పశ్చిమాసియాలో అమెరికా యుద్ధోన్మాదం
మనుషుల శవాల గుట్టలపై, ఎముకల కుప్పలపై, రక్త ప్రవాహాలపై రాజ్యపాలనని సుస్థిర పరచుకునే దుష్ట లక్ష్యంతో దోపిడీ పాలకవర్గాలు కృత్రిమ యుద్ధాలు సృష్టస్తాయని, రెండు దేశాలు లేదా రెండు కూటముల మధ్య జరిగే యుద్ధాలు సారాంశంలో తమ సొంత దేశ పేద వర్గాలపై సాగే యుద్ధాలు అని లెనిన్ చాలా స్పష్టంగా చెబుతాడు. సామ్రాజ్యవాద రక్త పిపాసి, పెట్టుబడి లాభాపేక్ష లేకుండా మానవాళి చరిత్రలో జరిగే యుద్ధాలు దాదాపు అరుదు. ఈ యుద్ధ జ్వాలల్లో సామాన్యులే సమిధలవుతారు. తాజా పశ్చిమ ఆసియా పరిణామాలు కూడా దీనికి మినహాయింపు కాదు. పన్నెండు రోజులపాటు జరిగిన యుద్ధం అటు ఇరాన్లోను, ఇటు










