ఆర్ధికం

మోడీ ఏలుబడిలో అప్పుల భారతం

మోడీ ఏలుబడిలో అప్పులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.  2026 మార్చి నాటికి మొత్తం అప్పు రూ. 191 లక్షల కోట్లు దాటనుంది. దేశంలోని ఒక్కొక్కరి నెత్తిపై రూ.1.37 లక్షల అప్పు ఉంది. యేటా చెల్లిస్తున్న వడ్డీ రూ. 12,76,338 కోట్లు. కేంద్ర ప్రభుత్వం చేసే అప్పులే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల అప్పులు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఈ అప్పులను తీర్చడానికి ప్రభుత్వాలు సహజంగానే ఆదాయాలు పెంచుకోవడం తప్ప మరో మార్గం లేదు. ఈ ఆదాయాలు పెంచుకోవడానికి ప్రభుత్వాలు ప్రజల మీద విపరీతమైన భారాలు వేస్తున్నాయి. ఖర్చులు తగ్గించుకోవడం పేరు మీద ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకపోవడం, సంక్షేమ పథకాలలో
ఆర్ధికం

డాలర్‌ కోటకు బీటలు!

గ్లోబల్‌ కరెన్సీగా అమెరికన్‌ డాలర్‌కు ఉన్న పట్టు క్రమంగా సడలిపోతోంది. రిజర్వు కరెన్సీగా, కరెన్సీ మార్పిడి మాద్యమంగా ఏడు దశాబ్దాలుగా ఆధిపత్యం చెలాయిస్తున్న అమెరికా డాలర్‌ ఇటీవలి కాలంలో తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటున్నది. ఇప్పటిదాక అమెరికా సైనిక, ఆర్థిక దండోపాయంతో ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకుంది. తనమాట వినని దేశాలపై ఆంక్షల కొరడాతో, డాలర్‌ అనే ఆయుధంతో, లేదంటే మిస్సైళ్ల మోతతో చెలరేగుతున్న అగ్రరాజ్య అమెరికా కోరలు పీకేందుకు దండయాత్ర మొదలైంది. ఇన్నాళ్లు ఏ డాలర్‌ అండతో అమెరికా విర్రవీగిందో, సరిగ్గా ఆ కుంభస్థలంపై కొట్టేందుకు అనేక దేశాలు చీమల దండులా కదం తొక్కుతున్నాయి. గ్లోబల్‌ కరెన్సీగా రాజ్యమేలుతున్న
ఆర్ధికం

ట్రంప్ విధానాలతో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం

ప్రపంచ దేశాల ఉత్పత్తి, మార్పిడి, వినియోగం కార్యకలాపాల మొత్తాన్ని ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంటారు. ఇది ప్రపంచ దేశాల మధ్య అంతర్జాతీయ వాణిజ్యం ద్వారా అనుసంధానించబడి ఉంటుంది. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన భాగం. ఇది ప్రపంచీకరణలో ఒక భాగం. ఇప్పటికీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అమెరికా అగ్రస్థానంలో ఉంది. ఆ తరువాత స్థానంలో చైనా, జర్మనీ, జపాన్‌, భారత్‌లు ఉన్నాయి. అమెరికా అధ్యకక్షుడు ట్రంప్‌ ఏప్రిల్‌ 2న విముక్త దినోత్సవం రోజున ప్రకటించిన దిగుమతి సుంకాల పెంపుతో అకస్మాత్తుగా వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ప్రస్తుత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి, బలహీనమైన వృద్ధి నెలకొంది. అన్నీ
ఆర్ధికం

గరిష్టానికి ప్రపంచ రక్షణ వ్యయం

ప్రపంచ సైనిక వ్యయం అల్‌టైమ్‌ గరిష్ట స్థాయికి చేరుకుంది. 2022లో సైనిక వ్యయం అత్యధికంగా 2.24 ట్రిలియన్‌ డాలర్లకు చేరినట్లు ప్రముఖ రక్షణ అధ్యయన సంస్థ సైనిక వ్యయంపై స్టాక్‌హోమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎస్‌ఐపిఆర్‌ఐ) మార్చి 13న విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. విదేశాల నుండి సైనిక పరికరాలు కొనడానికి భారత్‌ 2020-21 లో రూ|| 4 లక్షల 71 వేల కోట్లు, 2021-22 లో రూ|| 4 లక్షల 78 వేల కోట్లు, 2022-23 లో రూ|| 5 లక్షల 25 వేల కోట్లు, 2023-24 లో రూ|| 5 లక్షల 93 వేల
ఆర్ధికం

మందగిస్తున్న అమెరికా ఆర్థిక వ్యవస్థ

మాంద్యం అంటే ఆర్థిక కార్యకలాపాలలో గణనీయమైన, విస్తృతమైన, సుదీర్ఘమైన తిరోగమనం, దీనిలో స్థూల దేశీయోత్పత్తి(జిడిపి)తో పాటు ఉద్యోగాల సంఖ్య, పారిశ్రామిక ఉత్పత్తి, అమ్మకాల వంటివి తగ్గుతాయి. సాధారణంగా, వరుసగా రెండు త్రైమాసికాల పాటు జిడిపిలో సంకోచం ఉంటే దాన్ని మాంద్యం అంటారు, అయితే దీనిని అమెరికాలో ''అధికారిక మాంద్యం స్కోర్‌ కీపర్‌'' అయిన నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ ఎకనామిక్‌ రీసెర్చ్‌ (ఎన్‌బిఇఆర్‌) నిర్వచిస్తుంది. మాంద్యం యొక్క ముఖ్య లక్షణాలు 1) ఆర్థిక వ్యవస్థలో మొత్తం పనితీరు తగ్గుతుంది. 2) ఉద్యోగాల సంఖ్య తగ్గి, నిరుద్యోగిత పెరుగుతుంది. 3) కంపెనీలు సరుకులను ఉత్పత్తి చేయడాన్ని తగ్గిస్తాయి. 4) ఈ ప్రభావం
ఆర్ధికం

అసమానతలు పెంచుతున్నఉపాధి రహిత వృద్ధి

తొమ్మిదేళ్లుగా ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి పాలనలో రాజ్యాంగం అమలు కావడం లేదు.  సమానత్వాన్ని, లౌకిక  తత్వాన్ని తృణీకరించే మనువాద భావజాల పాలన కొనసాగుతోంది. ఈ కాలంలో ఆర్థిక అసమానతలు, సంపద కేంద్రీకరణ విపరీతంగా పెరిగింది. సామాజిక, ఆర్థిక సమానత్వ ఆదర్శం బిజెపి- కార్పొరేట్‌ ఫాసిస్టు పెట్టుబడిదారీ విధానం వల్ల బీటలు బారింది. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోంది. సామ్రాజ్యవాదుల కనుసన్నల్లో ఉంటూ దేశ సహజ వనరులను స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకు దారాదత్తం చేస్తూ మన దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టింది. సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య స్ఫూర్తిని, ప్రభుత్వరంగ అభివృద్ధి, పౌరస్వేచ్ఛ, మానవ హక్కులను తుడిచివేసే ఫాసిస్టు పాలన కొనసాగుతోంది. ఫలితంగా
ఆర్ధికం

భారత్‌లో నిప్పుల కొలిమిలా నిరుద్యోగం

భారతదేశ ఆర్థిక రంగాన్ని సవాలు చేస్తున్న ఒక క్లిష్టమైన సమస్య నిరుద్యోగం. అత్యంత కీలకమైన సూచికలలో ఒకటి. ఇది దేశంలోని నిరుద్యోగిత రేటు ఉద్యోగాల లభ్యతను మాత్రమే కాకుండా వివిధ రంగాలలో(వ్యవసాయ, పారిశ్రామిక, సేవా) శ్రామిక శక్తి భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తుంది. అధిక జనాభా కలిగిన వ్యవసాయక దేశాలలో ఒకటిగా, విభిన్న శ్రామిక శక్తి కలిగిన దేశంగా, నిరుద్యోగ రేట్‌ ఆర్థిక వృద్ధి, దేశ అభివృద్ధిపై విస్తృతమైన ప్రభావాన్ని చూపుతోంది. పిరియాడికల్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే (పిఎల్‌ఎఫ్‌ఎస్‌) నివేదిక ప్రకారం భారతదేశ నిరుద్యోగం రేటు ఏప్రిల్‌లో 5.1 శాతం ఉండగా జూన్‌ 2025 నాటికి 5.6 శాతానికి పెరిగింది. మన
ఆర్ధికం

మాంద్యంలోకి ప్రపంచ దేశాలు

            మరోసారి ఆర్థిక సంక్షోభం రాబోతున్నదా! ప్రపంచ దేశాలు మాంద్యం బారిన పడబోతున్నవా! రష్యా-యుక్రెయిన్‌ దేశాల మధ్య యుద్ధంతో ఇప్పడికే భారీగా నష్టబోయిన ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థకు మళ్లీ చిల్లులు పడబోతున్నాయా! ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇది నిజమేననిపిస్తున్నది. గత ఆరు మాసాలుగా ప్రపంచ దేశాల సెంట్రల్‌ బ్యాంకులు క్రమంగా ఒక్కొక్కటి వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరుకున్నదన్న సాకును చూపెడుతూ అన్ని దేశాల బ్యాంకులు వడ్డీ రేట్లను ఒక్క శాతం పైనే పెంచేశాయి. ఈ నిర్ణయాలతో మదుపరుల్లో ఆందోళన తీవ్ర స్థాయికి చేరుకున్నది. ప్రపంచ వ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. కరోనా సంక్షోభం
ఆర్ధికం

అస్తవ్యస్తంగా భారత ఆర్థికం

ఫిబ్రవరి 24వ తేదీ న్యూఢిల్లీలో జరిగిన జి-20 దేశాల ఆర్థిక మంత్రుల, సెంట్రల్‍ బ్యాకుంకు గవర్నర్ల సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన సందేశం ఇది! ‘‘భారత ఆర్థిక వ్యవస్థ అద్బుతంగా పురోగమిస్తోంది.భారతీయ వినియోగదారులు, ఉత్పత్తిదారులు భవిష్యత్తు పట్ల ఆశాజనకంగానూ, విశ్వాసంగానూ ఉన్నారు. దీని నుండి ప్రపంచ దేశాలు స్ఫూర్తిని పొందాలి. ఈ సమావేశంలో పాల్గొంటున్న వారు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అదే సానుకూల దృక్పథాన్ని అందించగలరని మేం ఆశిస్తున్నాం. ప్రపంచ వృద్ధిలో స్థిరత్వాన్ని, నమ్మకాన్ని సాధించాలంటే అదొక్కటే మార్గం’’. ప్రధాని ఆ మాటలు చెప్పి పది రోజులు గడవకవ•ందే వాల్‍స్ట్రీట్‍ జర్నల్‍ తాజాగా దానికి పూర్తి భిన్నమైన
ఆర్ధికం

ఎటూ తేలని చర్చలు.. ఆగని యుద్ధం

రష్యా, యుక్రెయిన్‌ల మధ్య యుద్ధం 2022 ఫిబ్రవరి 24 నుంచి కొనసాగుతోంది. ఈ యుద్ధం కారణంగా ఇరు దేశాల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ యుద్ధంలో యుక్రెయిన్‌ సర్వనాశనం కాగా, రష్యా పశ్చిమ దేశాల నుండి ఒంటరి అయింది. యుక్రెయిన్‌పై రష్యా డ్రోన్‌ దాడులు, వైమానిక దాడులు, ఆప్టిక్‌ పైబర్‌ డ్రోన్‌ దాడులు వంటివి జరుగుతున్నాయి. రష్యా పలుసార్లు యుక్రెయిన్‌పై బాంబుల వర్షం కురిపించింది.  రోజురోజుకూ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. యుక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి మొదటి నుంచి అండదండగా నిలుస్తున్న ఐరోపా దేశాలు రష్యా దూకుడుపై ఆగ్రహంతో ఉన్నాయి. యుక్రెయిన్‌ రష్యా మధ్య శాంతి