరూఈ ఆధునిక యంత్రాలు..!ఆకురాలిన దృశ్యంఒకటిదర్శనమిస్తుందిపుష్పించే జీవితాలు కొన్నైతేదాన్ని వికసింపనీ తోడేళ్ళు యింకొన్నిరాలుతున్న ఆకులకు
కవిత్వం

జవాబులు  కోరడమూ నేరమే

జవాబు లేని చోటప్రశ్నే నేరమవుతుంది.తాము పుట్టి, అనాదిగా ఆశ్రయ ముంటున్న అడవుల్ని ధ్వంసం చేస్తున్నారు దేనికనీ?హద్దులు ఎరుగని తమ స్వేచ్ఛను అంతం చేస్తున్నారు ఏమిటని ?తామూ, తమ పూర్వీకులుశ్వాసించి, శోషించి,శోకించి, జీర్ణమైపోయిన మట్టినీ తమకు కాకుండా దోస్తున్నారు ఎందుకనీ ?తామూ పవిత్రంగా భావించే విశ్వాసాలు శిధిలమై పోతున్నాయి.దేనికని?వేన ఏళ్లుగా నాగరిక సమాజం చొరబడి, తమను మరింతగా లోపలికి తరుముతూ వుంటే...కలలే కాదు..కాళ్ళ కింద నేల కూడా కుదురుగా వుండడం లేదు.తమను ఏరి వేసి, ఆశలను చేరిపేస్తున్న చోట...ప్రశ్నిస్తున్న తమ బిడ్డలను మాయంచేసి, మింగివేసి, కడుపు కోతలను కానుకగా ఇస్తున్న చోట...ఎన్ని తంత్రాలు.. ఎన్ని మంత్రాలు ! వారిది కాని