ప్రభుత్వ బ్యాంకుల మెడపై ప్రైవేట్ కత్తి
దేశంలో ప్రభుత్వరంగ బ్యాంకులను పెద్దపెద్ద కంపెనీలు నిలువునా ముంచేస్తున్నాయి. మొండిబకాయిలు లేదా నిరర్థక ఆస్తులు (నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్/ఎన్‌పిఎ).. పేర్లు ఏవైనా, లాభపడుతున్నది ఎగవేత కంపెనీలు.. నష్టపోతున్నది ప్రత్యక్షంగా బ్యాంకులు, పరోక్షంగా ప్రజలు. ఘరానా కంపెనీలు బ్యాంకులను ముంచకపోతే, ఈ బ్యాంకుల లాభాలు మరింతగా పెరిగి ఉండేవి. పెద్దపెద్ద కార్పొరేట్ కంపెనీలు రుణాలను ఎగవేయడమే బ్యాంకులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. ప్రభుత్వం దర్జాగా మొండిబాకీలను రద్దు చేస్తోంది. ఇలాంటి రుణాలను రద్దు చేయడం కంటే, వసూలు చేయాల్సిన అవసరం ఉందని ఎఐబిఇఎ చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నది. కానీ, కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోకపోగా, మరింతగా రాయితీలను










