ఆర్ధికం

డీ-డాలరైజేషన్

మొదటి ప్రపంచ యుద్ధ అనంతరం 1920ల నుండి అమెరికా డాలర్‌, బ్రిటన్‌ పౌండ్‌ స్టెర్లింగ్‌ను అంతర్జాతీయ రిజర్వ్‌ కరెన్సీగా   స్థానభ్రంశం చేయడం ప్రారంభించింది. యుద్ధం తర్వాత బంగారం ప్రవాహాలలో అమెరికా గణనీయమైన గ్రహీతగా ఉంది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా మరింత బలమైన సూపర్‌ పవర్‌గా అవతరించింది.1944 నాటి బ్రెట్టన్‌ వుడ్స్‌ ఒప్పందం రెండవ ప్రపంచ యుద్ధానంతర అంతర్జాతీయ ద్రవ్య వ్యవస్థను స్థాపించింది. దీంతో అమెరికా డాలర్‌ అంతర్జాతీయ వాణిజ్యం కోసం ప్రపంచంలోని ప్రాథమిక రిజర్వ్‌ కరెన్సీగా మారింది. యుద్ధానంతర కరెన్సీ బంగారంతో ముడిపడి ఉన్న ఏకైక అంతర్జాతీయ కరెన్సీ, ట్రాయ్‌ ఔన్సుకు 35 డాలర్లుగా స్థిరీకరించింది.
కాలమ్స్

ఈ కవిత్వం గూర్చి మాట్లాడదాం రండి..!!

(ప్రముఖ కవి , సాహిత్య విశ్లేషకుడు , సాహితి స్రవంతి నాయకుడు కంగార మోహన్ ఈ సంచిక నుంచి కొత్త పుస్తకాల సమీక్షా కాలం *ఈ పుస్తకం  చదివారా ?* ప్రారంభిస్తున్నారు - వసంత మేఘం టీం ) సాహిత్యంలో వస్తువు పాఠకులకొక సారాన్ని అందించాలి. అలా అందించడానికి తగిన రచనా విధానాన్ని వదిలిపెట్టి, వస్తువుకు అనవసరమైన అలంకరణల్ని అతికించడం వల్ల ప్రయోజనం లేదు. సాహిత్యాన్ని చదివినవాడు లేదా విన్నవాడు ఆనందించడంతోబాటు ఎంతో కొంత చైతన్యానికి గురికావాలి. సుష్టుగా భోంచేశాక నిద్ర వచ్చినట్టుండకూడదు సాహిత్యం. అది ఆలోచింపజెయ్యాలి. ఆ ఆలోచనచైతన్యాన్నివ్వాలి. ఆ చైతన్యం కార్యరూపం ధరించాలి. ఆనందించడానికే అయితే
లోచూపు

ఫాసిస్టు క్రమాల పరిశీలన

పెట్టుబడి తోపాటు  ఆవిర్భవించిన ఆధునిక యుగంలోని రాజకీయాలకు రెండు తీవ్ర అంచులు ఉంటాయి. ఒకటి బూర్జువా ప్రజా స్వామ్యం, రెండు అత్యంత  ప్రగతి నిరోధక ఫాసిజం. పెట్టుబడిదారీ రాజకీయాలు ఈ రెండు అంచుల ద్వంద్వం మధ్యనే లోలకంలా కొనసాగుతాయి. పెట్టుబడి కి ఉన్న   స్వభావం వల్ల నే వలస రూపంలో   ప్రపంచమంతటా  విస్తరించింది.   ఈ  క్రమంలోనే దేశ దేశాలలో ప్రజలు  సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా  స్వేచ్ఛ, స్వాతంత్య్రం కోసం పోరాడారు. ప్రత్యక్ష వలస పెట్టుబడిదారీ విధానం అంతమై పరోక్ష వలస పెట్టుబడిదారీ విధానం మొదలైంది.   పెట్టుబడి ద్రవ్య పెట్టుబడి గా బలపడినాక దాని పని విధానం మారించి. దాని 
కథనం

ఈ పసిపాపల కథ వింటారా?

‘మీ డబ్బులు నాకక్కర్లేదు. మీ ఓదార్పూ అక్కర్లేదు. నాక్కావాల్సింది నా పిల్ల. తలకి తల కావాలి’ కోపం, దుఃఖంతో అన్నది మాసే సోడి. ఆమె రెండు చేతి వేళ్ళకు గాయాలయ్యాయి. ‘ఈళ్ళను కూడా పట్టుకుపొండి. మాకు మీ సామాన్లు అక్కర్లా. నా పిల్లను చంపి సామాన్లు పడేసి పోయారు. నాకు నా పిల్ల కావాలి. పిల్లను చంపిన పోలీసులు, డి.ఆర్‌.జి. గుండాలను ఎంటనే శిక్షించాలి’ ఖరాఖండిగా అన్నాడు బామన్‌ సోడి. మాసే, బామన్‌ మంగ్లి తల్లిదండ్రులు. ‘మేం చంపలేదు’ పోలీసులు. ‘ఆరోజు దీదీని తరిమింది నువ్వేగా! నీకు తల్లి లేదా? చెల్లె లేదా? నీకు పిల్లల్లేరా? ఈ నొప్పి
సమకాలీనం

చె గువేరా’మోటార్ సైకిల్ డైరీస్’అంటే ఎందుకంత భయం?

చె గువేరా భూతం ఇప్పుడు భారత రాజ్యాధికారాన్ని వెంటాడుతోంది. అతని ఆత్మ సమాధి నుండి బయటకు వచ్చి భారతీయ పాలక వర్గాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు కనిపిస్తోంది. చె గువేరా ను చూసి భయపడే నేటి పాలకులను చూస్తుంటే , చె తనను కాల్చి చంపేస్తున్న అమెరికన్ సైనికులు తనపై తూటాలు పేల్చి చంపుతున్న అమెరికా సైనికులతో  సరిగ్గా చెప్పినట్లు అనిపిస్తుంది – “నన్ను కాల్చకండి! నేను చే గువేరాను. నేను బతికి వుంటే మీకు మరింత ఉపయోగకరంగా ఉంటాను. మరణానంతరం నేను మీకు మరింత ప్రమాదకరమని నిరూపిస్తాను” అలాగే జరిగింది. అమరత్వం తరువాత చే ప్రపంచ యువతకు విప్లవానికి,
సమకాలీనం

ఉత్తరాఖండ్‌లో ఖలంగా అడవి కోసం యువత, అడ్డుకున్న “దేశ భక్త” గుంపు

వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ జరుగుతున్న ఈ కాలంలో, మరిన్ని చెట్లను నాటాలని, అడవులను కాపాడాలని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం జరుగుతున్న సమయంలో   నగరం పక్కనే ఉన్న మరో అడవిని నాశనం చేయడానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రణాళిక తయారుచేసింది. ఈసారి  దట్టమైన సాల్ చెట్ల  ఖలంగా కొండల అడవి వాళ్ళ  లక్ష్యం. ఇక్కడ సౌంగ్ నది తాగునీటి పథకానికి సంబంధించిన నీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం ఏటా రెండు వేల చెట్లను నరికివేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.  నరకబోయే చెట్లకు ఇటీవల గుర్తులు కూడా పెట్టారు. గుర్తు పెట్టడం అంటే నరకబోయే చెట్లకు గుర్తుగా గొడ్డలితో
ఆర్ధికం

పెరిగిన నిరుద్యోగం – తగ్గిన నిజ వేతనం

వికసిత భారత్‌, అచ్ఛేదిన్‌, అమృత్‌కాల్‌ ఇత్యాది అద్భుతపదజాలంతో ఎన్నికల్లో ఘన విజయాలు సాధించాలని భారతీయ జనతాపార్టీ అనుకుంటూంటే, దేశంలో పరిస్థితులు అంత పచ్చగా ఏమీ లేవని, మోడీ గొప్పగా ప్రకటించిన మేక్‌-ఇన్‌-ఇండియా, స్టార్టప్‌ ఇండియా, స్టాండప్‌ ఇండియా, స్కిల్‌ ఇండియా వంటి పథకాలు ఏవి యువత ఉపాధికి తోడ్పడలేదు. పైగా పరిస్థితులు మరింత దిగజారిపోతున్నాయని ఇటీవల మానవాభివృద్ధి సంస్థ, అంతర్జాతీయ కార్మిక సంస్థ సంయుక్తంగా నిర్వహించిన తాజా అధ్యయనంలో మనదేశంలో నెలకొన్న నిరుద్యోగ సమస్య తీవ్రతను కళ్లకు కడుతున్నది. పలు అంతర్జాతీయ నివేదికలు ఉపాధి దెబ్బతిన్నదనీ, అసమానతలు ఆకాశాన్నంటాయని, సగం బలం అనుకున్న సంతోషానికి కూడా ఈ దేశపౌరుడు
ఆర్ధికం

ఎలక్టోరల్‌ ఆటోక్రసీగా భారత్‌

స్వీడన్‌(గోథెన్‌బర్గ్‌) ఆధారిత వి-డెమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ‘డెమోక్రసీ రిపోర్ట్‌ 2024’ ని మార్చి 7న విడుదల చేసింది. ప్రజాస్వామ్య నివేదిక 2024 ప్రపంచవ్యాప్తంగా 4,200 మంది ప్రతిభావంతుల సహకారంపై ఆధారపడిరది. 1789 నుండి 2023 వరకు 202 దేశాలకు సంబంధించిన 31 మిలియన్‌ డేటాసెట్‌లను ఉపయోగించుకుంది. వి-డెమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ దేశాలను నాలుగు రకాలుగా వర్గీకరిస్తుంది. అవి: లిబరల్‌ డెమోక్రసీ, ఎలక్టోరల్‌ డెమోక్రసీ, ఎలక్టోరల్‌ ఆటోక్రసీ,  క్లోజ్డ్‌ ఆటోక్రసీ. 2023 నాటికి, ప్రపంచ జనాభాలో 71 శాతం (5.7 బిలియన్ల ప్రజలు) నిరంకుశ పాలనలో నివసిస్తున్నారు. ఇది దశాబ్దం క్రితం ఉన్న 48 శాతం కంటే గణనీయమైన పెరుగుదల. ప్రపంచ జనాభాలో
ఆర్ధికం

పొంతన లేని జిడిపి వృద్ధి అంకెలు

దేశ జిడిపికి సంబంధించి జాతీయ గణాంకాల కార్యాలయం ఫిబ్రవరి 29న విడుదల చేసిన గణాంకాలు ఆశ్చర్యపరిచాయి. నిపుణులను కలవరపరిచాయి. ప్రభుత్వ అంచనాలను, స్వంత డేటాను తారుమారు చేసింది. కారణం ఏమి కావచ్చు? ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన ముడో త్రైమాసికం (క్యూ3)లో జిడిపి 8.4 శాతం పెరిగిందని ఎన్‌ఎస్‌ఓ గణాంకాలు చూపుతున్నాయి. క్యూ1, క్యూ2 వృద్ధి రేటును కూడా సవరించింది. 2023-2024 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో భారత జిడిపి వృద్ధిరేటు విశ్లేషకుల అంచనాలను అధిగమించింది. ఇంతకుముందు త్రైమాసికంలో నమోదైన 8.1 శాతంతో పోల్చితే ఇది అధికం. గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన 4.5 శాతం వృద్ధి
ఆర్ధికం

మాంద్యంలోకి ప్రపంచ దేశాలు

ఆర్థిక మందగమన మేఘాలు ప్రపంచాన్ని కమ్మేస్తున్నాయి. ఆ దేశం ఈ దేశం అని లేదు... అగ్రరాజ్యం, చిన్న రాజ్యం అని లేదు. అన్నింటినీ కబళించి వేయడానికి మాంద్యం దూసుకోస్తోంది. ఒకవైపు యుద్ధాలు, యుద్దాలతో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ విబేధాలు మరోవైపు పర్యావరణ మార్పులు, కారణాలేమైతేనేం... ప్రపంచాన్ని క్రమంగా మాంద్యం మేఘాలు కమ్ముకుంటున్నాయి. జపాన్‌ ఇటీవలే ఆర్థిక మాంద్యపు ఛాయల్లోకి జారుకుంది. ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో మూడు నుంచి నాలుగో స్థానానికి దిగజారింది. బ్రిటన్‌ కూడా సాంకేతికంగా మాంద్యంలోకి జారుకుంది. అయితే ఇది ట్రైలర్‌ మాత్రమేనని ఆర్థికవేత్తలంటున్నారు. పదుల సంఖ్యలో దేశాలు ఆర్థిక ఒడిదొడుకులతో విపరీతంగా